Municipal Co-option Members Sworn In
మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ప్రమాణ స్వీకారం
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కో-ఆప్షన్ ఎన్నికల్లో జనరల్ కేటగిరీ కో-ఆప్షన్ సభ్యుడిగా సజ్జనపు స్వామి, మహిళా కేటగిరీలో చల్లా రేణుక, మైనారిటీ జనరల్ కేటగిరీలో ఎం.డి అబ్దుల్ హఫీజ్, మైనారిటీ మహిళా కేటగిరీలో ఎం.డి మిన్హాజ్ ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరైనారు అనంతరం నూతనంగా ఎన్నికైన కో-ఆప్షన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. ప్రజలకు అంకితభావంతో, నిబద్ధతతో పని చేస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.
