పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయ కులు కొమ్ముల శివ
శాయంపేట నేటిధాత్రి:
పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ ఎస్వీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆరో పించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లుశ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా కొమ్ముల శివ మాట్లాడుతూ పగలు రాత్రి కష్టపడి చదివిన సుమారు 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటo మాడు తోందని మండిపడ్డారు. దేశం లోనే ప్రతిష్టాత్మకమైన జాతీ య అర్హత పరీక్షను కూడా పకడ్బందీగా నిర్వహించలేని స్థితిలో కేంద్రం ఉంది ఏకంగా పరీక్షనే రద్దు చేయాల్సిన దుస్థితి రావడం ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు. పరీక్షకు ముందు రోజే వందకు పైగా ప్రశ్నలు లీక్ అయ్యా యంటే, విద్యా వ్యవస్థలో లోపాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకో వచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 2024లో జరిగిన నీట్ లీకేజీ ఉదంతం నుండి కేంద్రం ఎలాంటి గుణ పాఠం నేర్చుకోలేదని, ఆ నిర్లక్ష్య వైఖరి వల్లే నేడు మళ్ళీ ఇలాంటి ఘటన పునరావృత మైందని గుర్తు చేశారు. వరు సగా వెలుగుచూస్తున్న ఈ అసమర్థత విద్యార్థులకు శాపంగా మారిందని, కేంద్ర సర్కారు తీరు వల్ల అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రు లు తీవ్ర మానసిక క్షోభకు గుర వుతున్నారని ధ్వజమెత్తారు. వ్యవస్థను ప్రక్షాళన చేయడం లో విఫల మైన ఎన్డీయే ప్రభు త్వం ఈ బాధ్యతను స్వీకరిం చాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యువజన సీనియర్ నాయ కులు, మాజీ సర్పంచ్ ఆరికిల్ల ప్రసాద్, మండల నాయకులు రంగు మహేందర్, కుతాటి రమేష్, బీఆర్ఎస్వీ జిల్లా నాయకులు అరికెళ్లవెంకట్ పాల్గొన్నారు.
