Abhaya Anjaneya Swamy Anniversary Celebrated
ఘనంగా అభయాంజనేయ స్వామి 20వ వార్షికోత్సవ వేడుకలు…
విజయ గణపతి ఆలయంలో హనుమాన్ యజ్ఞం మహా అన్నదాన కార్యక్రమం..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని ఏ జోన్ రామాలయం చౌరస్తాలో గల అభయ ఆంజనేయస్వామి ఆలయ 20వ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. బీజోన్ రాజీవ్ చౌక్ ఏరియాలో గల విజయ గణపతి ఆలయంలో అభయాంజనేయ స్వామి మండల అర్థమండల మాలాధారణ దీక్ష స్వాముల సమక్షంలో హనుమాన్ చండీయాగం పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు మునిసిపల్ చైర్ పర్సన్ గొడిసెల సంధ్యారాణి- రాజా రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయాల సమీపంలో మధ్యాహ్నం మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ సంధ్యారాణి మాట్లాడుతూ… మున్సిపాలిటీ లోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. సమాజంలో అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు మానవత్వానికి ప్రతీకలని ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. హనుమాన్ దీక్ష స్వాములు నియమ నిబంధనల భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలతో కఠోర దీక్షలను పాటిస్తున్న స్వాముల కోరికలు నెరవేరాలని కోరినట్లు తెలిపారు. ఆలయాల అభివృద్ధి కొరకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమాలలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సిపిఐ జిల్లా కార్యదర్శి రాముడు లక్ష్మణ్, కౌన్సిలర్లు, ఆలయ కమిటీ సభ్యులు హనుమాన్ మాల స్వాములు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
