తన నీడను తానే నమ్మడు!

-కేసిఆర్‌ విచిత్ర వైఖరి!

-తనను తానే నమ్ముకోలేడు!

-చెప్పుడు మాటలకు మాత్రం విలువిస్తాడు.

-తనను నమ్మిన వారిని కూడా నమ్మడు.

-అనుమానం అనే వైఫై మధ్యలో నలుగుతుంటాడు.

-కేటిఆర్‌ను సిఎం చేయడానికి ఇష్టపడలేదు.

-కాబోయే ముఖ్యమంత్రి కేటిఆర్‌ అంటే తట్టుకోలేకపోయావు.

-ఎవ్వరికీ న్యాయం చేయలేక చతికిలపడ్డావు.

-నాయకులంతా ఒత్తిడి చేసినా పదవి వదులుకోలేదు.

-పదవీ వ్యామోహం ఇంకా తగ్గలేదు.

-కేటిఆర్‌…హరీష్‌ రావుల మధ్య అగాధానికి కారణం కేసిఆరే!

-కవిత, కేటిఆర్‌ల మధ్య వైరానికి మూలం కేసిఆరే.

-సంతోష్‌ మాటలు నమ్మి ముగ్గురినీ కలవకుండా చేసింది కేసిఆరే.

-తెలంగాణ రాజకీయాలలో వెలగాల్సిన కవిత భవిష్యత్తు చెడగొట్టింది కేసిఆరే.

-ఉద్యమకారులను పక్కనపెట్టిన నాడే పార్టీ పతనం మొదలైంది.

-ఉద్యమ పార్టీ కాదన్న నాడే ఉద్యమ మూలాలు మాయమయ్యాయి.

-ఎల్లకాలం నావల్లే తెలంగాణ వచ్చిందని చెప్పుకోవడమే కొంప ముంచింది.

-ఇంకా నేనే పార్టీ… పార్టీ అంటే నేనే అని చెప్పుకుంటే వచ్చేదేమీ లేదు.

-కేటిఆర్‌, హరీష్‌, కవితల మధ్య కలతలు లేకుండా చూసుకోండి.

-ప్రజలు ఓడిరచి తప్పు చేశారన్న భ్రమల నుంచి బైటకు రండి.

-ఫామ్‌ హౌస్‌ దాటి రాననుకుంటే పూర్తి స్వేచ్ఛ కేటిఆర్‌కు ఇవ్వండి.

-పార్టీకి పెద్ద దిక్కు పాత్రలో ఒదిగిపోండి.

-అధికారంలో ఉన్ననాడు పార్టీ పదవులు పంచలేదు.

-నామినేటెడ్‌ పదవులు ఇవ్వక నాయకులకు గుర్తింపు ఇవ్వలేదు.

-రేవంత్‌ రెడ్డి ట్రాప్‌లో పడి సిట్టింగ్‌లకు టిక్కెట్లు ఇచ్చారు.

-గొప్పలకు పోయి పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టారు.

-భూములు మింగిన వారిని నెత్తిన పెట్టుకున్నావు.

-అవకాశ వాదులను అక్కున చేర్చుకున్నావు.

-పార్టీ పరువు గంగపాలు చేసిన వారికి పెత్తనమిచ్చారు.

-ఉద్యమ కారులను దూరం పెట్టి మొదటికే మోసం తెచ్చుకున్నారు.

-ముప్పై మంది ఎమ్మెల్యేలను మార్చమని ఎంత మంది చెప్పినా పెడచెవిన పెట్టావు.

-ఓడిపోయి ఇంత కాలం సంపాదించుకున్న కీర్తిని పోగొట్టుకున్నావు.

-తెలంగాణ పత్రికలను కాదనుకున్నావు.

-తెలంగాణ జర్నలిస్టులను దూరం కొట్టుకున్నావు.

-ఆంద్రా మీడియా కొమ్ము కాశావు.

-విశ్వాసం లేని ఆంద్రా మీడియా ముందు తెలంగాణ మీడియా పరువు తీశావు.

-తెలంగాణ వ్యతిరేక మీడియాకు దోచిపెట్టావు.

-ఉద్యమాన్ని మోసిన తెలంగాణ మీడియాను చంపేశావు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఇటీవల బిఆర్‌ఎస్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ తన నీడను తానే నమ్మడూ అంటే ఇంతా కాలం ఆయనతో సఖ్యతతో వున్న వారు కూడా కేసిఆర్‌ గురించి నిజాలు వెల్లడిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి చర్చలు కూడా అనేకం జరిగేవి. కాని అప్పుడు ఉద్యమ కాలం. కేసిఆర్‌ మీద ఎవరు ఏం చెప్పినా ఎవరూ పట్టించుకునేవారు కాదు. పైగా ఉద్యమ సమయంలో కేసిఆర్‌ వారికి ప్రధాన్యతనివ్వడం లేదన్న అక్కసుతో కేసిఆర్‌పై రకరకాల ప్రచారాలు సాగిస్తున్నారని అంటుండేవారు. కాని ఇటీవల మాత్రం అంతకన్నా మించిన ఆసక్తికరమైన చర్చలో నిత్యం ఎక్కడో అక్కడ జరుగుతున్నాయి. ఒక రకంగా కేసిఆర్‌ది టిపికల్‌ క్యారెక్టర్‌ అంటున్నారు. తనను తానే నమ్ముకోడని కూడా చెబుతున్నారు. సహజంగా ప్రతీ వ్యక్తికి ఏదో ఒక బలహీనత వుంటుందని అందుకు కేసిఆర్‌ కూడా అతీతుడు కాదు. ఉన్నత స్దానానికి చేరుకున్న నాయకులంతా చాలా మేధావులు అనుకుంటాం. కాని వాళ్లలో వుండే బలహీనతలు ఇతరుల వద్ద వుండవు. కేసిఆర్‌కు ఎవరైనా తనకు తెలిసిన విషయాన్ని చెప్పినా పట్టించుకోరు. కేసిఆర్‌కు తెలియని విషయాన్ని గురించి చెప్పినా పెద్దగా స్పందించరు. కాని ఎవరిపైన అయినా లేనిపోనివి చెబుతుంటే మాత్రం ఎంతో ఆసక్తిగా వింటారని అంటారు. ఈ బలహీనతను ఆసరా చేసుకొని సంతోష్‌రావు కేసిఆర్‌ను ఆడిరచాడని అంటుంటారు. నిజానికి కేసిఆర్‌ మనసులో ఎలాంటి దురుద్దేశం వుండదు. ఎవరినీ నిందించాలోనో, ఇబ్బందులకు గురిచేయాలనో అనుకోరు. కాని పక్కనే వుండేవాళ్లు చెప్పే విషయాల్లో లేనిపోనివి వుంటుంటాయి. అవి ఆసక్తిగా వినిపిస్తాయి. ఇలా చెప్పుడు మాటలు వినడం అలవాటు వున్న నాయకులు తమ నిర్ణయం అమలు చేయడంలో జాప్యం చేస్తారు. చెప్పుడు మాటలు చెప్పిన వారి మాటలనే ఆచరిస్తారని అంటుంటారు. కేసిఆర్‌ను ఎంతో నమ్మకంగా ఆరాధించేవారిని ఆప్యాయంగా పలకరిస్తారు. కాని ఒక్కసారి కేసిఆర్‌కు ఎవరైనా దగ్గరౌతున్నారని తెలిసిన వెంటనే అవతలి వ్యక్తి గురించి చెడుగా చెప్పి, కేసిఆర్‌ మనసులో లేనిపోని ఆలోచనలు తెప్పిస్తారు. అయితే పక్కన వున్న వాళ్లు చెప్పేది నిజమా? కాదా? అన్నదానిపై కేసిఆర్‌ ఎప్పుడూ లోతుగా ఆలోచించకపోవడం మూలంగానే పార్టీకి ఈ పరిస్ధితి వచ్చిందంటున్నారు. అందుకు బాధితులైన వారిలో ఇతర నాయకులే కాదు, సాక్ష్యాత్తు కేటిఆర్‌, హరీష్‌రావు, కవితలు కూడా వున్నారని అంటున్నాడు. కేసిఆర్‌ కేవలం సంతోష్‌రావు చెప్పినమాటలు తప్ప మరెవరూ చెప్పిన మాట వినరన్న అపవాదు వుంది. దానికి తోడు కేసిఆర్‌ కీడెంచి మేలెంచు అన్న నానుడిని ఎక్కువగా పాటిస్తారు. అది అతి జరిగి, ప్రతీదానిని ముందు అనుమానంగానే చూస్తారని అంటుంటారు. ఏ విషయంపైన అయినా సరే ఒక్కసారికే ఓకే అనే మనస్తత్వం కేసిఆర్‌ది కాదు. ప్రతి విషయాన్ని పది సార్లు తనలో తానుగాని, కోటరీలో వుండేవారితోగాని చర్చించని తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. కాని ఆ నిర్ణయం కేసిఆరే తీసుకున్నాడన్న అపవాదును మోస్తుంటారు. కేసిఆర్‌ ఎప్పుడూ అనుమానం అనే వైఫై మధ్యలో నలుగుతుంటారంటారు. ఇతరులకు ఎంతో నమ్మకాన్ని కలిగించేలా మాట్లాడే కేసిఆర్‌ మాత్రం ప్రతీ విషయాన్ని దాట వేయడానికో, సాగదీయడానికో మాత్రమే ఆలోచిస్తాడని అంటారు. ఇది సాక్ష్యాత్తు కేటిఆర్‌కు కూడా అనుభవమైంది. 2021 తర్వాత ఒక దశలో కేటిఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఎక్కడికెళ్లినా కేటిఆర్‌కు ప్రజలు, పార్టీ నాయకులు బ్రహ్మరధం పడుతున్నారు. తోటి మంత్రులు కూడా కాబోయే ముఖ్యమంత్రి అంటూ కేటిఆర్‌కు కీర్తిస్తున్నారు. అప్పటికే కేటిఆర్‌ డిఫాక్టో సిఎం.షాడో సిఎం అంటూ మీడియా ప్రచారం సాగిస్తూనే వుంది. సహజంగా ముఖ్యమంత్రి వారసుడైన కేటిఆర్‌కే పదవిని అలంకరించే అవకాశాలు మెండుగా వుంటాయ. ఓ వైపు తెలంగాణలో ప్రజల్లోనూ పార్టీలోనూ, అన్ని ప్రధానమైన మీడియా స్రవంతిలోనూ, యూట్యూబ్‌లలో పెద్దఎత్తున ప్రచారం సాగింది. ఇదే సమయంలో ఓరోజు తెలంగాణ భవన్‌లో ఎవరూ కేటిఆర్‌ను సిఎం అంటూ నినాదాలు చేయొద్దు. కాళ్లు విరగ్గొడతా? అంటూ కేసిఆర్‌ కీలక వ్యాఖ్యలు చేసి, కేటిఆర్‌ పరువు తీసేశారు. నిజానికి ఏ తండ్రీ అలా అంటారని ఎవరూ ఊహించలేదు. తన తర్వాత రాజకీయ వారసుడుగా కేటిఆర్‌కే ఆ పదవి అన్న ఆలోచన ప్రతి నాయకుడి మదిలో వుండేదే. అలాంటప్పుడు కేసిఆర్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా పార్టీపై తీవ్ర ప్రభావం పడిరది. ఇదే సమయంలో కేసిఆర్‌కు అత్యంత సన్నిహితులుగా మెలిగిన వారు నోళ్లు తెరిచారు. కేసిఆర్‌కు పదవీ వ్యామోహం ఎక్కువ. ఆయన పదవి కోసం ఎవరినీ లెక్క చేయరు. సొంత కొడుకైనా సరే పదవి ఇవ్వరు. రకరకాల చర్చలు జోరుగా సాగాయి. ఆ సమయంలో కేటిఆర్‌ కూడా కొంత అసంతృప్తిగా వున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆనాడే కేటిఆర్‌ను ముఖ్యమంత్రి చేసి వుంటే పార్టీ పరిస్దితి మరో రకంగా వుండేదని ఆనాడే ఎంతో మంది చెప్పారు. నేటి దాత్రి కూడా అనేక కధనాలు రాసింది. ఎప్పుడో ప్రధాని కావాల్సిన రాహుల్‌ గాందీని కాకుండా చేసి, ఇప్పటి వరకు రాహుల్‌కు అవకాశం రాకుండా పోవడానికి సోనియాగాంధీ కారణమయ్యారు. సరిగ్గా కేటిఆర్‌ విషయంలోనూ కేసిఆర్‌ అదే అనుసరిస్తున్నారని నేటిధాత్రి అనేక సార్లు హెచ్చరించింది. ఎవరైనా సరే దీపమున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకుంటారు. కాని కేసిఆర్‌ అందుకు భిన్నంగా వ్యవహరించారు. ఆ సమయంలో కేటిఆర్‌ను ముఖ్యమంత్రి చేయడాన్ని ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అసంతృప్తి ఏ ఒక్కరూ వ్యక్తం చేయలేదు. అప్పటికే పార్టీలో వున్న ఈటెల రాజేందర్‌ లాంటి వారు కూడా ప్రాంతీయ పార్టీ పరిస్ధితులు మాకు తెలియంది కాదు..అని కూడాచెప్పారు. హరీష్‌రావు కూడా తనకు అభ్యంతరం ఎందుకుంటుంది అనే అన్నారు. అంత మంది కేటిఆర్‌ గురించి సానుకూలంగా మాట్లాడినా, ఏదో కొంపలు మునిగిపోతాయి? పార్టీ ఆగమౌతుంది. ప్రభుత్వం అస్ధిరమైపోతుంది? అన్న ఆపోహలు పెంచుకున్నాడు. ఇప్పుడేమైంది. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎల్ల కాలం నేనే వుంటా? అన్న భ్రమల్లో కేసిఆర్‌ వుండేవారు. తనకు మించిన పాలనా దక్షుడు ఎవరూ లేరని అనుకునేవారు. ఇదిలా వుంటే పార్టీలో కేటిఆర్‌, హరీష్‌రావు, కవిత మధ్య నిత్యం ఏదో దూరం, వైరం అంటూ వార్తలు వచ్చేవి. అప్పట్లో వాటిని కొట్టిపారేసినా, అవి నిజాలే అన్న సంగతి అందరికీ తెలుసు. అందుకు కారణం కూడా కేసిఆరే అని కూడా అందరికీ తెలిసిందే. అయినా పార్టీ అధికారంలో వుండడం వల్ల మాకెందుకు అని ఊరుకున్నారు. ఇప్పుడు కేసిఆర్‌ వ్యవహార శైలిని గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఎప్పుడైతే కేసిఆర్‌ ఉద్యమకారులను పక్కన పెట్టారో అప్పుడే పార్టీ పతనం మొదలైంది. తమని ఉద్యమ పార్టీ కాదని చెప్పిన తర్వాత పదే పదే తెలంగాణ తెచ్చింది నేనే…అంటూ పదేళ్లు చెప్పడాన్ని కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రమొక్కటే సర్వరోగ నివారిణి కాదు. తెలంగాణ తెచ్చుకున్నది కేవలం కేసిఆర్‌ పాలన కోసమే కాదు? కేసిఆర్‌ ఎవరిని కూర్చోమంటే వారు కూర్చోవాలి. ఎవరు నిల్చోవాలంటే నిల్చోవడానికి కాదు? తెలంగాణ సమాజంలో అనేక మార్పులు కావాలి. తెలంగాణ సేచ్ఛ కావాలి. తెలంగాణ అభివృద్ది జరగాలి. తెలంగాణ అన్ని రంగాలలో పరుగులందరుకోవాలి. తెలంగాణ యువతకు ఉపాధి కలగాలి. కాని పదేళ్ల కాలంలో నిత్యం రాజకీయాలే..నీళ్లపేరు చెప్పి రాజకీయం చేయాలి. నీళ్లు చూపించి ఓట్లు దండుకోవాలి. చెరువులు, ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కరంటు అంటూ కేసిఆర్‌ చెప్పిన మాటలు ప్రజలు బాగానే వుందనుకున్నారు. కాని ఒకదశ కొచ్చేసరికి కేసిఆర్‌ కుటుంబం మీద వస్తున్న విపరీతమైన ఆరోపణలు ప్రజలను ఆలోచనల్లో పడేశాయి. దానికి తోడు ఎమ్మెల్యేల విచ్చలవిడితనం మూలంగా పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్ధితులు ఎదురయ్యాయి. ఇకపోతే 2003 ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్ధులను మార్చాలని అందరూ సూచించారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాలు చేశారు. దాంతో కేసిఆర్‌ ఎవరినీ మార్చకుండా ఒకే సమయంలో అభ్యర్ధులను ప్రకటించి బోల్తా పడ్డారు. 2018లో గెలిచినట్లే మళ్లీ గెలుస్తామన్న భ్రమలో వున్నారు. కనీసం మ్యానిఫెస్టోను కూడా సరిగ్గా రూపొందించుకోలేదు. నాలుగు పేపర్లు పట్టుకొని వచ్చి నాలుగు ముక్కలు చెప్పి వెళ్లిపోయారు. ప్రజాస్వామ్యంలో నాయకుడికి ప్రజలంటే భయం వుండాలి. ప్రజలంటే గౌరవం వుండాలి. ప్రజా సేవకుడిని అన్న సోయి వుండాలి. ఇవి కుర్చీలో కూర్చున్నప్పుడు మాయమైపోతాయి. పైగా రెండు సార్లు గెలిచిన తర్వాత కేసిఆర్‌లో మరింత అహం పెరిగిందని అంటుంటారు. ఏదైనా సరే తాను చెప్పిందే ఫైనల్‌ అనుకొని భస్మాసుర హస్తం నెత్తిన పెట్టుకున్నట్లు చేశాడు. తెలంగాణ ఉద్యమ కారులకు ఓ దారి చూపలేదు. తెలంగాణ నాయకులను అక్కున చేర్చుకోలేదు. అవకాశవాదులను అందలమెక్కించాడు. ఇలా ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ బోల్తా కొట్టాయి. 2023 ఎన్నికల్లో కేసిఆర్‌ ఫెయిల్యూర్‌ లీడర్‌ అనే దశకు తెచ్చాయి. తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడిన సీమాంధ్ర మీడియాను నెత్తిన పెట్టుకొని ఊరేగాడు. తెలంగాణ మీడియాను కనీసం పట్టించకోలేదు. తెలంగాణ జర్నలిస్టులను లెక్క చేయేలేదు. మీడియా సంస్ధలు మన చేతిలో వుంటే వార్తలు ఇష్టం వచ్చినట్లు రాయించుకోవచ్చనుకున్నాడు. కాని కేసిఆర్‌ ఎంత ఎదురుచూసినా సీమాంద్ర మీడియా భజన చేయలేదు. అడుగడుగునా దబ్బనంతో గుచ్చుతూనే వున్నా కేసిఆర్‌ కనుక్కొలేకపోయాడు. నిండా మునిగిన తర్వాత గాని తెలంగాణ మీడియా ప్రభావం కనిపించలేదు. ఉద్యమ కాలం నాటి తెలంగాణ మీడియా త్యాగాలును గుర్తించేలేదు. ప్రభుత్వ పాలన, అభివృద్ధి, సంక్షేమం మీది నిత్యం వార్తలు రాసిన మీడియాను దూరం పెట్టుకున్నాడు. ఎత్తిపొడిచే వార్తలు రాసిన వారిని అలుముకున్నాడు. దృతరాష్ట్రుడి లాంటి సీమాంధ్ర మీడియా కౌగిలిలో నలిగిపోయాడు. పదవిపోగొట్టుకున్నాడు. పాలన పోగొట్టుకున్నాడు. రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట ఓడిపోయాడు. పార్టీ నాయకులకు పదవులు ఇవ్వలేదు. ప్రభుత్వంలో వున్న నామినేటేడ్‌ పోస్టులు కట్టబెట్టలేదు. నాయకులెవరినీ చేరదీయలేదు. ఫామ్‌ హౌజ్‌ నుంచి బైటకు రాలేదు. ఓడిస్తే ఇంట్లో వుంటానని చెప్పినా, ఓడిన ఏ నాయకుడు ఇంటికి పరిమితం కాదు. నా ప్రజలెక్కడా అని వస్తారు. నన్ను ఓడిరచిన ప్రజలు బాధపడి విసిగి వేసారిపోయి ఎక్కడున్నావు కేసిఆర్‌ అని పిలిస్తే అప్పుడు వస్తానన్నట్లు కేసిఆర్‌ వుంటున్నాడని ఆయనతో సన్నిహితంగా వున్నవారే అంటున్నారు. ఇప్పటికీ ఆయన ఎవరిని కలవాలన్నా, ఎప్పుడు కలవాలన్నా సరైన సమాధానం చెప్పేవారు లేకుండాపోయిందని తిట్టుకుంటున్నారు. అందుకే పార్టీ పరిస్దితి ఇంతదూరం వచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా మిగిలింది. అయినా కేసిఆర్‌ మారుతాడని అనుకోవడానికి ఎవరూ సిద్దంగా లేరు. చూద్దాం…ఏం జరుగుతుందో!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *