భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నాడు గ్రీవెన్స్ డే లో GSP రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ విద్యార్థి. జేఏసీ రాష్ట్ర నాయకులు ఇర్ప ప్రకాష్ కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేత అనంతరం మీడియాకు విడుదల చేస్తూ దుమ్మగూడెం మండలం ములకనాపల్లి ఎంపీపీ ఎస్ స్కూల్లో SGT. గా అక్టోబర్ 16 జాయిన్ అయిన ముత్యాల సత్యదాస్ తండ్రి రమణ య్య ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఖమ్మం జిల్లా విఆర్ పురం మండలంలో వడ్డీలు బీసీల కుల ధ్రువీకరణ పత్రంతో ఎస్జీటీగా స్కూల్ టీచర్ గా విధులు నిర్వహించినారు కానీ తండ్రి వంశ వృక్షం ద్వారా కుల ధ్రువీకరణం పొందకుండా భద్రాచలం రెవిన్యూ ఆఫీసులో దొడ్డి దారిన ఎస్సీ మాల కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ 2024 డీఎస్సీలో ఎస్జీటీగా సెలెక్ట్ అయి ఉద్యోగం పొందియున్నారు కావున వాస్తవ నిజ నిజాలు తెలియాలంటే తక్షణమే ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి దొడ్డి దారిన ఎస్సీ మాల సర్టిఫికెట్ పొందిన బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఉద్యోగం నుండి డిస్మిస్ చెయ్యాలి . ప్రభుత్వాన్ని మోసం చేసిన అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు
ధనుర్మాసం సోమవారం అమావాస్య సందర్భంగా.. పాలమూరు పట్టణం తిరుమలహిల్స్ లోని, శ్రీ త్రినేత్ర దశ భుజా వీరాంజనేయస్వామి దేవస్థానం నంద గోకులం గోశాలలో గోవులకు బెల్లం, కూరగాయలను స్వచ్ఛంద సేవకుడు డా. నిచ్చనమెట్ల రాజేంద్రప్రసాద్ పంపిణీ చేశారు. ఈసందర్బంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తాము సంపాదించే సంపాదనలో కొంత దాన ధర్మాలకు ఉపయోగించాలన్నారు. సోమవారం సోమావతి అమావాస్య సందర్బంగా.. ప్రతిఒక్కరికి మంచి జరగాలని భగవంతుణ్ణి ప్రార్థించినట్లు అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ తో పాటు హరినాథ్, రాజు, గోశాల సభ్యులు పాల్గొన్నారు.
క్యాతనపల్లి మునిసిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డు అమరవాదిలో ఉచిత పశు గర్భకోశ వైద్య శిబిరాన్ని జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా పశు వైద్యాధికారి తిరుపతి నేతృత్వంలో ముఖ్య అతిథులుగా ఐదవ వార్డు కౌన్సిలర్ జిలకర మహేష్ హాజరయ్యారు. పశువైద్యాధికారి తిరుపతి గోపాలమిత్ర రైతులతో కలిసి పశు వైద్య శిబిరంలో పాల్గొన్నారు.గర్భకోశ వ్యాధి చికిత్స, కృత్రిమ గర్భధారణ సహాయంతో పుట్టిన దూడలకు,పశువులకు నట్టల నివారణకు మందులను అందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
నూతన సంవత్సర వేడుకలు సంతోషాలనేపద్యంలో నిర్వహించుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరపున భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ జి రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ…. నేడు డిసెంబర్ చివరి రోజు కావడంతో నూతన సంవత్సర ఉత్సాహంతో మద్యం సేవించి వాహనాలు నడిపినా సరే మైనర్లు వాహనాలు నడిపినా సరే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డీజీలు వినియోగిస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామని అన్నారు. నిషేధిత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, శబ్ద కాలుష్యం చేస్తూ వాహనాలు నడుపుతే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
తెలంగాణ బిసి బహుజన సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కారదర్శి గా వరంగల్,కాశిబుగ్గ కు చెందిన తోట రాణి పటేల్ మున్నూరు కాపు ను నియమించడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు ప్రతాపగిరి విజయ్ కుమార్ తెలియచేశారు.తమ కుల సంఘంలో మరియు బిసి కుల సంఘాలలో ఉన్న వారిని కులాలకు అతీతంగా చైతన్య పరుస్తూ హక్కుల సాధన కొరకు తన వంతు కృషి చేస్తున్న తోట రాణి పటేల్ ను గుర్తిస్తూ ఈ పదవిలో అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా తోట రాణి పటేల్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో రాష్ట్ర పదవి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రతాపగిరి విజయ్ కుమార్ కు,తెలంగాణ కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆకారపు మోహన్ కు, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోనగాని యాదగిరి గౌడ్ కు,తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లపు సమ్మయ్య కు,తెలంగాణ రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నూతనకంటి ఆనందం కు, తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోజు బిక్షపతి కు,తెలంగాణ అరెకటిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంబీకార్ అశోక్,, తెలంగాణ మేదరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జోర్రీగల శ్రీనివాస్, తెలంగాణ నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాసమళ్ళ బాలకృష్ణ,తెలంగాణ సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తిపిరిశెట్టి శ్రీనివాస్,తెలంగాణ గంగిరెద్దుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిడ్డి కనకయ్య, తెలంగాణ పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఖమ్మంపాటి వెంకటేశ్వర్లు,దాసరి సంఘం అధ్యక్షులు కాజిపేట వెంకటరామ్ నర్సయ్య, యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకల కేదారి యాదవ్,ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బయ్యస్వామి,లీగల్ అడ్వైజర్ ప్రతాపగిరి బిక్షపతి,గంగపుత్ర సంఘం నాయకులు బర్కం రాంమోహన్, కటకం విజయకుమార్,చింత నాగరాజు,ఏనుగుతల యాదగిరి, ప్రతాపగిరి గోవర్ధన్ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణా డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్, లచ్చి రెడ్డి
కాశిబుగ్గ నేటిధాత్రి.
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్ మరియు తెలంగాణ తహసిల్దార్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లచ్చి రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం వరంగల్ లోని ఐశ్వర్య గార్డెన్ లో జరిగిన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చి రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలతో రెవెన్యూ వ్యవస్థ ను నిర్వీర్యం చేశారు,రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొన్న అవమానాలను,మన తోటి ఉద్యోగులు రాత్రికి రాత్రి ఎలాంటి సర్వీస్ కాని వయసు గానీ అర్హతలను తీసుకోకుండా 5200 మంది వీఆర్వోలను వేరే శాఖలోకి నిరంకుశ ధోరణితో పంపించడం జరిగిందనీ అన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులు వేరే శాఖలోకి వెళ్ళిన సందర్భంలో రెవెన్యూ శాఖలో,గ్రామస్థాయిలో పనిచేసే అధికారులు లేక రెవెన్యూ ఉద్యోగులు అనగా తహసీల్దార్ నుండి జిల్లా కలెక్టర్ స్థాయి వరకు నానా రకాలుగా ఇబ్బందులకు గురవటం జరిగిందన్నారు. అదేవిధంగా వరదలు,కరువు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రాథమిక విచారణ చేసి నివేదిక సమర్పించే అధికారులు లేకపోవడం, ప్రభుత్వ భూముల ఆక్రమణలను పసికట్టడంలో వైఫల్యం పొందిందని, ప్రజా శ్రేయస్సు కోసం ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించి,నిర్ణయం తీసుకుందని అన్నారు.అందుకు అనుగుణంగా రెవెన్యూ వ్యవస్థను తిరిగి బలోపేతం చేసేలా,రెవెన్యూ వ్యవస్థ పునర్ వైభవంలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కృషి చేయాలని కోరారు.
⏩ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత రెవెన్యూ ఉద్యోగుల మీద ఉంది.
టి జి టి ఏ స్టేట్ జనరల్ ప్రెసిడెంట్ పాక రమేష్
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వము అమలుపరిచే ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసే బాధ్యత రెవెన్యూ ఉద్యోగుల మీద ఉందని గుర్తు చేశారు. అలాంటి రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం,పునర్ వైభవం తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నం చేసి ధరణి 2020 మూలంగా సామాన్య రైతు తను కోల్పోయిన భూములను పొందాలంటే కోర్టుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగారని అన్నారు.కానీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించి కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చి పట్టాదార్ పాస్ బుక్కులు జారీ చేసే అధికారం తాహసిల్దార్ కు,ఆర్ డి ఓ కు కల్పించడం చాలా శుభ పరిణామం గా భావిస్తున్నామని తెలిపారు.
⏩ రెవీన్యూ నూతన చట్టం భూ భారతి అవసరం ఎంతైనా ఉంది.
టి జి టి ఏ స్టెట్ జనరల్ సెక్రటరీ: ఫూల్ సింగ్ చౌహాన్
దేశంలోనే పలు రాష్ట్రాల రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేసి తెలంగాణ ప్రజల భౌగోళిక స్వరూపాన్ని బట్టి దానికి అనుకూలమైనటువంటి నూతన రెవెన్యూ చట్టం భూభారతి అవసరం ఎంతైనా ఉన్నదని అన్నారు.తెలంగాణ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయుటకు ఎలాంటి సమస్య అయినా మండల స్థాయిలో పరిష్కరించుటకు భూభారతి చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని ఫూల్ సింగ్ చౌహాన్ చెప్పారు.
⏩తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ సభ్యత్వం కొరకు యాప్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రారంభం.
టి జి టి ఏ స్టేట్ ప్రెసిడెంట్ : రాములు.
మొట్ట మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ టి జి ఆర్ ఎస్ ఏ సభ్యత్వ నమోదు యాప్ కార్యక్రమాన్ని గౌరవించి లచ్చిరెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి రెవెన్యూ సంక్షేమం కొరకు రెవెన్యూ సమస్యలు పరిష్కారం కొరకు ఈ యాప్ లో సభ్యత్వ నమోదు చేసుకోవాలని కోరారు.
⏩ పెండింగ్ లో ఉన్న వీఆర్ఏలకు పోస్టింగ్ ఇప్పించాలి.
టి జి టి ఏ స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్. మొహ్మద్ ఇక్బాల్.
గత ప్రభుత్వ హయాంలో వీఆర్ఏలను రెండు వర్గాలుగా విభజించి 60 సంవత్సరాల లోపల ఉన్న వారికి జూనియర్ అసిస్టెంట్ లుగా పోస్టింగ్ లు ఇచ్చారని 61 సంవత్సరాలు దాటిన వారికి ఇంకా పోస్టులు ఇవ్వకుండా పెండింగ్లో ఉన్నందున, వారి సమస్యను సానుకూలంగా స్పందించి పెండింగ్ లో ఉన్న 3797 మంది వి.ఆర్. ఏ లకి పోస్టింగ్ లు ఇప్పించాలని టి జి టి ఏ స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ మొహ్మద్ ఇక్బాల్ కోరారు.
⏩ చనిపోయిన వీ ఆర్ ఏ కుటుంబాలకు న్యాయం చేయాలి. టి జి టి ఏ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ: విక్రమ్ కుమార్
అదే విధంగా ఇంకా పెండింగ్ లో ఉన్న 61 సంవత్సరాలు దాటిన వీఆర్ఏ మరియు చనిపోయిన వీఆర్ఏ ల కుటుంబాలకు న్యాయం చేయాలని టి జి టి ఏ ఆర్గనైజింగ్ సెక్రెటరీ విక్రమ్ కుమార్ కోరడం జరిగింది.
వి.ఆర్. ఏ.ఉద్యోగం చేస్తూ సీ సీ ఎల్ ఏ కార్యాలయం నుండి జారీ చేసిన సర్కులర్ కంటే ముందు చనిపోయిన వీఆర్ఏలందరికి కూడా వారి వారసులకు వెంటనే ఉద్యోగ అవకాశాలుకు అనుగుణంగా నియమాకాలు చేపట్టి వారి కుటుంబాలను ఆదుకోవాలని, ఇట్టి విషయంలో లచ్చి రెడ్డి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సూర్య, రేణుక తదితరులు పాల్గొన్నారు.
⏩వరంగల్,హనుమకొండ మండలాల నూతన టీ జీ ఆర్ ఎస్ ఏ కమిటీ ఏర్పాటు.
హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ముత్తినేని రంజిత్ కుమార్, జనరల్ సెక్రటరీగా ప్రసాద్ జేఏసీ చైర్మన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి హనుమకొండ జిల్లా టి జి ఆర్ ఎస్ ఎ సెక్రటరీగా రంజిత్ కుమార్, జనరల్ సెక్రటరీగా జి నాగేంద్రప్రసాద్,అదే విధంగా వరంగల్ జిల్లా అధ్యక్షులుగా నాగేంద్రప్రసాద్ జనరల్ సెక్రటరీగా కీర్తన్ ఎంపిక అయ్యారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ గా సుభాన్, సుమన్ జలపతి ఎన్నిక అయ్యారు.
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రం, పూర్వ ప్రాథమిక పాఠశాల -2 వెనుక భాగంలో మ్యాన్ హోల్ కు మూత లేకపోవడంతో గత 6 నెలలుగా కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. మ్యాన్ హోల్ కు మూత ఏర్పాటు చేయాలని గ్రామపంచాయతీ సిబ్బందికి తెలిపిన పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఆగ్రహ వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఈ రోడ్డు గుంట అంగన్వాడి కేంద్రానికి 10 మంది చిన్నారులు వెళ్తుంటారు. ఏదైనా ప్రమాదం జరిగితే.. ఎవరు బాధ్యులని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి మ్యాన్ హోల్ కు మూత బిగించాలని చిన్నారుల తల్లిదండ్రులు, కాలనీవాసులు, బాటసారులు కోరారు
రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి నిరసిస్తూ దేశవ్యాప్తంగా వామపక్షాలు ఇచ్చిన పిలుపులో భాగంగా చర్ల మండలంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి *సిపిఐఎం మండల కార్యదర్శి మచ్చ రామారావు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ లు మాట్లాడుతూ భారత దేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన అంబేద్కర్ మీద ఆధారపడే అమిత్ షా పదవుల ఫలాలు అనుభవిస్తున్నాడని ఆ విషయం దేశవ్యాప్త ప్రజలకు అందరికీ తెలుసని వారన్నారు అయినా అవన్నీ మర్చిపోయిన నరేంద్ర మోడీ ప్రభుత్వం అంబేద్కర్ ఏవైనా దేవుడా అని వ్యాఖ్యానించడం సరైనది కాదని వారు అన్నారు అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు నిజంగానే దేవుడని చీకటి బతుకులకు ఆయన కొనియాడారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటిసారి ఏర్పాటైనప్పుడు నరేంద్ర మోడీ ఈ పదవికి కారణం అంబేద్కర్ అని ఆయన రాసిన రాజ్యాంగమేనా అని ఆరోజు గొప్ప చెప్పినవారు ఈనాడు అంబేద్కర్ దేవుడా అని కించపరచడంలో అంతర్వేమిటో అర్థం చేసుకోవాలి వారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ మన ధర్మ శాస్త్రాన్ని ప్రజల్లోకి తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అందులో భాగంగానే భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై వ్యాఖ్యలు చేస్తున్నారని వారు అన్నారు. పైగా క్షమాపణలు చెప్పకపోగా నరేంద్ర మోడీ అమిత్యాలు కలిసి ట్విట్టర్లో కాంగ్రెస్ పార్టీ వక్రీకరించిందని కాంగ్రెస్ పార్టీ ఏ అంబేద్కర్ ని అవమానించిందని సమర్థించుకుంటున్నారు ఏది ఏమైనా రాజ్యసభలో ప్రత్యక్షంగా కామెంట్ చేసి కించపరిచిన అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పాలని వారన్నారు ఈ కార్యక్రమంలో ఐద్వ జిల్లా నాయకురాలు పొడుపు గంటి సమ్మక్క సిపిఎం మండల నాయకులు బాలాజీ వర్మ వరలక్ష్మి షారోని ఏఐటిఎఫ్ ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం జిల్లా నాయకులు గొంది ముయ్యన్న మల్లేష్ నరసింహ తదితరులు పాల్గొన్నారు
నారాయణపేట జిల్లా (మం) పరిధిలోని పేరపల్ల అనుబంధ గ్రామపంచాయతీ పరిధిలోని మీది తండాకు చెందిన రవళికి సోమవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. ఇంటికి చేరుకున్న అంబులెన్స్ రవళిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో రవళికి పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. కాసేపటికి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారని ఈఏంటీ తాజుద్దీన్, రవికుమార్ తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని నేరళ్లపల్లి గ్రామంలో సోమవారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి మాతృమూర్తి శశికళ రెడ్డి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 72 మంది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 232 మంది విద్యార్థులకు షూ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శశికళ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి నిరుపేద విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తారన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత చదువులు చదివి తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శంకర్ నాయక్, హరి సింగ్, ఖలీల్, హనుమంతు, యాదగిరి, రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ని చిట్యాల మండలం నైన్ పాక గ్రామానికి చెందిన ఉమ్మనవేని మల్లేష్ మూడు రోజుల క్రితం నైన్త్ పాక గ్రామ సెంటర్లో పని నిమిత్తము తన ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో తన రియల్ మీ స్మార్ట్ ఫోన్ ఎక్కడో పడిపోయిందని చిట్యాల పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా చిట్యాల పోలీసు వారు సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా అట్టి మొబైల్ ని గుర్తించిసోమవారం రోజున మల్లేష్ కి అప్పజెప్పడం అయినది అట్టి మొబైల్ ని గుర్తించడంలో సహాయపడిన ఉమెన్ కానిస్టేబుల్ కోమల కానిస్టేబుల్ లాల్ సింగ్ ని అభినందించిన చిట్యాల ఎస్ఐ జి శ్రావణ్ కుమార్,ఈకార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాలొన్నారు.
నారాయగూడలోని కేశవ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో 52 సంవత్సరాల క్రితం చదువుకున్న పలువురు స్నేహితులు ఒక్కటిగా శనివారం సాయంత్రం పాఠశాలకు చేరుకుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం హైదరాబాదు బోట్స్ క్లబ్ వేదికగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు తమ పరిచయం, నిర్వహిస్తున్న కార్యక్రమాలతో పాటు తమ పిల్లలు ఏఏ హోదాల్లో స్థిరపడ్డారనే విషయాలను సహ విద్యార్థులకు తెలిపారు. పాఠశాల పూర్వ విద్యార్థి సీనియర్ జర్నలిస్టు పి.వి.మదన్ మోహన్ మాట్లాడుతూ తాను ఏడు నుండి తొమ్మిదో తరగతి వరకు చదువుకున్న రోజుల్లో నాడు అధ్యాపకులు చూపిన చొరవ విద్యార్థిగా మంచి నడవడికి దోహదపడినట్టు వివరించారు. పాఠశాలను వీడి చాలా రోజలైనా పాఠశాల బాల్య మిత్రులతో పెనువేసుకొన్న బంధం వల్ల మళ్ళీ పూర్వ విద్యార్థులు కలువాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని గతంలో కొత్తకొండ,వంగరలో అతి కొద్ది మంది స్నేహితుతో నిర్వహించామని గుర్తు చేశారు. శనివారంనాడు జరిగిన ఈ ఆత్మీయ సమావేశానికి యాభై మంది పూర్వ విద్యార్థులు హాజరవడం అభినందనీయమన్నారు. కరీంనగర్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వెలిచాల రాజేందర్ రావు కూడా కేశవ మెమోరియల్ తమ సహ విద్యార్థి అని తెలిపారు. మరో పూర్వ విద్యార్థి మల్లారం గ్రామానికి చెందిన పూర్వ జర్నలిస్డు చాడా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పూర్వ విద్యార్థులను సమిష్టిగా కలిపేందుకు గత సంవత్సర కాలంగా ప్రయత్నాలు జరిగాయని అందుబాటులో వున్న మిత్రుల ద్వారా సమాచారం సేకరించి వారిని ఒప్పించి ఈ ఆత్మీయ కలయిక కార్యక్రమం విజయవంతం చేశామని తెలిపారు. హైదరాబాదుకు చెందిన పూర్వ విద్యార్థి లింగం మాట్లాడుతూ ఈ సమావేశంలో కలసిన పూర్వ విద్యార్థులు తాము అనేక రంగాలలో స్థిరపడ్డారని తెలిపారు. ఇక నుండి ప్రతి మూడు నెలలకు ఒక ఆత్మీయ సమ్మేళనం హైదరాబాద్ కాకుండా యితర ప్రాంతాలలో నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గోన్న చిన్ననాటి మిత్రులు పాఠశాల రోజల్లో తాము చేసిన కొంటె పనులు,టీచర్లతో వున్న అనుబంధం… కొంటె చేష్టలను చేసిన వారిని ఏఏ టీచర్ ఏఏ విధంగా దండించే వాడో అనే పాత జ్ఞాపకాలను నెమరు వేసుకొన్నారు. అదేవిధంగా అందుబాటులో వున్న నాటి టీచర్లకు వీడియో కాల్ చేసి పరిచాయాలు నిర్వహించకొని ఆశిస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో శంబు ప్రసాద్,విష్ణుదత్త,రమణారావు, వేణుమోహన్,సుబ్రహ్మణ్యం, పట్నాయక్, రవీందర్ రెడ్డి, నాగేంద్ర కుమార్,గోవర్ధన్,లక్ష్మీనారాయణ, యన్.వి.యన్ రావు,క్రిష్ణ, నర్సింహారావు పాల్గొన్నారు.. బాల్య స్నేహితుడు శశి సౌజన్యంతో ఈ కార్యక్రమం కొనసాగింది.
నాగార్జున సినీ కేరిర్‌లో అత్యధికంగా హిట్లు పడిన ధియేటర్ హైదరాబాదులోని దేవీ ధియేటర్‌ను చెబుతారు. దేవి ధియేటర్‌లో అందరి హీరోలన్నా నాగార్జున షీల్డులే ఎక్కువ కనిపిస్తాయి. గీతాంజలి, శివ, నిన్నే పెళ్ళాడతా, హలో బ్రదర్, నిన్నే ప్రేమిస్తా, నువ్వు వస్తావని, అన్నమయ్య ఇలాంటి సూపర్ డూపర్ హిట్లన్నీ దేవీలోనే ప్రదర్శించబడ్డాయి. ఇవే కాకుండా అనేక హిట్ సినిమాలు దేవీలోనే ఎక్కువ కాలం ఆడాయి. రికార్డులు సృష్టించాయి. శివ, నిన్నే పెళ్ళాడతా సినిమాలు సంవత్సరానికి పైగా ఆడాయి. నాగార్జున రికార్డులు నాగార్జునే బ్రేక్ చేసేవారు. నాగార్జున సినిమా బొమ్మ దేవిలో పడితే హిట్ అని ముందే అంచనా వేసేవారు. కొన్ని సెంటిమెంట్లు అలా వర్కవుట్ అయ్యేవి. అందుకే నాగార్జున సినిమా అంటే దేవీలో రిలీజ్ అయ్యేది
కొత్తగూడ, నేటిధాత్రి : గత కొన్ని రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనీ అటవీ ప్రాంతాలలో కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో కొత్తగూడ ఎఫ్ఆర్ఓ వజహత్ ఆధ్వర్యంలో శనివారం నాడు తిమ్మాపురం, ఆదిలక్ష్మిపురం, ఎంచగూడెం, కోనాపూర్, ఓటాయి ,సాదిరెడ్డిపల్లి అటవీ ప్రాంతాల్లో డిఆర్ఓ కరుణ, సెక్షన్ ఆఫీసర్లు రాజేష్, పద్మారావు, లతో కలిసి పులి కదలికలపై క్షున్నముగా పరిశీలిస్తూ,ప్రజలను అప్రమత్తం చేసిన అటవీ శాఖ అధికారులు…
ఈ సందర్భంగా ఎఫ్ ఆర్ ఓ వజహత్ మాట్లాడుతూ
పులి రాత్రి వేళల్లో తెల్లవారు ఝామున సంచరించే అవకాశం ఉన్నందున,నాలుగు కాళ్ల జంతువులనే ఎక్కువగా ఆహారంగా తీసుకుంటుందని, అందువల్ల పులి సంచరించే ప్రాంతాల్లో ప్రజలు రాత్రివేళల్లో ఆరు బయట సంచరించకుండా జాగ్రత్తలు పాటించాలి…పులి సంచరించిన గ్రామాల అటవీ ప్రాంతం, పరిసర గ్రామాల్లో అధికారులు విస్తృతంగా పర్యటించి వాటి పాద ముద్రలు పరిశీలిస్తున్నాం.. ఆయా గ్రామాల ప్రజలతో మాట్లాడి వారికి జాగ్రత్తలు చేపట్టాలని పులి తిరిగినటువంటి ఆనవాళ్లు గానీ పులి కనబడిన వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని వారు కోరారు… అటవీ ప్రాంతాలలో ఆకస్మాత్తుగా మనుషుల ఉనికిని గమనిస్తే పులి దాడిచేసే అవకాశం ఉంటుందని,బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, ప్రజలు ఆరుబయట నిద్రించడం, సంచారం లేని ప్రదేశాల్లో ఒంటరిగా తిరగడం ప్రమాదకరమని, ఒంటరిగా అడవుల్లోకి వెళ్లకూడదు అని పేర్కొన్నారు… ఈ కార్యక్రమంలో బీట్ ఆఫీసర్లు బిక్కు, ఉదయ్, వేణుగోపాల్, సతీష్, అనిమల్ ట్రాకర్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు…
`సీడబ్ల్యుసీ అనుమతి లేఖ తిప్పిపంపడంతో సమస్య మొదటికి
`కాంగ్రెస్ తొలి ప్రాధాన్య ప్రాజెక్టు పాలమూరు
`కృష్ణా జలాల వివాదం పరిష్కారం కాకపోవడమే కారణం
`12.3లక్షల ఎకరాలకు నీరు, 1200 గ్రామాలకు తాగునీరు అందించడం లక్ష్యం
`ప్రాజెక్టుపై పెట్టిన ఇన్నివేల కోట్లు వృధాకావల్సిందేనా?
`దీనిపై రేవంత్ సర్కార్ స్పందన ఏంటో?
`పరిహారం అందక చాలా ముంపు గ్రామాల ప్రజల్లో అసంతృప్తి
`పెండిరగ్ బిల్లులు, పెరుగుతున్న ప్రాజెక్టు వ్యయం మరో తలపోటు
హైదరాబాద్,నేటిధాత్రి:
ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గండ జిల్లాలకు ప్రయోజనం కలిగించే పాలమూరుా రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి నీటి కేటాయింపులపై డీపీఆర్‌ను కేంద్రజల సంఘం తిప్పి పంపడంతో ప్రాజెక్టుపై నీలినీడలు ముసుకున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టును నిర్మించడంలో పర్యావరణపరమైన జాగ్రత్తలేవీ తీసుకోకుండా, తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ నేషనల్ గ్రీన్ ట్రి బ్యునల్ పర్యావరణ పరిహారంగా రూ.528 కోట్లు చెల్లించాలని, తమ ఆదేశాలను ఉల్లంఘించి నందుకు రూ.300 కోట్లు జరిమానాగా చెల్లించాలని గతంలో ఆదేశించింది. అయితే దీనిపై తె లంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకుంది. అయితే కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖకుచెందిన నిపుణుల కమిటీ (ఈఏసీ) షరతులతో పర్యావరణ అనుమతులు జారీచేయవచ్చని సిఫా రసు చేసినా ఎన్జీటీ దానికి అనుమతించడంలేదు. అయితే రూ.153కోట్లతో పర్యావరణ పునరు ద్ధరణ పనులు చేపట్టి, బాధ్యులైన అధికార్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. అయితే తీవ్రమైన పర్యావరణ ఉల్లంఘనలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడానికి ససేమిరా అంటోంది.
ఈ ప్రాజెక్టుకు మొత్తం ఆరు రిజర్వాయర్లుండగా ఇందులో ఒకటైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ పరిధిలోని గ్రామాలకు చెందిన ప్రజలు అడ్డుకోవడం అడ్డుకోవడంలో దీని పనులు 2023 నవంబర్ నుంచే నిలిచిపోయాయి. వీరు తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ప్రభుత్వం ఈ ఆరు రిజర్వాయిర్లలో కేవలం ఐదింటిలోనే పనులు ప్రారంభించింది. మరోదాన్ని ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ‘పాలమూరు`రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకానికి ప్రాధాన్యత ఇచ్చి ఏటా రూ.6వేల కోట్ల వ్యయంతో వచ్చే నాలుగేళ్లలో దీన్ని పూర్తిచేయాలని ల క్ష్యంగా పెట్టుకున్నా ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రాజెక్టు ముందుకెళ్లే పరిస్థితి కనిపించడంలేదు. శ్రీశైలం జలాశయం నుంచి 90 టీఎంసీల వరద నీటిని 60 రోజులపాటు తరలించి నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్గండ జిల్లాల్లో 12.3లక్షల ఎకరాలకు సాగునీరు, 1200 గ్రామాలకు తాగునీరందించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. 2015, జూన్ 10వ తేదీన నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.35,200 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టుకు అనుమతులు జారీచేసింది. ఈ ప్రాజెక్టు తొలిదశలో శ్రీశైలం నుంచి, అంజనగిరి రిజర్వాయర్‌కు విజయవంతంగా నీటిని పంపింగ్ చేయగలిగారు. అయితే అంతలోనే అప్పట్లో అ సెంబ్లీ ఎన్నికలు రావడంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి మిగతా మంజూరులు ఎన్నికల నియమావళి కారణంగా నిలిచిపోయాయి. గ్రామాలకు తాగునీరు అందించే అంశంపై వచ్చిన లీగల్ అడ్డంకులను అధిగమించినా ప్రాజెక్టు ముందుకు సాగడంలేదు. ఇప్పుడు ప్రాజెక్టు అంచనా వ్య యం ఏకంగా రూ.58086 కోట్లకు చేరుకుంది. ఈ ప్రాజెక్టుపై గత ప్రభుత్వం రూ.31,423 కోట్లు ఖర్చు చేసి 85% పను లు పూర్తిచేసినా తాజా పరిణామాల నేపథ్యంలో ప్రాజెక్టు నీరుగారిపోయే పరిస్థితి ఏర్పడిరది.
ముఖ్యంగా కేంద్రజలసంఘం కొర్రులు పెడుతుండటంతో 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చే యాలని పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా కనిపించడంలేదు. డిసెంబర్ 19న కేంద్ర జలసంఘం రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఒక లేఖ రాసింది. పీఆర్‌ఎల్‌ఐఎస్ ప్రాజెక్టుకు సంబం ధించిని ప్రాజెక్టు రిపోర్టును తిప్పిపంపుతూ, అనుమతుల జాబితానుంచి దీన్ని తొలగిస్తున్నట్టు పేర్కొనడంతో ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాని సీడబ్ల్యుసీ నుంచి అనుమతి లభిస్తుందని ప్రభుత్వం గట్టిగా విశ్వసించింది. ఆవిధంగా అనుమతులు రాగానే 2026 డిసెంబర్ నాటికి పెడిరగ్ పనులు, చెల్లింపులు అన్నీ పూర్తిచేసి ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం కృతనిశ్చయంతో వుంది. ప్రస్తుతం సీడబ్ల్యుసీ లేఖ, ప్రభుత్వం ఆశలపై పూర్తిగా నీళ్లు చల్లిచనట్లయింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 45.66 టీఎంసీ నీటిని కృష్ణానదిపై ని ర్మించిన వివిధ చిన్న ప్రాజెక్టుల ద్వారా పొదుపుచేసి, ఆ నీటిని పీఆర్‌ఎల్‌ఐఎస్ ప్రాజెక్టుకు విని యోగించే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం విస్మరించిందని సీడబ్ల్యుసీ పేర్కొంది. దీనికి సంబంధించి నిర్దేశిత ఫార్మాట్‌లో వివరాలు కావాలని ప్రభుత్వాన్ని గత ఏప్రిల్‌లో కోరినా ఇప్పటివరకు ప్ర భుత్వం నుంచి ఎటువంటి వివరాలు అందలేదని సీడబ్ల్యుసీ పేర్కొంది. నిజానికి పీఆర్‌ఎల్‌ఐఎస్ ప్రాజెక్టుకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం పెట్టిన దరఖాస్తు 2022 సెప్టెంబర్ నెలనుంచి సీడబ్ల్యుసీ వద్ద పెండిరగ్‌లో వుంది. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులద్వారా పొదుపుచేసిన 45 టీఎంసీజలాలను వినియోగిస్తామని మరో 45 టీఎంసీ జలాలను కృష్ణానదికి మళ్లించే గోదావరి జలాల్లోవాడుకుంటామని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.
అయితే సీడబ్ల్యుసీ చెప్పేదేమంటే పోలవరం ప్రాజెక్టునుంచి కృష్ణానదికి తరలించే 80 టీఎంసీ జలాల్లో 45 టీఎంసీల నీటిని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. అయితే ఈ 45 టీఎంసీల జలాలు మొత్తం తమకే కావాలని రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు జగడమాడుతున్నా యి. ఇప్పుడు ఈ 45 టీఎంసీల జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య ఎటువంటి అంగీ కారం లేని నేపథ్యంలో, దీనికి సంబంధించి ఒక అగ్రిమెంట్ కాపీని కూడా ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం సమర్పించాలని సీడబ్ల్యుసీ కోరుతోంది. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811టీఎంసీల కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఆంధ్ర`తెలంగాణ రా ష్ట్రాలు ఎవరికి వారు భీష్మించుకొని తమ వాదనకే కట్టుబడి వుండటంలో సమస్య ఎటూ తెగ డం లేదు. ప్రస్తుతం ఈ వివాదం కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్ విచారణలో వుంది. ఈ సమస్య పరిష్కారం కానంతవరకు తానేం చేయలేనని సీడబ్ల్యుసీ చేతులెత్తేసింది. దీంతో పాలమూరు`రంగారెడ్డి ఎత్తిపోతల ప థకం పెండిరగ్‌లో పడిరది. దీన్ని రేవంత్ ప్రభుత్వం ఏవిధంగా పరిష్కరిస్తుందో చూడాలి.
`అవినీతి పర్వతాన్ని బద్దలు కొడితే తప్ప హైడ్రా లక్ష్యం నెరవేరదు
`కోర్టులను కవచంగా వాడుకోవాలనుకున్నా, నిజాయతీ ముందు తలవంచాల్సిందే
`మీడియా మద్దతు మునిగే నావను కాపాడదు
`ప్రజాహితమే పరమ లక్ష్యమైనప్పుడు, అవినీతి ‘పాము’ తోకముడవాల్సిందే
`రేవంత్ సామర్థ్యానికి పరీక్ష హైడ్రా
హైదరాబాద్,నేటిధాత్రి:
హైడ్రా…ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మానసపుత్రిక! హైదరాబాద్‌లో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములు, చెరువులు, సరస్సుల ప్రాంతాల్లోని భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వా రా నగరంలో గతంలోని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పునరుద్ధరించడం ప్రధానలక్ష్యం. హైడ్రా తన కార్యకలాపాలను కొనసాగించే క్రమంలో ఆయా చెరువుల సమీపంలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను ఎటువంటి సందేహాలకు తావులేకుండా కూల్చివేస్తూ, ఆక్రమణకు గురైన ప్రభు త్వ భూములకు విముక్తి కలిగిస్తూ ముందుకెళుతోంది. అయితే అక్రమ నిర్మాణాలు చేపట్టినవారి లో కొందరు కోర్టులను ఆశ్రయించడంతో హైడ్రా దూకుడు కొంత మందగించిన మాటవాస్తవం. ఈవిధంగా ఆక్రమణలకు గురైన భూములకు విముక్తి కలిగించడం సామాన్యులకు ఆనందం కలిగిస్తుంటే, ప్రభుత్వ భూములను, చెరువుల సమీప ప్రాంతాలను అక్రమంగా ఆక్రమించి పెద్ద నిర్మాణాలు చేపట్టిన బడాబాబులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. దీంతో వారు ఏదోవిధంగా దీన్ని అడ్డుకోవడానికి అన్నిరకాల యత్నాలు చేస్తున్నారు. కోర్టులను ఆశ్రయించడం ఇందులో భాగమే. తమ నిర్మాణాలకు అనుమతులున్నాయి కదా అన్నది వారి వాదన. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో అధికార్లు, గతంలో అటువంటి అక్రమ అనుమతులు జారీచేసిన అధికార్ల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అంతేకాదు ఇటువంటి అనుమతులు ఇవ్వడానికి జి.ఒ.లను సవరించిన వైనాన్ని కూడా వారు పరిశీలిస్తున్నారు. అటువంటి అక్రమ జీవోలను ర ద్దుచేసి వాటి స్థానంలో సవరించిన జీవోలను జారీచేస్తే తప్ప ముందుకెళ్లే పరిస్థితి లేదన్న సంగతిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గుర్తించారు. ఈ నేపథ్యంలో అధికార్లు ఈ ప్రక్రియలో తల మునకలుగా ఉన్నారు. ఇందంతా పూర్తయ్యే సరికి కొంతకాలం పట్టే అవకాశం వుండటంతో,హై డ్రా పనులు కొంత మందగించడం సహజం. ఈ సమయంలోనే విపక్షాలు, అక్రమ నిర్మాణదార్లు హైడ్రాపై సాధ్యమైనంతవరకు వ్యతిరేక ప్రచారాన్ని కొనసాగించి, ప్రజల్లో వ్యతిరేకత సృష్టిం చేందుకు అవసరమైన అన్ని అడ్డదారులను అనుసరిస్తున్నారు.
ఈ క్రమంలో మూసీ ఆక్రమణల తొలగింపు చర్యలను కూడా హైడ్రాకే అంటగట్టి ప్రచారం చే యడం ఒక దుష్టపన్నాగం మాత్రమే. మూసీ పరీవాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాల తొల గింపునకు హైడ్రాకు సంబంధం లేదు. మూసీనది సుందరీకరణ ప్రక్రియలో పాలుపంచుకుంటు న్నవి మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి సంస్థలు మాత్రమే! కేవలం ప్రజలను తప్పుదోవ పట్టిం చి హైడ్రాను అప్రతిష్టపాలు చేయడానికే ఈ ప్రచారాలు. నిజం చెప్పాలంటే మూసీ సుందరీకరణపనులు చేపట్టింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం. ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం ఆ ప్రక్రియను కొనసాగిస్తున్నదంతే! ఇదిలావుండగా సందట్లో సడేమియా మాదిరిగా, ఎవరైనా అనారోగ్య కారణాలు లే దా మరే ఇతర సమస్యల వల్ల మరణిస్తే, ఆ పాపాన్ని కూడా హైడ్రాకే అంటగట్టి ప్రచారం చేస్తున్నారు. ఇది మరీ దారుణం! పెద్ద బిల్డర్లు లేదా వ్యాపారుల్లో కొందరు తమ అక్రమ నిర్మాణాల ను ఏదోవిధంగా కాపాడుకోవడానికి, తమ తప్పుడు ప్రచారాలకు మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఉపయోగించుకోవడం దారుణం. పెద్దఎత్తున ప్రకటనలు ఇవ్వడం ద్వారా ఆయా మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని తప్పుడు వార్తలు రాయించడానికి కూదా వారు వెనుకాడటంలేదు. మీడియాకు ప్రకటనలే జీవనాడి కనుక అసలు నిజాన్ని తొక్కిపట్టి తప్పుడు వార్తలను ప్రచారం చేయడంలో తమవంతు పాత్రను పోషిస్తున్నాయి. ఒక ఆటో డ్రైవర్ అనారోగ్య కారణాలవల్ల మరణిస్తే,హైడ్రా సంస్థ కూల్చివేతలతో మనస్తాపం చెంది మరణించాడని దినపత్రికల్లో రావడం కేవలం హైడ్రాను అప్రతిష్టపాలు చేసేందుకే తప్ప మరోటి కాదు. ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాల్సివచ్చింది. నిజానికి గత ఆగస్టులో హైడ్రాను ప్రారంభించిన కొత్తల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని అధికార్లకు ఆదేశాలు జారీచేశారు.
హైడ్రా తీసుకునే చర్యలు ముఖ్యంగా నీటితావులను, ప్రభుత్వ భూములను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై మాత్రమే. ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడిరది బడాబాబులే తప్ప సా మాన్యులు కాదు. సామాన్యులకు ఎకరాలకొద్దీ స్థలాలుండవన్న సత్యాన్ని గుర్తించాలి. సమస్య వుంటే కోర్టుల్లో ఎదుర్కొనడానికి ఎవరికీ అభ్యంతరం వుండదు. ప్రభుత్వం నిజాయతీగా పనిచే స్తున్నప్పుడు సామాన్యప్రజలు నూటికి నూరుపాళ్లు మద్దతునిస్తారు. వ్యతిరేకత వ్యక్తమయ్యేది కేవలం అక్రమాలకు పాల్పడిన వారి నుంచే. హైడ్రా విషయంలో తప్పుడు వార్తలు ప్రచారానికి అటువంటివారే కారకులు. ఏదోవిధంగా హైడ్రాపై అలజడి సృష్టించేందుకు వారు ఏ చిన్న అవకాశంవదులుకోరు! ప్రస్తుతం జరుగుతున్నదిదే! నిజం చెప్పాలంటే రేవంత్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య తీసుకోవడానికి, గతంలోని ఏ ప్రభు త్వాలు ముందుకు రాలేదు. అంత ధైర్యం కూడా చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వంలో వున్నవారిలో చాలామంది ఈ అక్రమాలకు పాల్పడినవారే! చర్యలకు ఉపక్రమిస్తే తన సీటుకే ఎసరు తెచ్చే స్థాయిలో అక్రమార్కులు బలంగా వుండటం వల్ల అనవసర చిక్కులు మనకెందుకని ఏ ముఖ్య మంత్రీ ఈ దిశగా సాహసం చేయలేదు. రేవంత్ గతంలోని నాయకుల మాదిరి కాదు. తలపెట్టిన కార్యాన్ని అంతు చూడకుండా వదిలిపెట్టడన్న సంగతి గత ఏడాది పాలనలో ఆయన నిరూ పించుకున్నారు. ముఖ్యంగా కప్పల తక్కెడలాంటి కాంగ్రెస్ పార్టీని నియంత్రణలో వుంచి, అధిష్టానాన్ని మెప్పించి ముందుకెళ్లడమంటే కత్తిమీద సాములాంటిదే. ఇంతటి సమర్థతను ప్రదర్శించింది గతంలో ఒక్క వై.ఎస్. రాజశేరరెడ్డి మాత్రమే! సొంత ఇంటిపై నియంత్రణ సాధించి, ప్రత్యర్థులపై పట్టు సాధించి రేవంత్ చేస్తున్న రాజకీయ సాహసయాత్రలో హైడ్రా ఒక భాగం. ఈ హై డ్రాను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంపై రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలు ఆధారపడివున్నాయి. బలంగా వేళ్లూనుకుపోయిన ధన దిగ్గజాల అక్రమాలను ఎదుర్కొని విజయం సాధిస్తే, రేవంత్ గొప్ప పేరును సంపాదించుకోగలరు. అంతేకాదు ఆయన కేవలం కాంగ్రెస్‌లో మాత్రమే కాదు, రాష్ట్రంలో తిరుగులేని నేతగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసు కోగలుగుతారు.
ఏడాది పాలన ముగిసిన నేపథ్యంలో, ‘మాటల మాంత్రికుడు’ కేసీఆర్ రాష్ట్ర పర్యటన చేసే అవకాశాలు మెండుగా వున్నాయి. ఆయన తనయుడు కేటీఆర్ కూడా పాదయాత్ర యోచనలో వున్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అధికార పరమపద సోపానాన్ని అధిరోహించేందుకు పాదయాత్రలు బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడుతున్నాయి. తన పర్యటన సందర్భంగా కేసీఆర్ మాటల తూటాలను, రేవంత్ తనదైనశైలిలో ఎదుర్కొనాలంటే హైడ్రా, మూసీనది ప్రక్షాళన కార్యక్రమాల్లో విజ యం సాధించడం తప్పనిసరి. అప్పుడు కేసీఆర్ మాటల ‘ఆగ్నేయాస్త్రాన్ని’ తన చేతల ‘వారుణా స్త్రంతో’ సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఏది ఏమైనా ‘హైడ్రా’, ‘మూసీ’నది ప్రక్షాళన అనేవి రేవంత్ సామర్థ్యానికి, నాయకత్వ పటిమను నిరూపించుకోవడానికి గొప్ప అవకాశాలుగా చె ప్పవచ్చు.
కోర్టుల్లో కేసుల పుణ్యమాని హైడ్రా కార్యకలాపాలు కాస్త మందగించిన నేపథ్యంలో ప్రత్యర్థులు వివిధ రకాలుగా విమర్శనాస్త్రాలు సంధించడం సహజమే. దీన్ని రేవంత్ వైఫల్యంగా చిత్రీకరించడా నికి విపరీత ప్రయత్నాలు జరుగుతాయి. ఎవరి రాజకీయ వ్యూహాలు వారికుంటాయి కనుక, ఎవరు విజయం సాధిస్తారనేది కాలమే నిర్ణయిస్తుంది.
భారతీయ మజ్దూర్ సంఘ్ కు అనుబంధంగా ఏర్పడి పాత్రికేయుల సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో కృషి చేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) వరంగల్ జిల్లాలో ఆవిర్భవించింది. . స్థానిక బాల సముద్రంలో శనివారం జరిగిన సన్నాహక సమావేశానికి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
డబ్ల్యూజేఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరి కరుణాకర్, రాష్ట్ర కార్యదర్శి శివనాద్రి ప్రమోద్ కుమార్,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అయోధ్య రామయ్యలు ఈ సమావేశంలో ప్రసంగించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఇతర యూనియన్లు విఫలమయ్యాయని వారు ఆరోపించారు. అరవయ్యేళ్లుగా జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకుంటున్న సంఘాల వైఫల్యమే నేటి పాత్రికేయుల దుస్థితికి కారణమని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో నిఖార్సయిన సంఘంగా డబ్ల్యూజేఐ జాతీయ స్థాయిలో ఆవిర్భవించిందని పేర్కొన్నారు. 17 రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వర్తిస్తూ పాత్రికేయుల సమస్యలపై పోరాడుతోందని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే విలేకరులకు ఏ ఆపద వచ్చినా డబ్ల్యూజేఐ అండగా ఉంటుందని తెలిపారు.
జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం పనిచేసే డబ్ల్యూజేఐలో వరంగల్ జిల్లా జర్నలిస్టులు పెద్ద ఎత్తున చేరాలని కోరారు. కొద్ది రోజుల్లోనే తెలంగాణలో తాము అతి పెద్ద జర్నలిస్టు సంఘంగా ఆవిర్భవించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
పాత్రికేయులకు పురస్కారాలు
పాత్రికేయులను ప్రోత్సహించేందుకు జనవరిలో రాష్ట్ర స్థాయిలో పురస్కారాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. జనవరి పదో తేదీలోగా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఈ సందర్భంగా పురస్కారాలకు సంబంధించిన బ్రోచర్ ను విడుదల చేశారు.
`కక్షసాధింపులు మాని ప్రజాసేవపై మరింత దృష్టిపెట్టాలి
`అధికారం శాశ్వతం కాదు
`ఇవ్వాళ మనం చేసేది, రేపు రెట్టింపు ఇబ్బందులు పెట్టవచ్చు
`ప్రచారం కంటే పని ముఖ్యం
హైదరాబాద్,నేటిధాత్రి:
ఒడిషా, తమిళనాడు, ఛత్తీస్‌గడ్, ఆంధ్రప్రదేశ్, జమ్ముాకశ్మీర్ రాష్ట్రాల్లో సోలార్ పవర్ ప్రాజెక్టులకాంట్రాక్టులకోసం గౌతమ్ ఆదాని మరో ఏడుగురు కొందరు అధికార్లకు రూ.265 మిలియన్ డాలర్లు లంచంగా చెల్లించేందుకు అంగీకరించారంటూ, యు.ఎస్.కు చెందిన సెక్యూరిటీస్ ఎ క్స్చేంజ్ కమిషన్ ఆరోపించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ఆంధ్రప్రదేశ్ అధికార్లకు రూ.228 మిలియన్ డాలర్లు ఆదానీ గ్రూపు చెల్లించిందనేది యుఎస్ అధి కార్ల ప్రధాన ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కంపెనీలు ఈ విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి ఈ లంచాలు ముట్టజెప్పారని వారు పేర్కొనడంతో, ఆదానీ గ్రూపుతో నాటి వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. దీని ప్రకారం ఏడు గిగావాట్ల విద్యుత్‌ను ఆదానీగ్రూపు సరఫరా చేయాల్సివుంటుంది. ఇంత పెద్దమొత్తంలో విద్యుత్ సరఫరా ఒప్పందం మరే ఇతర రాష్ట్రంతో కుదరకపోవడం గమనార్హం. అమెరికా చేసిన ఆరోపణలతో ఒక్క సారిగా ఆదానీ గ్రూపు షేర్లు పడిపోయాయి. అయితే తమపై వచ్చిన ఆరోపణలను కంపెనీ తీవ్రంగా ఖండిరచడమే కాకుండా, సెక్యూరిటీలపై మాత్రమే ఆరోపణలున్నాయని, అమెరికా న్యాయశాఖ నమోదుచేసిన కేసుల్లో అసలు వీరిపేర్లు లేవని కంపెనీ మనదేశ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వడంతో ఆదానీ షేర్లు కోలుకున్నాయి. సెక్యూరిటీస్‌పై కూడా కేవలం ఆరోపణలు మాత్రమేనని కంపెనీ స్పష్టం చేసి ఇష్టానుసారం తమపై ఆరోపణలు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేసింది. అమెరికాలో ఎవరో ఆరోపణలు చేస్తే మనదేశంలో తుపానుమాదిరిగా వ్యాపించడం ఒక కంపెనీ లేదా వ్యక్తి విశ్వసనీయతను దెబ్బతీసేవిధంగా పుంఖానుపుంఖాలుగా రాయడం ఒక అలవాటుగా మారిపోవడం దురదృష్టం.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వై.ఎస్.ఆర్.సి.పి.ని నామరూపాలు లేకుండా చేయాలన్న అ కుంఠిత దీక్షతో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడికి ఆదానీ అస్త్రం చేతికి చిక్కింది. లడ్డూ విష యంలో రాజకీయం చేయబోయి తలబప్పి కట్టి తెలుగుదేశం అధినేత ఇప్పుడు, ఆదానీతో ఒప్పందాన్ని తిరగదోడతామంటున్నారు. ఆరోపణలు రుజువై, కంపెనీ తప్పిదం బయటపడితే అ ప్పుడు చర్యలు తీసుకోవడంలో తప్పులేదు. అదీకాకుండా ఒప్పందంలో లాభనష్టాలు, జరిగిన మేలు వంటివి పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలి తప్ప, కేవలం జగన్ ఒప్పందం కుదు ర్చుకున్నాడన్న కక్షతో అమెరికాలో ఎవరో ఆరోపణలు చేసారన్న నెపంతో దీనిపై చర్యలు తీసుకునేముందు వెనకాముందూ ఆలోచించుకోవడం ఏపీ ప్రభుత్వానికి చాలా అవసరం.
బూమరాంగ్ అవుగున్న రాజకీయ ఎత్తులు
గతంలో లడ్డూమీద రాజకీయం చేయడం బూమరాంగ్ అవడమే కాకుండా, పవన్ కళ్యాణ్‌కు నేడు జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకోవడానికి దారితీసింది. అదేవిధంగా ఓటమితో నైరా శ్యంలో కుంగిపోయిన జగన్‌ను ఇటువంటి చర్యలతో చంద్రబాబు బలోపేతం చేస్తున్నారు. అంటేఆయన జగన్‌ను దెబ్బతీయాలనుకొని ఒక పనిచేస్తే పూర్తిగా అందుకు విరుద్ధంగా జరుగుతోంది.అధికారంలో వున్నప్పుడు లేదా మరెప్పుడైనా జగన్ పెద్దగా ప్రెస్‌మీట్లు పెట్టరు. కానీ ఇప్పుడు వస్తున్న ఆరోపణలు, తెలుగుదేశం అనుకూల మీడియా చేస్తున్న రాద్ధాంతం నేపథ్యంలో ఆయన తన కోణాన్ని ఆవిష్కరించడానికి తరచుగా మీడియా సమావేశాలు పెట్టి వివరిస్తున్నారు. ఆదానీ విషయంలో కూడా ఆయన ఇస్తున్న గణాంక వివరణలు ఆసక్తికరంగా వుంటున్నాయి. ‘‘చంద్రబా బు హయాంలో యూనిట్‌కు రూ.3.41కి కొనుగోలు చేయాల్సి రాగా, 2021 సెప్టెంబర్ 15న సెకీ కేవలం యూనిట్‌కు రూ.2.49లకే 9వేల మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తామని చెప్పింది. అదే చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల రూ.2వేల కోట్లు అదనపు భారంపడిరది. ఇంత తక్కువ ఖరీదుకు విద్యుత్ సరఫరా ఎప్పుడూ జరగలేదు. దీనిపై వక్రీకరణలేంటి?’’ అని వేస్తున్న ప్రశ్నలకు ఏ ఒక్కరూ సమాధానం ఇవ్వడంలేదు. ఆదానీ ఒప్పందం రాష్ట్రానికి నష్టం అని మా త్రమే ఊకదంపుడు వార్తలు వస్తున్నాయి. తప్పుడు వార్తలు రాసే మీడియా సంస్థలపై రూ.వంద కోట్ల పరువునష్టం దావా వేస్తానని జగన్ హెచ్చరిస్తున్నారు.
ప్రజాప్రయోజనాలపై రాజీవద్దు
రాజకీయాల్లో పరస్పరం విమర్శించుకోవడం, వ్యతిరేకించడం సహజం. కానీ ప్రజలకు ఉపయోగపడే అంశాలు, వారి ప్రయోజనాలకు సంబంధించిన విషయాలో ఎవరు అధికారంలో వున్నా సంయమనం పాటించడం చాలా అవసరం. ఆదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇష్టారాజ్యంగా మీడియాలో వచ్చిన వార్తలవల్ల నష్టపోయింది షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన సామాన్యులు. అదేవిధంగా జగన్ వాదన ప్రకారం రాష్ట్రానికి ఆదానీపవర్‌తో కుదుర్చుకున్న ఒ ప్పందం వల్ల లాభమే కాని నష్టం జరగలేదు కదా! దీనిపై ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒకవేళ గత ప్రభుత్వం తప్పుచేసిందని తేలితే చర్యలు తీసుకోవచ్చు. అనవసర ప్రచారాలు అనర్థహేతువులు. ఎందుకంటే గతంలో కూడా ఆదానీని దెబ్బతీయడానికి డీప్‌స్టేట్ ప్రయత్నించి చేతులు కాల్చుకున్న సంగతి ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.
జగన్‌ను యాక్టివ్ చేస్తున్న బాబు
నిజం చెప్పాలంటే నిస్తేజంగా వున్న జగన్‌ను మరింత చురుగ్గా, ప్రజల్లోకి వచ్చేవిధంగా చేస్తున్న ది తెలుగుదేశం ప్రభుత్వమే. రాజకీయ కక్షలతో జగన్ అనుకూలురు అనుకున్న వారిని ఎవ్వరినీవదిలిపెట్టడంలేదు. వారు ఐఏఎస్, ఐపీఎస్ అధికార్లు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. ఇవన్నీ కాలం చెల్లిన విధానాలు. ఎందుకంటే ఎంత ఓటమి పాలైన జగన్ పార్టీకి 40శాతం ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదన్నది అక్షరసత్యం. ఏమాత్రం లెక్కతప్పినా జగన్ మళ్లీ తన స్థానాన్ని పదిలం చేసుకోగలడు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి కావలసింది, ప్రత్యర్థులపై కక్షసాధింపు చర్యలు లేదా అనుకూల ప్రచారం కాదు, తాము ప్రజలకు మేలు చేయడానికి నిబద్ధతతో పనిచేస్తున్నామని నమ్మకం కలిగించడం. దురదృష్టవశాత్తు ఇప్పటివరకు అటువంటిది లేకపోగా కక్షసాధింపు అనే సుడిగుండంలో చంద్రబాబు చిక్కుకున్నారు.
ఆసరాగా మారిన పవన్ కళ్యాణ్
తెలుగుదేశం అధినేత బహుశా గుర్తించారో లేదో తెలియదు కానీ, రాజకీయ అవసరాల నేపథ్యంలో దగ్గరకు తీసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దేశరాజకీయాలు నడిపే స్థాయికి చేరుకున్నారు. ఇందులో చంద్రబాబు పాత్రకూడా లేకపోలేదు. రానున్న కాలంలో జనసేన అధినేత తాను చెప్పిన విధంగా కాకుండా, ఆయన చెప్పినవిధంగా తాను నడుచుకునే పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. లడ్డూ వివాదంలో సనాతనధర్మం వైపు నిలిచిన పవన్‌కళ్యాణ్ ఇప్పుడు మహారా ష్ట్రలో తాను ప్రచారం చేసిన ప్రాంతాల్లో వందశాతం స్ట్రైక్ రేట్ సాధించి ఒక్కసారి ‘నేషనల్ స్టార్’గా ఎదిగిపోయారు. గతంలో ఉన్న ఆవేశం ఇప్పుడు ఆయనలో కనిపించడంలేదు. మీడియా స మావేశాల్లో కూడా ఆయన ఇచ్చే సమాధానాలు ఎంతో పరిణితితో వుంటున్నాయి. చంద్రబాబు రాజకీయం, జగన్‌ను మరింత తొక్కేయాలన్న రీతిలో సాగుతుంటే, పవన్ రాజకీయ ప్రస్థానం పౖెెపైకి దూసుకెళుతోంది. ఇప్పుడు బి.జె.పి. పెద్దలకు ఆంధ్రలో ఒక నాయకుడు దొరికాడు. సరైన శిక్షణతో పవన్‌ను ముందుకు నిలబెడుతున్నారు. దీన్ని గుర్తించినా చంద్రబాబు చేసేదేం లేదు. పవన్ ఇప్పుడు తాజాగా ఢల్లీిలో ఆరుగురు మంత్రులను కలిసి ప్రజాసమస్యలపైనే మాట్లాడినట్టు మీడియాలో వచ్చిన వార్తలు తెలుపుతున్నాయి. తన అన్న నాగబాబుకు రాజ్యసభ టిక్కెట్ కావాలని అడిగినట్టు ఎక్కడా బయటపడలేదు. ఢల్లీి పెద్దలు పిలిచారు కాబట్టి, పవన్‌కళ్యాణ్‌కు ఈ ప్రస్తావన తెచ్చే అవకాశం దొరికి వుండవచ్చు లేదా లేకపోవచ్చు. మీడియాలో రకరకాల వార్తలు రావడం సహజం. ఒక్కసీటు వచ్చినందువల్ల ఒరిగేది కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పద వికి తనను తాను ఒక గట్టి పోటీదారుగా నిరూపించుకోవడం పవన్‌కళ్యాణ్‌కు అత్యంత ముఖ్యం. తగిన అనుభవం సంపాదించుకోవాలన్న ఆయన అభిప్రాయం పరిణితిని చూపుతోంది. రాజకీయాల్లో దూసుకుపోయేవారి వ్యవహారశైలి ప్రజలకు ఇట్టే తెలిసిపోతుంది. ప్రజాదరణ వున్న నాయకుడికి ప్రత్యర్థితో పనిలేదు. ఎట్లా అంటే…బలవంతుడితో పోరాడవచ్చు కానీ అదృష్టవంతుడితో కష్టం. అదేవిధంగా రాజకీయాల్లో ప్రజాభిమానం కలిగిన వారితో పోరాటం కష్టం. గుంట చిక్కుల రాజకీయాలు అక్కడ పనికిరావు. అయితే ఇక్కడ ప్రజాభిమానం ఒక్కటే కాదు, రాజకీయంకూడా తెలియాలి. లేకపోతే నష్టపోక తప్పదు. ఇందుకు ఉదాహరణ ఎన్టీఆర్. అందుకు తగిన రాజకీయ శిక్షణ బీజేపీ పెద్దలు పవన్‌కు ఎట్లాగూ ఇస్తారు…ఇస్తున్నారు కూడా. దన్నుగా నిలుస్తు న్నారు కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అండలేకుండా చంద్రబాబు పాలన కష్టమే. ఢల్లీి పెద్దలు చంద్రబాబును విశ్వసించరు. కేవలం పవన్ కళ్యాణ్ ద్వారానే పనులు చక్కబెడతారు. ఇప్పుడు బాబు రాజకీయానికి పవన్ కళ్యాణ్ ఒక ‘ఆసరా కర్ర’గా మారారు. దీన్ని గుర్తించి చంద్రబాబు ఇప్పటికైనా ప్రచారం వదిలేసి పనులపై దృష్టిపెట్టాలి. ఇదే ఆయనకు, ఆయన పార్టీకి శ్రేయస్క రం. లేకపోతే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో జగన్, పవన్‌కళ్యాణ్ మధ్యమాత్రమే ప్రధాన రాజకీ యం నడవడం తథ్యం.
మండల కేంద్రంలో నిర్వహిస్తున్న తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికుల టోకెన్ సమ్మె రెండవ రోజు జరిగిన సభలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాసరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేస్తానని మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేస్తానని కనీస వేతనాలు అమలు చేస్తానని గ్రామపంచాయతీ కార్మికులకు ఎన్నికల ముందు హామీ ఇచ్చారని సంవత్సరం కవస్తున్న అమలు చేయకపోగా రావలసిన జీతాలు నెలనెలా ఇవ్వకపోగా నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడం దుర్మార్గమని అన్నారు నెలల తరబడి కార్మికులకు జీతాలు రాక కుటుంబాన్ని నడపలేక అప్పుల భారం తో కార్మికులు ఆందోళన చెందుతున్నారని అన్నారు గ్రామాలను గ్రామ ప్రజలను పరిశుభ్రంగా ఆరోగ్యకరంగా ఉంచుతూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్న గ్రామపంచాయతీ కార్మికులను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదని విమర్శించారు కొవిడ్ కాలం లో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కోవిడ్ తో చనిపోయిన వారిని కుటుంబం ముట్టుకోకపోయినా గ్రామపంచాయతీ కార్మికులు ప్రాణాలను అడ్డుపెట్టి దాహన సంస్కారాలు చేసిన చరిత్ర కార్మికులకు ఉందని అట్లాంటి కార్మికులను వారి శ్రమను గుర్తించకపోవడం వారికి వేతనాలు పెంచకపోవడం సరికాదని అన్నారు ఇప్పటికే పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలని అధికారులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను ఏ ఒక్కటి పరిష్కారం చేయలేదని అన్నారు. అందుకే గ్రామపంచాయతీ కార్మికులు టోకెన్ సమ్మె చేయడం జరుగుతుందని ఈ సమ్మె చేయడానికి కారణం ఈ ప్రభుత్వమేనని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని అందరినీ పర్మినెంట్ చేయాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని గ్రామపంచాయతీలకు ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలని కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్స్ పరిష్కారం చేయకుంటే రానున్న కాలంలో నిరవదిక సమ్మె కైనా సిద్ధమవుతామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కొమరం కాంతారావు గ్రామపంచాయతీ కార్మికులు గుమ్మడవెల్లి కృష్ణ, ఉప్పలి సాంబశివరావు, ధనుంజయ్, కల్లూరి రమేష్, సాంబశివరావు, ప్రశాంత్, శంకర్, వీరస్వామి, సురేష్, నరసింహారావు, తిరుపతి, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
కాకతీయ యూనివర్సిటీ లో బీపీడీ మరియు ఎంపీడీ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు ఇబ్బంది పడుతున్న వైనం వెలుగు చూసింది. గత పది సంవత్సరాలుగా నాన్ బోర్డర్స్ గా ఉంటూ అందులోనే మద్యం సేవిస్తూ,మిగతా విద్యార్థులను కూడా మద్యానికి బానిసలుగా మారుస్తున్నారు. ఇది ఏమిటని ప్రశ్నిస్తే నేను లోకల్ అని ఎదిరించటం అలవాటుగా మారింది. విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్న వారిని త్వరగా బయటకు పంపాల్సిందిగా కోరుకోవడం జరిగింది. ఇట్టి విషయం అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కూడా అధికారులు పట్టించుకోకపోవడం చాలా దారుణంగా భావిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోతే ముందు ముందు చాలా నష్ట పరిణామాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.