వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా మీడిదొడ్డి మాధవి రమేష్…

వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా మీడిదొడ్డి మాధవి రమేష్

,వైస్ చైర్మన్ గా మధుసూదన్ గౌడ్

వనపర్తి నేటిధాత్రి .

వనపర్తి మున్సిపాలిటీ నుండి కొత్తగా ఎన్నికైన 33 మంది కౌన్సిలర్ల చే ప్రత్యేక అధికారి ఆర్ డి ఓ ప్రమాణ స్వీకారం ఆర్డీఓ సుబ్రమణ్యం చేయిoచారు
మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎన్నికైన 33 మంది సభ్యులను జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాల మేరకు వనపర్తి మున్సిపాలిటీలో పరోక్ష విధానం ద్వారా చైర్ పర్సన్,వైస్ ఛైర్ పర్సన్ ఎన్నిక కొరకు సోమవారం మున్సిపల్ కార్యాలయ ములో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు
33 మంది సభ్యులున్న వనపర్తి మున్సిపాలిటీ లో ​చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు చట్ట ప్రకారం 17 మంది సభ్యుల కోరం అవసరం ఉండగా సమావేశానికి 22 మంది20 మంది కాంగ్రెస్ ఇద్దరు స్వతంత్రులుసభ్యులు హాజరయ్యారు కోరం సభ్యుల ప్రతిపాదన మేరకు అధికారులు చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించా రు మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ అభ్యర్థి మీడిదొడ్డి మాధవి పేరును వనపర్తి మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ బొడ్డుపల్లి పరుశురాం ప్రతిపాదించగా 4వ వార్డు కౌన్సిలర్ గంధం శరవంద బలపరిచారు మరో అభ్యర్థి పేరు ప్రతిపాదనకు రాకపోవడంతో మీడిదొడ్డి మాధవి ని చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రత్యేక అధికారి ఆర్ డి ఓ సుబ్రహ్మణ్యం ప్రకటించారు అనంతరం వైస్ చైర్ పర్సన్ గా గురకొండ మధుసూదన్ గౌడ్ పేరును 5వ వార్డు కౌన్సిలర్ బాపన్ పల్లి వెంకటేశ్వర్లు ప్రతిపాదించగా, 31వ వార్డు కౌన్సిలర్ బి. విజయలక్ష్మి బలపరిచారు. మరో పేరు ప్రతిపాదనకు రాకపోవడంతో వైస్ చైర్ పర్సన్ గా గురుకొండ మధుసూదన్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రత్యేక అధికారి ప్రకటించారు. అనంతరం ప్రత్యేక అధికారి చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లను ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ వెంకటేశ్వర్లు డి పి ఆర్ ఓ వనపర్తి తహసీల్దార్ రమేష్ రెడ్డి,ఎన్నికల అధికారులు,మున్సిపల్ అధికారులు ఎన్నికైన కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.S

జగిత్యాలలో వీడిన చిక్కుముడి.. కామారెడ్డిలో బిగ్ ట్విస్ట్…

జగిత్యాలలో వీడిన చిక్కుముడి.. కామారెడ్డిలో బిగ్ ట్విస్ట్

 

ఎట్టకేలకు జగిత్యాల మున్సిపాలిటీ పీఠంపై సస్పెన్స్ వీడింది. జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే పార్టీ అధిష్ఠానం కేటాయించింది.

జగిత్యాల, ఫిబ్రవరి 16: తాజా.. మాజీ ఎమ్మెల్యేల మధ్య అధిపత్య పోరు నెలకొన్న వేళ.. జగిత్యాల మున్సిపాలిటీ పీఠంపై సస్పెన్స్ వీడింది. జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే పార్టీ అధిష్ఠానం కేటాయించింది. దాంతో మున్సిపల్ చైర్మన్‌గా ఆయన వర్గానికి చెందిన సమిండ్ల వాణిని ఎంపిక చేశారు. అలాగే వైస్ చైర్మన్ పదవి మాజీమంత్రి జీవన్ రెడ్డి వర్గానికి కేటాయించింది. దీంతో వైస్ చైర్మన్ పదవికి పర్వీన్‌ను ఎన్నుకున్నారు.
మరోవైపు జెడ్పీ, మార్కెట్ కమిటీ పదవును జీవన్‌రెడ్డి వర్గానికి కేటాయిస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే, ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తాము సైతం కష్ట పడ్డామంటూ జీవన్‌రెడ్డితోపాటు ఆయన వర్గం అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు జీవన్ రెడ్డి వర్గానికి వైస్ చైర్మన్ పదవిని కేటాయించారు. దీంతో ఇరువర్గాలు ప్రస్తుతానికి శాంతించినట్లు ఒక చర్చ సాగుతోంది.

కామారెడ్డిలో బిగ్ ట్విస్ట్..

కామారెడ్డి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచిన ఇప్ప ఉమారాణిని చైర్ పర్సన్ పీఠం వరించింది. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఇప్ప ఉమారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేది లేదంటూ కామారెడ్డిలోని బీఆర్ఎస్ పార్టీ నేతలు తేల్చి చెప్పారు.దాంతో తాజాగా పార్టీలో చేరిన ఇప్ప ఉమారాణి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది. మరోవైపు వైస్ చైర్మన్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు కోరారు. హఫీజ్, కాసర్ల గోదావరిలో ఒకరికి ఈ వైస్ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version