Demand for House Pattas in Singareni Area
సింగరేణి ప్రాంత వాసులకు ఇళ్ల పట్టాలకై కలెక్టర్ కు వినతి..
మున్సిపల్ చైర్ పర్సన్ గొడిసెల సంధ్యారాణి- రాజా రమేష్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
సింగరేణి ప్రాంతమైన రామకృష్ణాపూర్ ఏరియాలో జీవో నెంబర్ 76 ద్వారా సింగరేణి ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబాలకు ఇండ్ల పట్టాలు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు వినతి పత్రం అందించడం జరిగిందని క్యాతనపల్లి మునిసిపాలిటీ చైర్ పర్సన్ గొడిసెల సంధ్యారాణి- రాజా రమేష్ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణి ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబాలకు జిఓ నంబర్ 76 ద్వార ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్ల పట్టాల కార్యక్రమం నిలుపుదల చేసిందని అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని అన్నారు. మున్సిపాలిటీ కి ప్రభుత్వం నుండి, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులను క్యాతనపల్లి మున్సిపాలిటీకి అందేలా చొరవ తీసుకోవాలని కలెక్టర్ ను కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. చైర్ పర్సన్ వెంట కౌన్సిలర్లు శంకర్,స్వర్ణలత, శ్రీను, సీనియర్ నాయకులు రామిడి కుమార్, లక్ష్మీ కాంత్, మణి కుమార్ లు పాల్గొన్నారు.
