ప్రభుత్వ ఆసుపత్రి పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో పిల్లలు ప్రభుత్వ బడిలోనే చదివేల చూడాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తంగళ్ళపల్లి మండలం పరిధిలోని తెనుగు వారి పల్లి లోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాల ఆవరణలో గ్రామంలో రోడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని పంచాయతీ కార్యదర్శి కిసూచించారు అనంతరం మధ్యాహ్నం భోజనం సిద్ధం చేస్తుండగా భోజన సదుపాలను పరిశీలించారు విద్యార్థులతో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా అని ఆరా తీశారు వాటర్ ప్యూరిఫర్ వాటర్ కల్పించాలనిఫ్యాన్లు మరమ్మతులు చేయించి విద్యార్థులకు ఆ సౌకర్యం కలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు పాఠశాలకు అవసరమైన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు పాఠశాలకు మంచి భవనం ఉందని కానీ విద్యార్థుల సంఖ్య తక్కువ ఉందని పేర్కొంటూ గ్రామ పిల్లలందరూ ఇదే పాఠశాల చదివేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలని ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన సాంకేతికతో కూడిన బోధనపై అవగాహన కల్పించాలని ఆదేశించారు విద్యార్థులు చదువులో రాణించి క్రమశిక్షణతో కూడిన బోధన అందించాలని సూచిస్తూ ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి ప్రభుత్వ వైద్యశాలలో 75% ప్రసవాలు అయ్యేలా చూడాలని వైద్యులకు సూచించారు తంగళ్ళపల్లి లోని ప్రాథమిక కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు ఆసుపత్రి ఆవరణలో గడ్డి నిరుపయోగంగా మొక్కలు పిచ్చి మొక్కలు నిండి ఉండడంతో వాటిని తొలగించాలని ఎంపిఓని ఆదేశించారు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు సీసీ కెమెరాలు మరమ్మతు చేయించి వినియోగంలోకి తీసుకోవాలని తెలుపుతూ అనంతరం హాస్పిటల్ లోని ఓపి ఇతర రిజిస్టర్ను తనిఖీ చేశారు ల్యాబ్ ఫార్మసీ ఆయా గదులు పరిశీలించి వైద్యులకు సూచనలు చేస్తూ పరిసరాలను పరిశీలన చేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలోకల్పిస్తున్న సౌకర్యాలపై గర్భిణులకు అవగాహన కల్పించాలని 70% శాతానికి పసవాలు కల్పించేలాఆశ వర్కర్లతో నిత్యం సమావేశం ఏర్పాటు చేస్తూ నార్మల్ ప్రసవాలు ఎక్కువ జరిగేలా జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు ఇట్టి కార్యక్రమంలో డాక్టర్ చంద్రిక రెడ్డి ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!