`ఇక ముందు ముందు కమల తెలంగాణ!
`తెలంగాణ పై బీజేపీ దృష్టి!

`తెలంగాణ లో అధికారమే లక్షంగా అడుగులు.
`పార్టీ పరంగా రాష్ట్ర శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్న ప్రధాని మోడీ.

`నేడు హైదరాబాద్ రాక.. పెరగానునున్న కాక.
`తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర గురించి వివరించనున్న మోడీ.
`బీజేపీ సహకారం వల్లనే తెలంగాణ సాధ్యమైంది.
`రెండు పార్టీలకు తెలంగాణా ప్రజలు అవకాశం ఇచ్చారు.
`ఇప్పుడు బీజేపీ కి అధికారం ఇవ్వడానికి సిద్ధంగా వున్నారు.
`డబుల్ ఇంజన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యం.
`ఉత్తరాధి అభివృద్ధితో సమానమైన ప్రగతి ప్రయాణం
`తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి కావాలంటే బీజేపీ అధికారం రావడమే మార్గం.
`ప్రజలు తెలంగాణ లో కూడా బీజేపీని కోరుకుంటున్నారు.
`గత పార్లమెంట్ ఎన్నికలలో 8 సీట్లు గెలిపించి ఆశీర్వదించారు.
`ఇప్పటికైనా నాయకులంతా ఒక్క తాటి పైకి రావాలి.
`సమిష్టి కృషి తో తెలంగాణ లో బీజేపీ ని అధికారం లోకి తేవాలి.
`కార్యకర్తలు సిద్దంగా వున్నారు..
`నాయకులు కదలాలని చూస్తున్నారు.
`ఇకపై అమితాషా పూర్తి స్థాయి దృష్టి పెట్టనున్నారు.
`నేడు ప్రధాని మోడీ సమర శంఖం ఊదనున్నారు.
`పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
`అభివృద్ధి అంటే ఏమిటో చూపించే ప్రయత్నం మొదలు పెట్టనున్నారు.
`ఇప్పటికే లక్షల కోట్లు గత 12 ఏళ్లలో తెలంగాణా కు ఇచ్చారు.
`డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తెలంగాణాను దేశంలోనే నెంబర్ వన్ చేయనున్నారు.
`ఒక్కసారి బీజేపీ అధికారంలో కి వస్తే రెండు దశాబ్దాలు తిరుగుండదు.
`తెలంగాణ లో ఇతర పార్టీలకు చోటుండదు.
హైదరాబాద్, నేటిధాత్రి:
తెలంగాణలో కమల వికాసానికి సమయం ఆసన్నమైందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో సమర శంఖం పూరిస్తాడని తెలుస్తోంది. తెలంగాణలో ఎట్టిపరిస్దితుల్లో వచ్చే ఎన్నికల్లో గెలిచి, కాషాయజెండా ఎగురవేసే కృత నిశ్చయంతో రాజకీయం చేయాలని నిర్ణయం బలంగా తీసుకున్నటు కనిపిస్తోంది. గత రెండేళ్ల కాలంగా ఈ మాటను బిజేపి కేంద్ర పెద్దలు రాష్ట్ర నాయకులకు చెబుతూ వస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో అక్కడ ఎక్కువ దృష్టిపెట్టాల్సి వచ్చింది. ఇక ఉత్తరాదిలో ఉత్తర ప్రదేశ్, పంజాబ్ వంటి కొన్ని రాష్ట్రాలలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో కూడా హీట్రిక్ విజయం నమోదు చేయాలని బిజేపి పనిచేస్తోంది. అలాగే పంజాబ్‌లో కూడా ఈసారి అదికారం కైవసం చేసుకోవాలన్న దృడ సంకల్పంతో వుంది. ఆయా రాష్ట్రాలలో రెండు సంవత్సరాల నుంచే బిజేపి కార్యాచరణ మొదలు పెట్టింది. సహజంగా బిజేపి ఎన్నికల సమయానికే రాజకీయం చేయదు. ప్రజల్లో రెండు మÖడు సంవత్సరాల నుంచే విశ్వాసం కలిగించే ప్రయత్నం చేస్తుంది. బిజేపిని పటిష్టం చేస్తుంది. క్షేత్రస్దాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తుంది. బూత్‌స్ధాయిలో కూడా నాయకత్వాన్ని నిర్మాణం చేస్తుంది. అలా పల్లె నుంచి పట్నం దాకా ప్రతి 50 మందికి ఒక బూత్ ఇన్చార్జిని ఏర్పాటు చేసి, పార్టీపై ప్రజల్లో నమ్మకం పెంచుతూ వస్తుంది. అలా పకడ్బంధీ ప్లాన్ చేయడంలో ఏ పార్టీకి లేనంత బలమైన క్యాడర్ బిజేపి వుంది. ఎన్నికల సమయంలోనే కేవలం ప్రజలకు ముందుకు వచ్చి బిజేపి ఎప్ప్పుడూ ఓట్లు అడిగే పార్టీ కాదు. ఎన్నికల తర్వాత ప్రజలను వలిలేయదు. దేశంలో ఒక్కసారి బిజేపి అధికారంలోకి వచ్చిందంటే దశాబ్దాల పాటు అధికారంలో వుంటుంది. అలా పార్టీని ప్రధాని మోడీ, ీVAం మంత్రి అమిత్‌షా ద్వయాలు పార్టీకి రెండు కళ్లుగా కాపాడుతూ వస్తున్నారు. అందుకే గుజరాత్ రాష్ట్రంలో వరస విజయాలు చూస్తోంది. ఇప్పటి వరకు గుజరాత్లో బిజేపి ఏడు సార్లు విజయం సాదించింది. ఈసారి కూడా గెలిస్తే 8 సార్లు గెలిచినట్లౌవుంది. అలాగే దేశంలోన్ని రాష్ట్రాలో హాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నది. బిహార్, హర్యానా, మహారాష్ట్ర, అస్సాం వంటి రాష్ట్రాýలో మÖడుసార్లు విజయాలు సాదించింది. తిరుగులేని శక్తిగా బిజేపి ఎదిగింది. బిజేపి పునాదులు పెకలించడం ఎవరి తరం కాదన్నంతగా పార్టీ నిర్మాణం జరిగింది. దేశంలో ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ బిజేపి అదికారంలో వుంది. ఒకనాడు ఒక్క సీటు కూడా లేని అనేక రాష్ట్రాలలో బిజేపి మెజార్టీ స్ధానాలే కాదు, ప్రతిపక్షాలకు చోటు లేకుండా చేసింది. వరుస విజయాలతో బిజేపి దూసుకుపోతోంది. ఒకప్ప్పుడు పశ్చిమ బెంగాల్లో ఒక్క సీటు కూడా వుండేది కాదు. గత వరుస రెండు ఎన్నికల్లో తన బలం పెంచుకుంటూ, మÖడోసారి విజయం సాదించింది. ఈసారి బెంగాల్లో జెండా ఎగరేస్తామని చెప్పి మరీ గెలిచింది. అలా మహారాష్ట్రలో కూడా గతంలో అదే మాట చెప్పి వరసుగా మÖడుసార్లు గెలుస్తూ వస్తోంది. బిహార్‌లో కూడా ఎన్డిఏ కూటమితో విజయాలు సాదిస్తూ వస్తోంది. ఎన్నికలంటే బిజేపికి రాజకీయమే కాదు, ఒక టాస్క్. దేశం కోసం, ధర్మంకోసం, సబ్కా సాత్, సబ్కా వికాస్ అనే పదాలు ప్రజలను ఎంతో ప్రభావితం చేస్తాయి. అయినా దేశ ప్రజలు ఇప్పటికి మÖడుసార్లు కేంద్రంలో వరుస విజయాలు బిజేపికి అందిస్తున్నారంటే సామాన్యమైన విషయంకాదు. ప్రజలు ఎప్ప్పుడైనా ఆత్మగౌరవాన్ని నిలిపే పార్టీ ఏదని చూస్తారు.. ప్రజల ఆకలి ఏ పార్టీ తీర్చుతుందని ఆలోచిస్తారు. దేశాన్ని కాపాడే శక్తి ఏ పార్టీకి వుందన్న చర్చలు సాగిస్తారు. దేశాన్ని ఏ పార్టీ ముందుకు తీసుకెళ్తుందని బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. బిజేపి పురుడు పోసుకున్న తర్వాత ఆ నమ్మకం దేశ ప్రజల్లో చిగురిస్తూ వచ్చింది. బిజేపిని నమ్ముతూ వచ్చారు. అయితే బిజేపిలో కూడా బలమైన నాయకత్వం ఎదిగే దాకా ప్రజలు కొంత ఓపిక పట్టారు. ఇక బిజేపి పార్టీయే దేశానికి శ్రీరామ రక్ష అని తెలుసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీతో పాటు, ఇతర పాక్షాలు, ప్రాంతీయ పార్టీలను కూడా దూరం పెడుతూ వస్తున్నారు. ఎన్నికలు ఎక్కడ జరిగినా బిజేపినే గెలిపిస్తూ వస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఆ నమ్మకం ప్రజల్లో మరింత బలంగా పెరిగింది. దేశం కోసం బిజేపి పార్టీ చేసే త్యాగం కూడా అర్దమైంది. దేశాన్ని రక్షించే పార్టీగా బిజేపిని జనం గుండెల్లో పెట్టుకుంటున్నారు. గెలిపిస్తూ వస్తున్నారు. ఈ విజయాలు చూసి ఓర్వలేని కొన్ని పార్టీలు ఎంత అసత్య ప్రచారం చేసినా ప్రజలు నమ్మడం లేదు. కాంగ్రెస్‌తో సహా, అన్ని పార్టీలు కలిసి బిజేపిని ఎంత నిందించినా ప్రజలు నమ్మడం లేదు. ఎన్ని రకాల ఆరోపణలు గుప్పించినా జనం ప్రతిపక్షాల మాటలు వినిపించుకోవడం లేదు. తమను కాపాడే శక్తి బిజేపియే అని, తమను పాలించే శక్తి ప్రధాని మోడీకే వుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. అందుకే దేశమంతా మోడీమంత్రమే జపిస్తున్నారు. నిజానికి గత ఎన్నికల్లోనే తెలంగాణలో బిజేపి అదికారంలోకి వచ్చే సంకేతాలు కనిపించాయి. అయితే తెలంగాణలో బిజేపిలో వున్న లుకలుకల మÖలంగా అధికారాన్ని హస్తానికి అందించారు. ఎన్నికలకు ముందు పార్టీని ఎంతో బలంగా పార్టీ నాయకులు, క్యాకర్తలు తయారు చేసుకున్నారు. ప్రజలను కూడా తమ వైపు తిప్ప్పుకున్నారు. ఈసారి బిజేపిని గెలిపించుకోవాలని అనుకున్నారు. కాని పార్టీలో ఏదో జరిగింది. బండి సంజయ్‌ని అద్యక్షపదవి నుంచి పక్కకు తప్పించడంతో పార్టీలో ఒక్కసారిగా నైరాశ్యం ఆవహించింది. ప్రజల్లో కూడా ఆ ఆలోచన మాయమైపోయింది. పార్టీని తెలంగాణలో రక్షించగలిగే, బలం పెంచగలిగే నాయకుడు ఒకే ఒక్కడు బండి సంజయ్ అని అందరూ నమ్మారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పార్టీని బలోపేతం చేయడంలో కేంద్ర ీVAంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అహర్నిషలు కృషి చేశారు. పార్టీ బలోపేతం కోసం ప్రజా సంగ్రామయాత్ర పేరుతో పాదయాత్ర చేశారు. ఆ సమయంలో అనేక ఉప ఎన్నికల్లోబిజేపిని గెలిపిస్తూ వచ్చారు. అలా అసెంబ్లీలో వున్న ఒక్క సీటుకు మరో రెండు విజయాలనందించి, బిజేపి ఎమ్మెల్యేల సంఖ్యను మÖడుకు పెరిగేలా చేశారు. ముందు దుబ్బాకు ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నిక సమయానికి బిజేపి తెలంగాణలో బలం పుంజుకుంటూ వుంది. అప్పటికే జిహెచఎంసి ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాదించి మంచి ఊపు మీద వుంది. దాంతో దుబ్బాక ఉపఎన్నికలో ప్రస్తుతం మెదక్ ఎంపి. రఘునందన్‌రావు విజయం సాదించారు. తర్వాత కొద్ది రోజులకు హుజూరాబాద్ నుంచి ప్రస్తుతం మల్కాజిగిరి ఎంపి. ఈటెల రాజేందర్ 25వేల మెజార్టీతో గెలిచారు. అలా రెండు ఉప ఎన్నికల్లో అనూహ్యమైన విజయాలు బిజేపి సొంతం చేసుకున్నది. అయినా ఎక్కడో ఏదో జరిగింది. బండి సంజయ్ అధ్యక్షపదవి నుంచి తప్పించారు. దాంతో తెలంగాణలో బిజేపి గెలవకుండా పోయింది. కాని ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో బిజేపి గెలిచేందుకు కేంద్రం పక్కా స్కెచ్ వేస్తోంది. బిజేపి జాతీయ నాయకత్వం ఒక్కసారి ప్రకటించిందంటే ఇక బిజేపి క్షేత్రస్ధాయిలో బలం పెంచుకోవడం నల్లేరు మీద నడకే అవుతుంది. ఎన్నికలకు ఇంకా రెండున్న సంవత్సరాలు వుంది. ఈ లోపు పార్టీని బలోపేతం చేయడంతోపాటు, పెద్దఎత్తున కేంద్ర నిధులు ఇచ్చి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ది చేస్తారు. చేసిన అభివృద్దిని చూసి గెలిపించాలని ప్రజలను కోరుతారు. అలా ఉత్తరాది పరిస్ధితి ఒకప్ప్పుడు ఎలా వుండేది? ఇప్ప్పుడెలా వుంది? అని అడిగితే ప్రజలే సమాధానం చెబుతారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరిగిన అభివృద్ది గత యాభై ఏళ్ల కాంగ్రెస్ హాయంలో పది శాతం కూడా జరగలేదు. అందకే దేశ భవిష్యత్తు, రక్షణ వంటి అంశాలే కాకుండా, అభివృద్ది మంత్రం కూడా బిజేపితోనే సాధ్యమౌతుంది. అందుకే దేశ వ్యాప్తంగా జనం బిజేపిని పదే పదే నమ్ముతోంది. ఒకసారి అదికారం ఇచ్చిన ప్రజలు ఐదేళ్ల తర్వాత మార్పు కోరుకుంటారు. కాని బిజేపి పాలిత రాష్ట్రాలలో మాత్రం అలాంటి మార్పు కనిపించడు. పదే పదే బిజేపి పాలనే ప్రజలు కోరుకుంటారు. అలా ప్రగతిని బిజేపి మాత్రమే చేసి చూపించగలదు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న సంకల్పంతో బిజేపి అడుగులు వేస్తోంది. అందుకు తొలి అడుగు పడేందుకు ప్రదాని హైదరాబాద్ వచ్చి, ప్రజలకు సందేశమివ్వనున్నారు.
