పట్టు వస్త్రాలను బహుకరించిన హైదరాబాద్ వాస్తవ్యులు
వెంకటేశ్వరుని నామాలరూపంలో గణపేశ్వరుని అలంకరణ
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ కు ముక్కోటి ఏకాదశి శోభ సంతరించుకుంది. ధనుర్మాసం సందర్భంగా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి నందీశ్వరుని పూజతో కార్యక్రమాలను ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ప్రారంభించారు. అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ కు చెందిన వి సుధా కనకదుర్గ వరప్రసాద్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను బహుకరించారు. ఈ సందర్భంగా స్వామివారిని వెంకటేశ్వర స్వామి నామాల రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు నాగరాజు భక్తులకు ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.