PhD Achievement in Cyber Security
పరిశోధనలు భవిష్యత్ అభివృద్ధికి బలమైన పునాది
* చైతన్య డీమ్డ్ టూ బి యూనివర్సిటీ వ్యవస్థాపకులు & ఛాన్సలర్ , డాక్టర్ సిహెచ్ . వి . పురుషోత్తం రెడ్డి
మొయినాబాద్,నేటిధాత్రి :
మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్‌లోని చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీలో యాకుబ్ రెడ్డి కంచరకుంట కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో పీహెచ్డీ డిగ్రీ పట్టా అందుకున్నారు. అయన ఆన్ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ఎనేబుల్డ్ ఫ్రేంవర్క్ అండ్ అల్గారిథమ్స్ ఫర్ ఇంట్రుసిన్ డిటెక్షన్ టువార్డ్స్ సైబర్ సెక్యూరిటీ అనే పరిశోధన సిద్ధాంతంపై ఆచార్య జి . శంకర్ లింగం పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేసి ఈ ఘనతను సాధించారు. బుధవారంవిశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు అండ్ ఛాన్సలర్ డాక్టర్ సిహెచ్ . వి .పురుషోత్తం రెడ్డి డిగ్రీని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రంగంలో పరిశోధన దేశాభివృద్ధికి కీలకమని, సైబర్ భద్రత దిశగా చొరబాటు గుర్తింపు కోసం కృత్రిమ మేధస్సు ఆధారిత చట్రం అల్గారిథమ్‌లు అనే అంశంపై పరిశోధన చేయడం చాల అభినందనీయమని పేర్కొన్నారు. ఇటువంటి పరిశోధనలు దేశానికి గర్వకారణమే కాకుండా భవిష్యత్ అభివృద్ధికి బలమైన పునాదిని ఏర్పరుస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అండ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, డాక్టర్. సిహెచ్ . సాత్విక రెడ్డి , వైస్ ఛాన్సలర్ ఆచార్య జి . శంకర్ లింగం, రిజిస్ట్రార్ ఆచార్య యం. రవీందర్, డీన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆచార్య క్రిస్టోఫర్, డీన్ అడ్మినిస్ట్రేషన్ ఆచార్య ఏ. రాజు, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ ఆచార్య ఎం. జగదీశ్వర్, పరీక్షల కంట్రోలర్ ఆచార్య బి. రాజేందర్ రెడ్డి , విభాగాధిపతి అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ డాక్టర్ ఈ. అరవింద్ రెడ్డి, డాక్టర్ కె . సతీష్ కుమార్ , అసిస్టెంట్ రిజిస్ట్రార్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గాదె రాంబాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
