జమ్మికుంట మున్సిపాలిటీలో 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా యేబూషి ఆర్యన్ కౌషిక్:-
జమ్మికుంట, నేటిధాత్రి:-
జమ్మికుంట మున్సిపాలిటీలో 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యువ నాయకుడు యేబూషి ఆర్యన్ కౌషిక్ కు ప్రజలు గణనీయంగా మద్దతు తెలుపుతున్నారు.
ఇంతకు ముందు తన తండ్రి ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఎప్పుడూ ప్రజల మద్య ఉండి ప్రజలకు సేవ చెయ్యాలనే తపనను గుర్తించి తన తండ్రి మాజీ ఎంపీపీ కీ.శ. యేబూషి రామస్వామి ఆశయాలను కొనసాగించాలని తండ్రి బాటలో నే నడుస్తూ జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యువ నాయకుడు యేబూషి ఆర్యన్ కౌషిక్ ప్రజాసేవనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
గత కొంతకాలంగా వార్డులోని సమస్యలను దగ్గరుండి తెలుసుకుంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవాభావంతో పనిచేస్తున్న వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉంది.ప్రజా సమస్యల పరిష్కారంలో నిబద్ధత, యువతకు ఉపాధి అవకాశాలపై అవగాహన, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలపై ఆయన స్పష్టమైన దృష్టిని కలిగి ఉన్నారు. ముఖ్యంగా తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, శుభ్రత వంటి సమస్యలను ప్రథమ ప్రాధాన్యంగా తీసుకొని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు.
వార్డు అభివృద్ధితో పాటు ప్రతి కుటుంబానికి న్యాయం చేకూరాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్న ఈ యువ నాయకుడికి ప్రజలంతా తమ అమూల్యమైన మద్దతు అందించాలని స్థానికులు కోరుతున్నారు. మార్పు కావాలంటే, సేవాభావం ఉన్న నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
