కరీంనగర్ టెండర్ నిలిపివేతపై సిపిఐ విమర్శ

కమిషన్ల కోసమే టెండర్ల నిలిపివేత

ఎన్నికల ముందు టెండర్లకు పిలిచిన యాభై కోట్ల నిధుల పనులను వెంటనే ప్రారంభించాలి-సిపిఐ

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో మున్సిపల్ ఎన్నికల ముందు రాష్ట్రప్రభుత్వం, పాలకవర్గం విలీన గ్రామాలలో అభివృద్ధి పనుల నిమిత్తం యాభై కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని వాటి టెండర్లను కూడా పిలవగా ఆన్లైన్లో టెండర్లు వేశారని అప్పుడు వేసిన టెండర్లను ఇప్పటివరకు ఓపెన్ చేయకుండా మళ్లీ కొత్తగా టెండర్లు పిలవాలని దురుద్దేశంతో కొత్తగా ఏర్పడ్డ పాలకవర్గం ప్రయత్నించడం సిగ్గుచేటని ఇది పూర్తిగా కమిషన్ల కోసమే తప్ప ప్రజల కోసం కాదని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి సహాయ కార్యదర్సులు న్యాలపట్ల రాజు, పైడిపల్లి రాజులు విమర్శించారు. ఈసందర్భంగా కసిరెడ్డి సురేందర్ రెడ్డి,న్యాలపట్ల రాజు, పైడిపల్లి రాజు మాట్లాడుతూ గత నగరపాలక సంస్థకు అర్బన్ ఇన్ ఫాస్ట్ట్రక్చర్ డెవలప్మెంట్ నిధులనుంచి యాభై కోట్ల రూపాయలు మంజూరయని ఈనిధులతో కొత్తగా విలీనమైన గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు ఇతర మౌలిక వసతులను కల్పించేందుకు ఉపయోగించాలని నగరపాలక సంస్థ పరిధిలో ఎనభై ఏడు అభివృద్ధి పనులను చేపట్టేందుకు గత సంవత్సరం సిడిఎంఏ పరిపాలన అనుమతి ఇచ్చిందని ఎనభై ఏడు పనుల్లో ఇరవై ఐదు పనులకు కాంట్రాక్టర్ బిడ్ దాఖలు చేయలేదని మిగిలిన అరవై రెండు పనుల్లో కొన్ని పనులకు సింగిల్ టెండర్లు దాఖలు ఎలా అయ్యాయని నిబంధనల మేరకు వచ్చిన టెండర్లకు ఖరారు చేసి ఎల్ఓఏ ఇచ్చి పనులు ప్రారంభించాలని మిగిలిన పనులకు టెండర్లు నిర్వహించాల్సి ఉంటుందని కానీ నూతనంగా ఏర్పడ్డ పాలకవర్గం మళ్లీ టెండర్లను నూతనంగా పిలవాలని చూస్తుందని ఇది దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు నీతివంతమైన పాలన అందజేస్తామని గొప్పలు చెప్పినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదర్శ పాలన అందిస్తామని చెప్తుంటే మున్సిపల్ పాలకవర్గం మాత్రం కమిషన్ల కోసం కకృతిపడి పిలిచిన టెండర్లను రద్దుచేసి తిరిగి టెండర్ ప్రక్రియను పిలవాలని ఆలోచించడం సిగ్గుచేటన్నారు. కమిషన్ల కోసం నగర అభివృద్ధిని కుంటి పడేయడం బాధాకరం. నగరపాలక సంస్థలొ రాజకీయ జోక్యంతో పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయని విలీన డివిజన్లలో అనేక సమస్యలు ఉన్నందున అధికారులు ఈవిషయంలో త్వరగా నిర్ణయం తీసుకుని పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని కసిరెడ్డి సురేందర్ రెడ్డి, న్యాలపట్ల రాజు, పైడిపల్లి రాజులు హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version