నడికూడ,నేటిధాత్రి:
భూమికోసం,భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యెదురాలు ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 129 వ జయంతి సందర్భంగా నడికూడ మండల కేంద్రంలో రజక సంఘo ఆధ్వర్యంలో రజక కమిటీ హల్ నందు ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రజక సంఘాల సమితి రాష్ట్ర కో కన్వీనర్ దురిశెట్టి చంద్రమౌళి(చందు)రజక సంఘం గ్రామ అధ్యక్షులు దురిశెట్టి రాజయ్య, ఉపాధ్యక్షుల గొల్లపెళ్లి మహేందర్,కోశాధికారి పోచనపల్లి వెంకటేష్,గౌరవ అధ్యక్షులు వైనాల సారయ్య, ఉప్పుల సాయిలు, నాయకులు కుడ్ల మలహల్ రావు,గోనెల శరత్,తాళ్ళ నవీన్,రజక సంఘo నాయకులు రవి, చంద్రమౌళి,సంపత్,సంతోష్, కుమారస్వామి,ఐలయ్య, వీరస్వామి,సంపత్,శ్రీకాంత్, శ్రీనివాస్,లక్ష్మి,కిరణ్,సంతోష్,చంద్రశేఖర్,రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.