చట్టాలను ఉల్లంఘించిన జిల్లా పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకోండి!!

జిల్లా కలెక్టర్ కు చుక్క గంగారెడ్డి పిర్యాదు!!

చట్టాలను, కమీషన్ తీర్పులను లెక్క చేయని జిల్లా పంచాయతీ అధికారులు!!!

విధుల్లోనూ నిర్లక్ష్యం – అదనపు కలెక్టర్ ఆదేశాలు సైతం బే ఖాతర్!!!

ప్రత్యర్థులతో పంచాయతీ అధికారుల కుమ్మక్కు – అవినీతిపై అనుమానాలు…?!!

ఉద్దేశ్య పూర్వకంగానే సమాచారం ఇవ్వడం లేదని ఆరోపణ!!

జగిత్యాల నేటి ధాత్రి

చట్టాలను ఉల్లంఘించి, అదనపు కలెక్టర్ ఆదేశాలను సైతం బే ఖాతర్ చేసి, పాలనలో పారదర్శకంగా లేని జిల్లా పంచాయతీ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రముఖ ఉద్యమకారుడు, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ అయిన చుక్క గంగారెడ్డి సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు.
జగిత్యాల జిల్లా పంచాయతీ కార్యాలయంలోని అధికారులు
చట్టాలను, కమీషన్ తీర్పులను, జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశాలను సైతం లెక్కచేయడం లేదని ఆరోపించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, ప్రత్యర్థులతో కుమ్మక్కై కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా వ్యవహరించి సమాచారం కూడా ఇవ్వక పోవడం బాధాకరం అన్నారు.
గత నాలుగేండ్ల నుండి అనేక సమాచార హక్కు చట్టం దరఖాస్తులు, అప్పీళ్ళు జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాలలో పెండింగ్ లో ఉన్నాయన్నారు. తేది: 13-09-2023న జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జారీ చేయబడిన విచారణ నోటీసు లేఖ నం. ఎఫ్ 2/260/2023 తో
సమాచార హక్కు చట్టం – 2005 సెక్షన్ 19 (1) ప్రకారం మొదటి అప్పీలు పై అప్పటి జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత తేది: 30-09-2023 న ఇరువర్గాలతో విచారణ చేపట్టడం జరిగిందన్నారు.
సమాచారం ఇవ్వడంలో విఫలమై, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి, చట్టాలను కూడా ఉల్లంఘించి, కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా సమాచారం ఇవ్వలేదని జిల్లా పంచాయతీ అధికారులపై జిల్లా అదనపు కలెక్టర్ అదే విచారణ సమయంలో తీవ్రంగా మండి పడ్డారని చుక్క గంగారెడ్డి వివరించారు. తక్షణమే దరఖాస్తు దారుడు కోరిన పూర్తి సమాచారం తగిన ఆధారాలతో సహా అందజేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారని ఆయన తెలిపారు.
అప్పటి నుండి అనగా గత ఆరు నెలల నుండి తాను అనేక సార్లు సంబంధిత అధికారులతో పాటు, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా తాను కోరిన సమాచారం ఇవ్వాలని సంప్రదించడం జరిగిందన్నారు. అయినా నేటికీ తాను కోరిన సమాచారం అందజేయడంలో పంచాయతీ అధికారులు, ఇప్పించడంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు పూర్తిగా విఫలం అయ్యారని ఆరోపించారు. తాను పిర్యాదు చేసిన ప్రత్యర్తులతో జిల్లా పంచాయతీ అధికారులు కుమ్మక్కై, అవినీతికి పాల్పడి ఇలా చేసి ఉంటారని ఆయన పలు అనుమానాలను కూడా వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి చట్టాలను ఉల్లంగించి, కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా సమాచారం ఇవ్వకుండా వ్యవహరించి, విధుల్లో కూడా నిర్లక్యం చేసి, జిల్లా అదనపు కలెక్టర్ చట్టబద్దంగా చేపట్టిన సమాచార హక్కు చట్టం దరఖాస్తుల విచారణ ఆదేశాలను సైతం భే – ఖాతర్ చేసిన జిల్లా పంచాయతీ కార్యాలయంలోని సమాచార అధికారిపై, అప్పిలేట్ అధికారిపై చట్టపరంగా తగు కఠిన చర్యలు తీసుకొని మాకు సరైన న్యాయం చేస్తూ, నేను కోరిన పూర్తి సమాచారం వెంటనే ఇప్పించాలని చుక్క గంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *