జమ్మికుంట: నేటి ధాత్రి
స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట బాలికల ఉన్నత పాఠశాలలో స్వచ్ఛతపై మానవహారంతో పాటు, తడి చెత్త,పొడి చెత్త సేకరణ పై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మునిసిపల్ అధికారి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛత లో భాగస్వాములు కావాలని మరియు మీ కుటుంబ సభ్యులతో కలిసి మన ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకుంటే అనారోగ్యాల భారిన పడకుండా రక్షించుకోవచ్చు అన్నారు. తడి చెత్త మరియు పొడి చెత్త పై మీ తల్లి దండ్రులకి అవగాహన తీసుకురావాలని మరియు స్కూల్ ఆవరణంలో చెత్త వేయకుండా డస్ట్ బిన్ డబ్బాలో వెయ్యాలని తగు సూచనలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు తదితరులు పాల్గొన్నారు.