ఏసీబీ కి దొరికిన అవినీతి ఏఈఓ.

ఏసీబీ కి దొరికిన అవినీతి ఏఈఓ.

రైతు భీమా కోసం 20 వేలు డిమాండ్.

మరిపెడ నేటిధాత్రి.

 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఏసీబీ అధికారులకు దొరికిన అవినీతి ఏఈఓ, ఆనేపురం గ్రామపంచాయతీలోని చనిపోయిన రైతుకు ప్రభుత్వం నుంచి అందించే రైతు బీమా మంజూరు కోసం రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి ఏఈఓ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడ్డాడు.వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ మండలంలోని అనే పురం గ్రామానికి చెందిన రైతు బిక్కు అక్టోబర్ 14 వ తేదీన మరణించాడు. దీంతో నామినీగా ఉన్న రైతు కుమారుడు రైతు బీమా కోసం గత నెల 30వ తేదీన అన్ని ధ్రువీకరణ పత్రాలతో మరిపెడ అగ్రికల్చర్ కార్యాలయంలో రైతు బీమాకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అనేపురం క్లస్టర్ ఏఈఓ గా విధులు నిర్వహిస్తున్న గాడిపెళ్లి సందీప్ సదరు రైతు కుమారుడి వద్ద రూ. 20 వేలు ఇస్తేనే ధ్రువీకరణ పత్రాలు ఆన్లైన్ చేస్తానని డిమాండ్ చేసినట్లు తెలిపారు.అధికారికి డబ్బులు ఇచ్చే స్తోమత లేక సదర్ దరఖాస్తుదారుడు నేరుగా వరంగల్‌లోని ఏసీబీ అధికారులను సంప్రదించి అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టించడం జరిగింది. గురువారం మరిపెడ మండల కేంద్రంలోని జేజే బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా దరఖాస్తుదారుల నుంచి రూ.10వేలు తీసుకుంటుండగా పట్టుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. నేరస్తుడిని శుక్రవారం ఉదయం వరంగల్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ చేయడం జరుగుతుందని డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఈ దాడుల్లో ఆయనతో పాటుగా ఇన్స్పెక్టర్లు ఎల్ రాజు, శేఖర్, ఏసీబీసీ సిబ్బంది పాల్గొన్నారు. కాగా మరిపెడలోని నేరస్తుడి బంధువుల ఇళ్లలో సైతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.

ఆమనగల్లు / నేటి ధాత్రి :

కల్వకుర్తి నియోజకవర్గం లోని ఆమనగల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో తన అమ్మమ్మకు చెందిన భూమిని నమోదు చేసేందుకు, రికార్డుల్లో తప్పులను సవరించేందుకు ఒక వ్యక్తి వద్ద రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్ చింతకింది లలిత, సర్వేయర్ కోట రవిబాధితుడి ఫిర్యాదు మేరకు రూ.50,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version