కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు
నడికూడ,నేటిధాత్రి:
మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణ రావు 111వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఒక సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక అన్న మహానుభావుడు ప్రజా కవి కాళోజి నారాయణరావు అన్నారు అని ఎంపీడీవో గజ్జెల విమల మాట్లాడారు.
నడికూడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజి నారాయణరావు 111వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ తెలంగాణ తొలిపొద్దు కాళోజీ నారాయణ రావు అన్యాయాన్ని ఎదురిస్తే నా గొడవ కు సంతృప్తి అని అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి అని, అన్యాయాన్ని ఎదురించినవాడే నాకు ఆరాధ్యుడు అని సగర్వంగా ప్రకటించినవారు కాళోజీ అని తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమం యొక్క ప్రతి ధ్వనిగా ఉంటారని,అన్నారు.
పుట్టుక చావులు కాకుండా బ్రతుకంతా తెలంగాణ కి ఇచ్చిన మహనీయుడు కాళోజీ నారాయణ రావు అని అతని జన్మదినాన్ని పురష్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాష దినోత్సవం గా ప్రకటించారు.
కాళోజీ రచనలు, కాళోజీ కథలు,నా గొడవ,జీవన గీత, తెలంగాణ ఉద్యమ కథలు ఎన్నో పుస్తకాలు రాసారు.
1968 సంవత్సరములో జీవన గీత రచనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే పురస్కారం ప్రజాకవి గా బిరుదు పొందారు.
1992 సంవత్సరము లో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ పొందారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో శాసన మండలి సభ్యునిగా 1958 నుండి 1960 వరకు కొనసాగారు.
ఈ కార్యక్రమంలో ఏపీవో విద్యావతి,టి ఏ స్వప్న, కార్యాలయ సిబ్బంది గోవిందు నవీన్ కుమార్, దర్శన్,రాజేందర్,నడికూడ ఫీల్డ్ అసిస్టెంట్ రాములు అంగన్వాడీ టీచర్ కళావతి, ఆయా నర్సక్క,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.