నర్సంపేట,నేటిధాత్రి:
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరిపై ఆ వైకుంఠ వాసుడు దివ్య ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ నర్సంపేట పట్టణంలోని వెంకటేశ్వరస్వామిని ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టి అభిషేకాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ములుకల మనీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవండ్ల రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.