ఈ నెల 26వ, తేదీన జరిగే ఏఐటీయూసీ వెంకటాపూర్ మండల మహసభను జయప్రదం చేయండి
ములుగు టౌన్ నేటి ధాత్రి
ఈరోజు వెంకటాపూర్ మండల కేంద్రంలో జరిగిన ఏఐటీయూసీ మఖ్యనాయకుల సమావేశం లో పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బండి నర్సయ్య మాట్లాడుతూ కార్మికులు ఎధుర్కొంటున్న అనేక సమస్యలు, ప్రభుత్వాల కార్మిక వ్వతిరేఖ విధానాలపై పోరాట రూప కల్పన చేయడానికి గాను ఈ నెల 26 వ, తేదీన వెంకటాపూర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవణలో జరిగే ఏఐటీయూసీ మండల
మహసభను, మధ్యాహ్న భోజన వంట కార్మికులు, స్కావెంజర్లు, హమాలీ కార్మికులు, భవణ నిర్మాణ కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్స్, నీరడీలు, ఆశ, అంగన్వాడీ, రెండవ ఏ,యన్, యం, లు తదితర రంగాలలో పనిచేస్తున్న కార్మికులు అధిక సంఖ్యలో హజరై జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు,, ఈ సమావేశంలో పాల్గొన్న వారు కొక్కుల రాజేందర్, గాలి సమ్మయ్య, జనగాం శోభ, తోట సంపత్,సంగు పోషమ్మ, నార్లగిరి సరిత, జనగాం లావణ్య,
పేదల కలల్ని సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది
#పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా ఇంటి కలను సాకారం చేస్తాం.
#అర్హులైన ప్రతి పేదవారికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం.
#వెంకటాపూర్ గ్రామములో ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశానికి హాజరై ప్రారంభించిన ….
#రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.
ములుగు జిల్లా, నేటిధాత్రి:
పేదల కలల్ని సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీ కి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు బయ్యా ప్రమీల ఇందిరమ్మ ఇల్లును రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల జీవనోపాధికి చిహ్నంగా నిలిచిందని మంత్రి సీతక్క అన్నారు. పేదల బాగోగుల పట్ల శ్రద్ధచూపడం అందులో భాగమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు అంటేనే ప్రజా ప్రభుత్వం గుర్తుకు వస్తోందని, పేద ప్రజల కలల ఇళ్ల రూపంలో ప్రతిబింబించడానికి ఈ పథకం దోహదపడిందని మంత్రి వివరించారు. ప్రజా ప్రభుత్వమే నిజమైన రైతు–కూలీలకు అండగా నిలుస్తోందని అన్నారు. రైతును “రాజు”గా చూడాలనే సంకల్పంతోనే సన్నవరి వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. తొమ్మిది నెలల వ్యవధిలోనే రూ.21 వేల కోట్లతో రెండు లక్షల లోపు ఉన్న రైతుల రుణమాఫీ చేయడం, రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం, మూడు విడతల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇండ్లు కట్టించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అలాగే, 7 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం, 17 లక్షల పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లు నమోదు చేయడం వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వమే విజయవంతంగా అమలు చేసిందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ జోడెద్దుల్లా సమపాళ్లలో ముందుకు వెళ్తున్నాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం కమిషన్‌ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. పేదల గౌరవప్రదమైన జీవనానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క.
#ప్రజల కోసం సమాజం కోసం ఉమ్మడి హక్కుల కోసం పోరాడిన వారిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
ములుగు జిల్లా, నేటిధాత్రి:
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, ప్రజల కోసం సమాజం కోసం ఉమ్మడి హక్కుల కోసం పోరాడిన సర్వాయి పాపన్న గౌడ్ లాంటి వారిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి ఉత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొని శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం అధికారికంగా జరపడం జరుగుతుందని, చాలా సంతోషకరమని అన్నారు. ప్రతి ఒక్కరూ మహనీయుల జీవిత చరిత్రను వారి త్యాగాలను గుర్తుంచుకోవాలని మర్చిపోతే మాత్రం మానవ మనుగడకు భవిష్యత్తు కష్టతరం అవుతుందని , ” నాకోసం పనిచేస్తే నాలోనే ఉండిపోతావు – జనం కోసం పనిచేస్తే జనంలో ఉండిపోతావ్ అని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ ప్రాంతంలోని ఖిలషాపూర్ అనే గ్రామంలో జన్మించారని పశువుల కాపరిగా ఉంటూ రాజుల సైన్యాలను వారి ఆగడాలను ఎదిరించి, అరికట్టి ఉమ్మడి హక్కుల కోసం పోరాడారని , అన్యాయాలను ఎదిరించిన ఆయన జీవిత చరిత్ర మనకు ఆదర్శమని పేర్కొన్నారు. సమాజంలో గౌడ్ అన్నలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యల పరిష్కరించడం కొరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించేటట్లు చూస్తానని పేర్కొన్నారు. మహనీయుల విగ్రహాలను త్వరలో ఏర్పాటు చేయుటకు, బీసీ భవన్ ఏర్పాటు చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం బి.సి. రిజర్వేషన్ 42 శాతం అమలు కు కట్టుబడి ఉందని , బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలనీ ఈ సందర్భంగా మంత్రి కోరారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులకు కాటమయ్య 100 రక్షక కవచాలను మంత్రి అందచేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, ఆర్డీఓ వెంకటేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, ఎక్సైజ్ సి ఐ సుధీర్ కుమార్, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఇంచార్జీ సర్దార్ సింగ్, బి.సి. కులస్థులు, బి.సి. సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ములుగు జిల్లా లోని జగ్గన్నపేట గ్రామంలో క్రష్ కేంద్రం ఏర్పాటు
#క్రష్ కేంద్రం లో పిల్లల సంరక్షణ.
#పల్నా పథకం ద్వారా జిల్లాలో 25 డే-కేర్/క్రెచ్ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు.
#రాష్ట్రంలో మొదటిసారిగా ములుగు జిల్లా లోని జగ్గన్నపేట గ్రామం లో క్రష్ కేంద్రం ఏర్పాటు.
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.
ములుగు జిల్లా, నేటిధాత్రి :
క్రష్ కేంద్రాలు పిల్లల సంరక్షణ సేవలను అందించేందుకు, పగటిపూట తమ పిల్లలను చూసుకోలేని తల్లిదండ్రులు ఇట్టి కేంద్రాలను ఉపయోగించుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. సోమవారం ములుగు మండలం జగన్నపేట గ్రామంలో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి అంగన్వాడి మరియు డే కేర్ కేంద్రం ప్రారంభోత్సవం చేశారు. అనంతరం అంచనా 15 లక్షల నిధులతో అంగన్వాడి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, సరైన క్రష్ కేంద్రాలు లేకపోవడం తో తరచుగా, మహిళలు బయటకు వెళ్లి పని చేయడానికి ఇబ్బందిగా మారిపోయిందని, తమ పిల్లలకు సరైన పిల్లల సంరక్షణ మరియు రక్షణ కల్పించడంలో పనిచేసే తల్లులు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులను పరిష్కరించడానికి, పల్నా పథకం ద్వారా డే-కేర్/క్రష్ కేంద్రాలు ఉపయోగపడుతాయని తెలిపారు. 7 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు సురక్షితమైన వాతావరణంలో నాణ్యమైన క్రేష్ సౌకర్యాలను అందించబడుతాయని పోషకాహారo, పిల్లల ఆరోగ్యం, పెరుగుదల పర్యవేక్షణ వంటి సేవలు డే-కేర్/క్రెచ్ కేంద్రాలు అందిస్తాయని తెలిపారు. ములుగు జిల్లా లో ములుగు, తాడ్వాయి, ఏటూరునాగారం వెంకటాపురం (04) ఐ సి డి ఎస్ ప్రోజెక్టుల పరిధిలో పల్నా పథకం ద్వారా 25 డే-కేర్/క్రెచ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, తల్లి తండ్రులు ఈ కేంద్రాలను ఉపయోగించు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో జాయింట్ డైరెక్టర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్ వినోద్, ఆర్డీఓ వెంకటేష్, జిల్లా సంక్షేమ అధికారి టి. రవి, తెలంగాణ స్టేట్ లీడర్ మొబైల్ క్రష్ మాణికప్ప, ప్రోగ్రాం ఆఫీసర్ మొబైల్ క్రష్, రాంప్రసాద్, సీడీపీఓ ములుగు కె.శిరీష, ఐ సి డి ఎస్ సూపర్ వైజర్, అంగన్వాడీ టీచర్స్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, విద్యార్థులు, తదితరులు తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.