ప్రజాపాలన గ్రామసభల్లో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి
500 రూపాయలకు సిలిoడర్
రాని పేదలకు ఇవ్వాలి
వనపర్తి నేటిధాత్రి;
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలు ప్రజలకు అందుతాయని ఎవరు ఆందోళన ఆవేదన గురి కావద్దని నిరంతరాయంగా జరిగే ప్రక్రియ ప్రజలందరికీ లబ్ధి చేకూరుతుందని వనపర్తి ఎమ్మెల్యేతూడి మేఘారెడ్డి అన్నారు
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామసభలు మంగళవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఘణపురం మండలం ఉప్పర్ పల్లి, పెద్దమందడి మండల చీకరుచెట్టు తండా,ముందరి తండాలలో నిర్వహించిన గ్రామసభల్లో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, స్థానిక సంస్థల కలెక్టర్ సంచిత్ గాంగ్వర్, లతో కలిసి గ్రామసభల్లో పాల్గొన్నారు
ఎమ్మెల్యే మెగారెడ్డి అధికారులు మాట్లాడుతూ జనవరి 26వ తేదీ నుంచి అమలయ్యే రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల 500 లకు గ్యాస్ సిలిండర్ పథకాలకు అర్హత గల లబ్ధిదారుల ఎంపిక నిమిత్తం చేపట్టిన ఈ గ్రామసభలలో అర్హత గల వారిని గుర్తించాలని, ఎవరైనా దరఖాస్తు చేసుకోని వారు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని ఎమ్మెల్యే సూచించారువివిధ గ్రామాలలో వనపర్తి పట్టణంలో 500 లకు పేదలకు గ్యాస్ సిలిండర్ రాని వారికి ఇవ్వాలనిప్రజాలు కోరారుగ్రామాలలో నిర్వహించే సమావేశాల్లో పాల్గొని అర్హత గల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే సూచించారు
ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ వివిధ మండలాల, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తాసిల్దార్లు వ్యవసాయ అధికారులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు