BRSV Demands Release of Pending Scholarships
విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్..
బిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు శ్రవణ్, నాయకులు జిలకర మహేష్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
పెండింగ్ లో ఉన్న విద్యార్థుల యొక్క ఎనిమిది వేల కోట్ల స్కాలర్షిప్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బిఆర్ఎస్వి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్ నాయకులు జిలకర మహేష్ లు డిమాండ్ చేశారు. విద్యార్థులకు స్కాలర్షిప్ విడుదల విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యాసంస్థల బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు శ్రవణ్, నాయకులు జిలకర మహేష్, శివకుమార్, శ్రీకాంత్ కుర్మ దినేష్ లను ముందస్తు అరెస్టు చేసి రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వం వేలకోట్ల నిధులు ఆపడం వల్ల విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటుందని ,అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని శ్రవణ్ ధ్వజమెత్తారు. స్కాలర్షిప్ విడుదల చేసే వరకు బిఆర్ఎస్వీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
