బీఆరఎస్ ను ఓడించింది కాంగ్రెస్ కాదు!
బీఆరఎస్ ఓటమికి సొంత నేతలే కారణం!
—————————————-
జిల్లాల వారీగా నాయకుల “లంగా రాజకీయాల” తీరుపై మీ “నేటిధాత్రి”లో వరుస కథనాలు..
కూర్చున్న కొమ్మలను నరికేస్తున్న వారి ఒక్కొక్కరి జాతకాలు వరుసగా త్వరలో
—————————————-
`నేను గెలిస్తే చాలు అని అందరూ అనుకున్నారు.
`జిల్లాల వారీగా పేరు మోసిన నాయకులు లంగ రాజకీయం చేశారు.
`ఉమ్మడి జిల్లాలో తమకు ఎదురులేకుండా చూసుకోవాలనుకున్నారు.
`పైకి కనిపించని కుట్రలు, కుతంత్రాలు చేశారు.
`అగ్ర నాయకుల గ్రూపులే బిఆరఎస్ కొంప ముంచాయి!
`నాయకులు, కార్యకర్తలను విడదీసి రాజకీయం చేశారు.
`గ్రూపుల వారీగా ఒకరినొకరు పక్కన పెట్టే చిల్లర రాజకీయం చేశారు.
`అందరం గెలిస్తేనే పార్టీ అధికారం లోకి వస్తుందనే వాస్తవం మర్చిపోయారు.
`అందరూ గెలిస్తే తమకు మంత్రి పదవులు దక్కవని అనుకున్నారు.
`మంత్రి పదవులు ఆశించిన వాళ్లే ఇదంతా చేశారు.
`పైకి అమాయకుల్లా నటిస్తున్నారు.
`ఇప్పటికీ అందరం గెలవాలన్న ఆలోచనలో ఎవ్వరూ లేరు.
`మేము గెలిస్తే చాలు అనే స్వార్థంలోనే వున్నారు.
`మాటలు ప్రజలకు చెప్పమంటే అగ్ర నేతలకు చెబుతున్నారు.
`ఎవ్వరి పరపతి వాళ్ళు పెంచుకునే ప్రయత్నమే చేస్తున్నారు.
`తమ ఆధిపత్యానికి డోకా లేకుండా చూసుకుంటున్నారు.
`అధినేత కేసీఆర్ తో సహా అగ్రనేతలను మోసం చేస్తున్నారు.
`చెప్పుడు మాటలు చెప్పే వారి మాటలే అగ్ర నేతలు నమ్ముతున్నారు.
`నిజాయితీగా పనిచేసే వారి మీద అనుమానపు చూపులు చూస్తున్నారు.
`హడావిడి చేసే వారికే పార్టీ కూడా ప్రాధాన్యత కల్పిస్తోంది.
`చెవులు కొరికే వారినే పక్కన పెట్టుకొని నమ్మేస్తోంది.
`క్షేత్ర స్థాయిలో పని చేసే వారిని గుర్తించడం లేదు.
`అగ్ర నాయకుల ముందు హడావిడి చేసే వాళ్లే నిజమైన నాయకులు అని నమ్ముతున్నారు.
`సర్పంచ్ ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటమికి కారణమైంది.
`బీఆరఎస్ అభ్యర్థుల ఓటమికి బీఆరఎస్ నాయకులే కారణం.
హైదరాబాద్, నేటిధాత్రి:
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని సామెత. బిఆరఎస్‌లో ఇప్ప్పుడు అదే నిజమని కనిపిస్తోంది. సహజంగా రాజకీయ పార్టీలలో ఇలాంటి వారు వుంటారనేది అందరికీ తెలుసు. కాని బిఆరఎస్‌లో ఎక్కువగా వున్నారు. అదికారంలో వున్నప్ప్పుడు మేమే, మా వల్లనే అనుకుంటారు. ఓడిపోతే ఇతరుల మీద తోసేస్తుంటారు. కాని ఎప్ప్పుడూ తమ పెత్తనమే సాగాలనుకునే వారు ఎక్కువయ్యారు. నిజం చెప్పాలంటే బిఆరఎస్‌ను ప్రజలు దూరం చేసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఓడించలేదు. ఒక వేళ ప్రజలే బిఆరఎస్‌ను వద్దనుకుంటే గత ఎన్నికల్లో కనీసం 20 సీట్లకు మించి గెలిచేది కాదు. కాని నాయకులు లంగ రాజకీయం మÖలంగానే ఇదంతా జరిగింది. బిఆరఎస్ ఓడిపోయిన తర్వాత బాధపడింది ప్రజలే. ఇప్ప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నది ప్రజలే. ఆ ప్రజలు కేసిఆర్‌ను ఎంత బలంగా కోరుకుంటున్నారో ఓడిపోయిన నాటి నుంచి అర్దమౌతూనే వుంది. శాసనసభ ఎన్నికల్లో బిఆరఎస్ ఓటమికి పరోక్షంగా కారణమైన వాళ్లే, పార్లమెంటు ఎన్నికల్లో అదే కొనసాగించారు. ప్రత్యర్ధి పార్టీలకు ఉప్పందించారు. రాజకీయం గుట్టుగా చేశారు. కాని పైకి మాత్రం అంతా సుద్దపూసలుగానే నటిస్తూవున్నారు. ఈ విషయం అగ్రనాయకుల దాకా వెళ్లకుండా ఎంతో జాగ్రత్తపడుతున్నారు. ద్వితీయ శ్రేణినాయకులను, కార్యకర్తలను నేరుగా అగ్ర నాయకులను కలవకుండా చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా అటు కేటిఆర్, ఇటు హరీష్‌రావులు నిత్యం ప్రజల్లోనే వుంటారు. అనేక పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జిల్లాల పర్యటనలు కొనసాగిస్తున్నారు. పార్టీ బలోపేతానికి ఎనలేని ప్రయత్నం చేస్తున్నారు. అయినా పార్టీ ఎందుకు గెలవలేకపోతోంది? ఉప ఎన్నికల్లో ఎందుకు దారుణ పరాయజాలు మÖట గట్టుకుంటోంది? సర్పంచ్ ఎన్నికల్లో ఎందుకు అనుకున్న సర్పంచ్‌లు గెలవలేకపోయింది? మున్సిపల్ ఎన్నికల్లో అంత దారుణ ఓటమికి కారమేమై వుంటుందన్న సంగతిని అగ్ర నేతలదాకా వెళ్లడం లేదు. జిల్లాల పర్యటనలకు వచ్చినా, రాష్ట్ర స్థాయి నాయకుల సమావేశాలైనా సామాన్య కార్యకర్తల సూచనలేవి? వారి సలహాలు ఏవి? వాళ్లు అగ్ర నాయకులతోటి సెల్ఫీలకే పరిమితం చేస్తున్నారు. అయినా అగ్ర నాయకులు ప్రతి జిల్లా కేంద్రంలో ఓ మÖడు నాలుగు రోజులు వుండండి. ప్రతి నాయకుడి మనోగతం తెలుసుకోండి. ప్రతి కార్యకర్త తన మనసులోని మాటను చెప్పే అవకాశమివ్వండి. హడావుడి పర్యటనలు, సమావేశాల మÖలంగా ఒరిగేదేమీ లేదు. కార్యకర్తలు ఎగబడి నినాదాలు చేస్తున్నారు. కాని వారిని అగ్ర నాయకులు దరి చేరనివ్వడం లేదు. ఎమ్మెల్యేలను కలవడమే పెద్ద టాస్క్‌గా మారిపోయింది. స్ధానిక నాయకత్వాలలో వున్న అసంతృప్తిని ఎందుకు అర్దం చేసుకోవడం లేదు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎంత మంది కార్యకర్తలను పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. ఎంత మందికి భరోసా కల్పిస్తున్నారు. కార్యకర్తల ప్రత్యేక సమావేశాలు అగ్రనాయకులు కేటిఆర్, హరీష్‌రావులు ఎందుకు నిర్వహించడం లేదు. ఇదంతా కొంత మంది ఉమ్మడి జిల్లాలో పెద్ద నాయకులు చేస్తున్న దుష్ట రాజకీయం. అగ్ర నాయకుల వద్దకు కార్యకర్తలను రానివ్వడం లేదు. వారి వాయిస్ వినిపించనీయడం లేదు. ఎంత సేపు అగ్ర నాయకుల చుట్టూ పాత నాయకులే వుంటున్నారు. తమ పరపతే నడవాలనుకుంటున్న వారు మÖగిపోతున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులకు ఎందుకు అవకాశం కల్పించడం లేదు. తెలంగాణ ఉద్యమ కాలంనుంచి ప్రత్యర్ధి పార్టీల నాయలను ఎదుగకుండా చేయగలిన నాయకులు, ఇప్ప్పుడు సొంత పార్టీ నాయకులు ఎదగకుండా చూసుకుంటున్నారు. వారి మాట పార్టీలో వినిపించకుండా చూసుకుంటున్నారు. దాంతో ప్రత్యర్ధి పార్టీలకు అవకాశమిస్తున్నారు. పిల్లి, పిల్లి కొట్లాడి కోతికి కొబ్బరి చిప్ప చేతుల పెట్టినట్లు రాజకీయం చేస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీలు ఎదిగినా సరే, సొంత పార్టీలో నాయకులు ఎదగకుండా చూసుకుంటున్నారు. మొత్తంగా పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారు. అలాంటి నాయకులు చాలా మంది ఇప్పటికే పార్టీ విడిచి వెళ్లిపోయేవారు. కాని ప్రజల్లో బిఆరఎస్పార్టీయే కనిపిస్తుంది. వచ్చే ఎన్నికలు తమకు అనుకూలంగా వుంటాయన్న భరోసా వుండడం వల్లనే వాళ్లు పార్టీలో వుంటున్నారు. లేకుంటే ఎప్ప్పుడో వెళ్లిపోయేవారు. ఎప్ప్పుడూ వాళ్ల స్వార్ధమే వాళ్లు చూసుకుంటున్నారు. అగ్ర నాయకుల్లో కూడా విభేధాలున్నట్లు జరిగే ప్రచారాన్ని ఎవరూ ఖండించడం లేదు. గతంలో అనేక గ్రూపుల గురించి మాట్లాడేవారు. ఇప్ప్పుడు రాష్ట్ర స్దాయిలో రెండు గ్రూపులు అంటున్నారు. అదే జిల్లాలకు పాకింది. రాష్ట్ర గ్రూపు నుంచి జిల్లా గ్రూపులు శాఖలుగా మారిపోతున్నాయి. పార్టీకి తీరని నష్టం కల్గిస్తున్నాయి. గత ఇరవై సంవత్సరాలుగా ప్రతిపక్ష కాంగ్రెస్ ఉనికి అనేది కనిపించకుండా చూసుకున్న నాయకుడు హరీష్‌రావు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఆయన ప్రత్యర్ధి కాంగ్రెస్‌ను మోడువారిన చెట్టుగానే మార్చేశారు. ఇప్పటికీ ఆయన నియోజవర్గంలో కాంగ్రెస్ అనేది మనుగడ కోసం ఆరాటపడుతోంది. అయినా అక్కడ హరీష్‌రావుకు కాంగ్రెస్‌లో ధీటైన నాయకుడు ఎవరూ లేరు. కాని బిఆరఎస్లోనే ఎందుకు అక్కడ అలజడి కనిపిస్తోంది. ఓ వైపు ఆయన రాష్ట్రమంతా పార్టీని బలోపేతం చేసేందుకు కాలుకు బలపం కట్టుకొని తిరుగుతున్నారు. కాని ఆయన నియోజకవర్గంలో మాత్రం సొంత కుంపటిలోనే కొందరు పొగబెడుతున్నారు. అందుకు బిఆరఎస్ నాయకులే సహరిస్తున్నారు. కాని ఇతర నియోజకవర్గాలలో ప్రత్యర్ధి పార్టీలు బలంగా వుండేవి. కాని ఇప్ప్పుడు ఆయా నియోజకవర్గాలలో బిఆరఎస్‌ను సొంత పార్టీ నేతలే బలహీన పర్చుతున్నారు. దీనిపై పార్టీ అధినేత కేసిఆర్ కూడా దృష్టిపెట్టాలి. హరీష్‌రావు మీదనే మాట్లాడే నాయకులు పుట్టుకొచ్చేలా రాజకీయం ఎలా సాగుతోంది? దాని వెనుక ఎవరున్నారు? సొంత కుంపటిలోనే ఎవరు నిప్ప్పురాజేస్తున్నారు. సిద్దిపేట బిఆరఎస్‌కు కంచుకోట. అలా హరీష్‌రావు తీర్చిదిద్దారు. కాని గత సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో బిఆరఎస్ పేరు చెప్ప్పుకొని రాజకీయం చేస్తున్నవారు ఎలా నాయకులను తమ వైపు తిప్ప్పుకుంటున్నారు. అందువల్ల అస్మదీయులుఎవరు? తస్మదీయులు ఎవరు? అనేది కూడా కనుక్కొలేకుండా పోతోంది. ఉద్యమ కారులు ఎప్ప్పుడో పార్టీకి చాలా మంది దూరమయ్యారు. ఇతర పార్టీలను బిఆరఎస్‌లో చేరిన వారు పెత్తనం చేస్తున్నారు. వారి పెత్తనం ముందు అసలైన కార్యకర్తలు జెండాలు మోసే కార్యక్రమాలకే పరిమితమౌతున్నారు. వలస నాయకులతోటి బిఆరఎస్‌లో చేరిన వారు పదవులు పొంది పెద్ద నాయకులౌతున్నారు. వలస వాదులు పాతుకుపోయి, అసలు నాయకులను పార్టీకి క్రమంగా దూరం చేస్తూ వచ్చారు. పార్టీని బలహీన పర్చారు. ఇప్పటికీ మించి పోలేదు. ఇంకా రెండు న్న సంవత్సరాల కాలం వుంది. పార్టీ అగ్రనేతలు కేటిఆర్, హరీష్‌రావులు తూతూ మంత్రంగా జిల్లాల పర్యటనలు చేయడం కాదు. జిల్లాలలో మకాం వేయండి. మÖడు నాలుగు రోజులు ఆయా జిల్లాల నాయకుల రాజకీయం గమనించండి. ఏ ఏ నాయకుడి మధ్య ఎలాంటి దూరాలున్నాయో తెలుసుకోండి. పార్టీని భ్రష్టుపట్టిస్తున్న వారి గురించి సమాచారం సేకరించండి. జిల్లా స్ధాయిలో పెద్ద నాయకులుగా చెలామణి అవుతున్న నాయకుల మాటలు మాత్రమే వినిపించుకోకండి. పార్టీ కోసం ఖర్చు చేసే నాయకులనే నమ్మకండి. నోట్లే ఓట్లు వేయిస్తాయన్న గుడ్డి నమ్మకాన్ని వదిలేయండి. బిఆరఎస్ గాలి వీస్తే ఏ నోటు పనిచేయదు. ప్రత్యర్ధులు కొట్టుకుపోతారు. కాని ఆది నుంచి తమ పెత్తనమే నడవాలనుకునే నాయకులే మళ్లీ గెలుస్తారు. పార్టీని గెలిపించిన నాయకులు మళ్లీ ఎదురుచూపులే చూస్తారు. నాయకులకు జేజేలు కొట్టేందుకే పరిమితమౌతారు. పైకి అస్మదీయులుగా కనిపిస్తూ, తస్మదీయ రాజకీయం చేస్తున్నవారు చాలా మంది వున్నారు. అలాంటి వారిని పక్కన పెట్టండి. చాలా చోట్ల హంగులూ, ఆర్భాటాలు సాగించే నాయకులను పక్కన పెట్టండి. పార్టీకోసం ప్రాణం పెట్టే నాయకులను నమ్మండి. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల మనోభావాలు తెలుసుకోండి. వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఇదంతా సీక్రెట్ ఆపరేషన్ చేయండి. జిల్లాకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించండి. ఇంకా రెండున్నరేళ్ల సమయం వుంది. ఈ లోపే మొత్తం తెలంగాణలో అసలైన నాయకులను ఎంపిక చేసుకోవచ్చు. పార్టీ ఓడిపోయినా పరవాలేదు. తాము మాత్రం గెలవాలనుకునే కుత్సిత బుద్ది వున్న నాయకులు ఎవరో తేలిపోతుంది. గ్రూపలు కడుతున్న నాయకుల జాతకాలు బైట పడతాయి. అప్ప్పుడే బిఆరఎస్ మళ్లీ ప్రభంజనం సృష్టించే అవకాశం వుంటుంది.
