జమ్మికుంట: నేటి ధాత్రి
సికింద్రాబాద్ హరిహర కళాభవన్ లో ఈనెల 27న జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆత్మీయ సమ్మేళనానికి ప్రతి ఒక్కరు హాజరు కావాలన్నా తెలంగాణ ఉద్యమకారులు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఇల్లందకుంట మండల కేంద్రంలోని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు రావుల రాజబాబు ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కరీంనగర్ పార్లమెంటరీ కన్వీనర్ ఎక్కడి సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ: ఈనెల 27వ తేదీన సికింద్రాబాద్లోని హరిహర భవన్లో ఏర్పాటుచేసిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ హాజరు కానున్నారు .తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు ప్రతి ఒక్కరూ హాజరుకావాలని అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తుందని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు 250 గజాల భూమిని ఇవ్వాలని, ఉద్యమకారున్ని గుర్తించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల కొరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఉద్యమకారులకు ఐడి కార్డును అందజేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రావుల రాజబాబు, పిఎసిఎస్ వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి, మాజీ ఎంపిటిసి పెద్ది కుమార్, రావుల ఎల్లయ్య, సారయ్య ,చంద్రమౌళి, గడ్డి రాములు, వీరన్న, ముండయ్య, రాజయ్య, తో పాటు తదితరులు పాల్గొన్నారు.