గిరిజన సహకార సంస్థలో అవినీతి అక్రమాల పర్వం
* పట్టపగలే గోదాముల ముందు అమ్మకాల దందా
* పట్టించుకుని సంబంధిత ఉన్నతాధికారు
మహాదేవపూర్ జూలై 28 (నేటి ధాత్రి)
గిరిజనులను ప్రైవేటు వ్యాపారుల దోపిడి నుండి రక్షించాలని, గిరిజనులతో పాటు సామాన్య ప్రజలకు సరసమైన ధరలకు వస్తుసేవలను అందించాలనే బృహత్తర లక్ష్యంతో ఏర్పడిన గిరిజన సహకార సంస్థ అవినీతికి అక్రమాలకు నిలయంగా మారింది. సంక్షేమ హాస్టళ్లకు సరుకులు సప్లై చేస్తామని జిసిసి చెప్పడంతోటే ప్రైవేటు టెండర్లు రద్దుచేసి జిసిసికి కాంట్రాక్టును కళ్ళు మూసుకొని ప్రభుత్వం ఖరారు చేస్తుంది. జిసీసీ నుండి వచ్చిన సరుకులను మహాదేవపూర్ లో జిసిసి గోదాం అధికారులు పట్ట పగలే గోదాముల ముందు సరుకులను ఏదేచ్చగా అమ్ముతూ మరి కొంత సరుకులను హోల్ సేల్ దుకాణా దారులకు ఇష్టం వచ్చినట్లు కమిషన్ రూపం లో అమ్ముతూ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. ఇదేం పనులు చేస్తున్నారు అని కొందరు వ్యక్తులు అడుగగా ఎవ్వరు ఏమి చెయ్యలేరు అని, ఎవ్వరికి చెప్తావో చెప్పుకో అని నేనొక్కడినే ఈ సొమ్ము తింటలేనని అందరి అధికారులకు ముట్టచెప్పుడే అని మాట్లాడటం విశేషం. గోదాముల దగ్గరనే సరుకులు మాయం కావడంతో హచ్చర్య పోతున్న మండల ప్రజలు హాస్టళ్లకు చేరక విద్యార్థులు ఏం తింటున్నారో ఏమి పెడుతున్నారో తెలియడం లేదని వాపోతున్నారు. ఏది ఏమైనా ఇప్పటికైన ఉన్నతాధికారులు కళ్ళు తెరిచి ప్రభుత్వ, సామాన్య ప్రజల సొమ్మును కాపాడాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.