తీవ్ర మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య
మొగుళ్ళపల్లి నేటి దాత్రి
మండలంలో ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి మొగుళ్ళపల్లి ఎస్సై బొరగల అశోక్ అందించిన సమాచారం మేరకు. మొగుళ్ళపల్లి మండలంలోని మేదరమెట్ల గ్రామానికి చెందిన బాల వేణి రాధా చంద్రమౌళి దంపతులకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు సంతానం ఉండగా కూతురు వివాహం చేసి బాల వేణి రాధా తన భర్త చంద్రమౌళి, ఇద్దరు కొడుకులతో కలిసి హైదరాబాదులో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు స్వగ్రామం మేదరమట్లకు వచ్చి బుధవారం భోగి రోజున వారి ఇంటిలో పట్నాలు వేసిన అనంతరం మృతుడు అంజి (21) కనపడకపోవడంతో కుటుంబ సభ్యులు అంజిని వెతుకుతున్న క్రమంలో మృతుడు తన పెదనాన్న బాలవేణి వెంకన్న గృహంలో రాత్రి 7:30 గంటల సమయంలో దూలానికి చీరతో ఉరి వేసుకుని కొన ఊపిరితో వేలాడుతు కనిపించడంతో. కొడుకును చూసి తల్లి బాలవేణి రాధా కేకలు వేయగా. గ్రామానికి చెందిన బాలవేణి వీరస్వామి, బాలవేణి శ్రీనివాసులు, ఇద్దరు కొనఊపిరితో ఉన్న అంజిని హుటాహుటిన చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడని. తన కుమారుడి ఆత్మహత్యకు ఎవరిమీద ఎలాంటి అనుమానం లేదని ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి బాలవేణి రాధా ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బొరగల అశోక్ తెలిపారు.
