Ambedkar Inspires Future Generations
రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ భావితరాలకు స్ఫూర్తి…
చైర్ పర్సన్ గొడిసెల సంధ్యారాణి, వైస్ చైర్మన్ మిట్టపల్లి సరిత
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
భారతదేశ భవిష్యత్తును ఊహించి, రాజ్యాంగాన్ని రూపొందించి, భావితరాలకు స్ఫూర్తిగా అంబేద్కర్ నిలిచారని క్యాతనపల్లి మునిసిపాలిటీ చైర్ పర్సన్ గొడిసెల సంధ్యారాణి, వైస్ చైర్మన్ మిట్టపల్లి సరిత లు అన్నారు. మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలను మున్సిపాలిటీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి జయంతి వేడుకలను నిర్వహించారు. ఛైర్మన్, వైస్ చైర్మన్ లు నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లతో కలిసి సిహెచ్పి సమీపంలో , ఆదివారం సంత సమీపంలో, నాగార్జున కాలిని సమీపంలో, ఏరియా ఆసుపత్రి లల్లో గల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. కుల వివక్ష నిర్మూలనకై ,స్త్రీ స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం పోరాడిన గొప్ప మహనీయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, కార్యాలయ సిబ్బంది,బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు రాజా రమేష్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్,సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు యాకూబ్ అలీ, వొడ్నాల శ్రీనివాస్, బిఆర్ఎస్,సిపిఐ, కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఎమ్మార్పీఎస్ నాయకులు, వివిధ పార్టీల నాయకులు, మాజీ కౌన్సిలర్లు, యువకులు పాల్గొన్నారు.
