సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ కి వినతిపత్రం అందించిన ఎస్ఎఫ్ఐ నాయకులు
పరకాల నేటిధాత్రి
విద్యార్థులకు అవసరమైన కులం,ఆదాయం,నివాసం, గ్యాప్ సర్టిఫికెట్ల కోసం పరకాల మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే,తహసిల్దార్ కార్యాలయం నుంచి వాటిని పరిశీలించి సకాలంలో జారీ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పరకాల రెవెన్యూ అధికారి (ఆర్డీవో)డాక్టర్ కె. నారాయణకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు మడికొండ ప్రశాంత్ మాట్లాడుతూ పరకాల ఎమ్మార్వో,కార్యాలయ సిబ్బంది వివిధ సర్టిఫికెట్లు గురించి అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు సకాలంలో సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అడిగితే సారు సెలవులో ఉన్నడని రాలేదని ఇన్చార్జి సారు లేడా అని అడిగితే ఎంక్వైరీ గురించి బయటకు వెళ్ళాడని కోపంగా దురుసుగా సమాధానం ఇస్తున్నారని రోజుల తరబడి ఆఫీసు చుట్టు తిప్పించు కుంటున్నారని ఆఫీసులో ఎవరు ఏ హోదాలో పనిచేస్తున్నరో తెలిపే నేమ్ బోర్డ్స్ కూడా లేవుని ఎప్పుడు చూసినా యేదో పనిచేసినట్లు హడావుడి చేస్తున్నారు.కానీ సర్టిఫికెట్లు మాత్రం సకాలంలో ఇవ్వడం లేదని కావున బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న బాధ్యులైన ఎమ్మార్వో ఆఫీసు సిబ్బంది పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ హేమంత్,నాయకులు సాయి తేజ,యశ్వంత్,అన్వేష్, అఖిల్,రాకేష్ లు పాల్గొన్నారు.