లింగయ్యా..ఉల్లంఘనేందయ్యా…?

లింగయ్యా..ఉల్లంఘనేందయ్యా…? వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో అమర్చిన సీసీ కెమెరాలను మార్చి నుండి ఏఫ్రిల్‌ వరకు ఎందుకు బందు చేశారో నేటి వరకు ఆ విషయంపై ఇంటర్మీడియట్‌ డిఐఈవో లింగయ్య వివరణ ఇవ్వకపోవడంతో సీసీ కెమెరాలను బందు చేయాల్సిన అవసరం ఏం వచ్చింది! ఏదేని అవినీతికి పాల్పడాలనుకున్నప్పుడు ఆ కెమెరాలు అడ్డొచ్చాయా? పేపర్‌ వాల్యుయేషన్‌ క్యాంపులో జరిగిన అవినీతికి సంబందించిన బిల్లులు చేసేటప్పుడు కాని, డబ్బులు పంచుకునేటప్పుడు కాని కెమెరాలల్లో దొరికి పోతామనుకున్నారా? ఇంటర్‌ బోర్డు కమీషనర్‌…

Read More

 పోలీస్‌స్టేషన్‌ ముట్టడి

పోలీస్‌స్టేషన్‌ ముట్టడి చిన్నారి శ్రీహితపై అత్యాచారం చేసిన నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్‌ చేస్తూ చిన్నారి బంధువులు, మహిళలు, వివిధ సంఘాల కార్యకర్తలు హన్మకొండ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. మృతదేహంతో పోలీస్‌స్టేషన్‌ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఆందోళనతో హన్మకొండ పరిసర ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. హన్మకొండ చౌరస్తా ప్రాంతం నుంచి పబ్లిక్‌గార్డెన్‌ వరకు ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను దారి మళ్లించే ప్రయత్నం చేయగా హన్మకొండలోని దాదాపు అన్ని ప్రాంతాలు వాహనాలతో నిండిపోయాయి. ట్రాఫిక్‌ను…

Read More

ఆ ముగ్గురు కార్పొరేటర్ల అరెస్టుకు రంగం సిద్ధం….?

ఆ ముగ్గురు కార్పొరేటర్ల అరెస్టుకు రంగం సిద్ధం….? భూకబ్జాలో దర్జా వెలగబెడదామనుకుంటే ఆ ముగ్గురు కార్పొరేటర్లకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయ్యిందట. అధికార పార్టీ కార్పొరేటర్‌లం మాకు ఎవరు అడ్డు కల్లకు పొరలు కమ్మి కార్పొరేషన్‌ సిబ్బందిని, మహిళా అధికారిని నానా దూర్బాషలాడి కబ్జాను సమర్థించే పనిచేసి, ఎమ్మెల్యే మనుషులమని చెప్పి ఆయన ప్రమేయం లేకున్నా పేరును వాడుకుని కాంప్లెక్స్‌ నిర్మాణానికి పూనుకున్న ఆ ముగ్గురికి పోలీసులు త్వరలోనే చెక్‌ పెట్టబోతున్నట్లు తెలిసింది. భూవివాదం కోర్టులో…

Read More

పసిమొగ్గను…చిదిమేశాడు

పసిమొగ్గను…చిదిమేశాడు హన్మకొండ నగరంలోని టైలర్‌స్ట్రీట్‌ పాలజెండా ప్రాంతంలో దారుణం జరిగింది. తొమ్మిది నెలల పసికందుపై ఓ కామాంధుడు సభ్యసమాజం తలదించుకునేలా ముక్కుపచ్చలారని తొమ్మిదినెలల పసికందు పాపపై అత్యాచారయత్నానికి పాల్పడి హత్య చేశాడు. ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసే ఈ సంఘటన బుధవారం నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… జక్కోజు జగన్‌-రచన దంపతుల కుమార్తె శ్రిత (9నెలలు)తో తమ ఇంటి బంగ్లాపై నిద్రించారు. తెల్లవారుజామున సుమారు 4గంటల సమయంలో కొలేపాక ప్రవీణ్‌ (28) అనే వ్యక్తి వారు నిద్రిస్తున్న…

Read More

అధికారుల వాహన ‘మాయ’

అధికారుల వాహన ‘మాయ’ – అధికారిక వాహనాలలో వారిదే ఇష్టారాజ్యం – బిల్లు చెల్లించేది ఓ వాహనానికి, తిరిగేది మరో వాహనం – బినామీ పేరుతో వేలు దండుకుంటున్న ఓ జిల్లాస్థాయి అధికారి – తిరిగేది సొంతకారులో…వాహన బిల్లు బినామీ ఖాతాలోకి… – మహబూబాబాద్‌ జిల్లాలో ఆ అధికారి రూటే సపరేటు అధికారిక వాహనాల విషయంలో అధికారులు మాయ చేస్తున్నారు. అందినకాడికి దండుకోవాలన్న ఆలోచనతో తమ అతితెలివికి పదునుపెట్టి బినామీ పేర్లతో పని కనిస్తున్నారు. అధికారులు వాడే…

Read More

హసన్‌పర్తి పీఎస్‌ను సందర్శించిన హోంమంత్రి

హసన్‌పర్తి పీఎస్‌ను సందర్శించిన హోంమంత్రి హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ను తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ శనివారం సందర్శించారు. స్మార్ట్‌ సిటీ పోలీస్‌స్టేషన్ల సందర్శనలో భాగంగా శనివారం హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌కు హోంమంత్రి వచ్చారు. పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులు, ఉద్యోగుల పనితీరును ఆయన పర్యవేక్షించారు. స్టేషన్‌లోని సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో క్రైం రేట్‌ 90శాతం మేర తగ్గినందుకు ఉద్యోగులను అభినందించారు. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మొక్కలను నాటారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను…

Read More

చేపల వేటకు వెళితే మొసలి దాడి

చేపల వేటకు వెళితే మొసలి దాడి చేపల వేటకు వెళ్లిన ఒకరిపై మొసలి దాడి చేయగా ప్రాణాలతో బయటపడ్డాడు ఒక వ్యక్తి. వివరాలలోకి వెళితే… నర్సంపేట మండలం గురిజాల గ్రామానికి చెందిన కొలువుల యాకయ్య అనే వ్యక్తి శనివారం ఖానాపురం మండలంలోని పాకాల సరస్సులో చేపలవేటకు వెళ్లాడు. సరస్సులో అతను చేపలు పడుతుండగా ఒక్కసారిగా మొసలి దాడిచేసి చేతిని అందుకున్నది. వెంటనే ప్రతిఘటించి తోటి వారి సహాయంతో ప్రాణాలతో బయటకు వచ్చారు. వెంటనే అతడిని నర్సంపేట ఏరియా…

Read More

మోడల్‌ స్కూల్‌ విద్యార్థినికి ఐఐటిలో చోటు

మోడల్‌ స్కూల్‌ విద్యార్థినికి ఐఐటిలో చోటు పర్వతగిరి మండలంలోని మోడల్‌ స్కూల్‌ విద్యార్థి ఎండి.యాస్మిన్‌కు భాసర ఐఐటిలో సీటు వచ్చింది. ఈ సందర్భంగా యాస్మిన్‌కు బాసర ఐఐటిలో సీటు దక్కడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ బృందం ఆశీర్వదించి అభినందించారు. తన కూతురుకు ఐఐటీలో సీటు రావడంతో యాస్మిన్‌ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read More

పోలీసులు తమ కర్తవ్యాన్ని నెరవేర్చాలి : మంత్రి మహ్మూద్‌అలీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేయనున్నదని, పోలీసులకు, వారి కుటుంభాలకు అన్ని విధాలుగా అండగా నిలువడానికి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది కార్యక్రమ ప్రణాళికలు రూపొందిస్తున్నదని, పోలీసులు విధినిర్వహణలో తమ కర్తవ్యాన్ని నెరవేర్చి ప్రజలకు రక్షణ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహ్మూద్‌అలీ అన్నారు. శనివారం స్మార్ట్‌ పోలీస్‌స్టేషన్ల సందర్శనలో భాగంగా ఆయన వరంగల్‌జిల్లాలో పర్యటించి పలు పోలీస్‌స్టేషన్‌లను పోలీసుల పనితీరును, పోలీస్‌స్టేషన్‌ భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ప్రజలతో…

Read More

మావోయిస్టు కరపత్రాలు

మావోయిస్టు కరపత్రాలు వాజేడు మండలకేంద్రంలో శనివారం రాత్రి మావోయిస్టు కరపత్రాలు వెలిశాయి. జల్‌, జంగల్‌, జమీన్‌పై ఆధికారం ప్రజలదేనని నినదిస్తూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఆదివాసులను అడవి నుంచి గెంటివేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేఖంగా ప్రజాస్వామిక వాదులు, ఆదివాసులు, అన్నివర్గాల ప్రజలు పోరాడాలన్నారు. న్యాయస్థానం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులను నిర్వాసితులను చేయాలనే కుట్రకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. సాయంత్రం మావోయిస్టులు మండలకేంద్రంలో కరపత్రాలు వదిలివెళ్లడం సంచలనంగా మారింది. ఈ విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read More

అక్రమార్కులపై ఎమ్మెల్యే ‘చల్ల’ని చూపు

అక్రమార్కులపై ఎమ్మెల్యే ‘చల్ల’ని చూపు ఆయనో ఎమ్మెల్యే, రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కాంట్రాక్టర్‌గా పేరుగాంచి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. సహజవనరులను దర్జాగా నమిలి వేస్తూ కోట్లు కూడబెట్టాడు. ఈయనగారు చేస్తున్న దందా ప్రస్తుత తరాలను, భవిష్యత్‌ తరాలను కూడా కోలుకోలేని దెబ్బతీస్తుంది. ఎంత పెద్ద గుట్టలనైనా అవలీలగా మింగి వేస్తాడు. అనుమతుల సంగతి దేవుడెరుగు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కనుక పనులు చకచక జరిగిపోతాయి. కోట్లాది రూపాయలు జమ అయిపోతుంటాయి. ఇది ఎవరు ఇచ్చిన హక్కో…

Read More

మంత్రి చుట్టూ భజన బృందం

మంత్రి చుట్టూ భజన బృందం ఇటీవల పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రైవేట్‌ పీఎల వ్యవహారంపై ‘నేటిధాత్రి’ కథనాలను ప్రచురించింది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే పీఎల విషయంలో జాగ్రత్త, ప్రైవేట్‌ పీఎల నియామకానికి స్వస్తి పలకండని చెప్పి, ప్రభుత్వం కేటాయించే పీఎలను తానే నియమిస్తానని మంత్రుల ఇష్టా, ఇష్టాలకు సీఎం చెక్‌ పెడితే, అది కాదని చెప్పి ఎర్రబెల్లి ఏకంగా 20మంది పీఎలను నియమించుకున్నట్లు అందిన సమాచారంతో ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఓ కథనం వెలువరించాం….

Read More

విజయవంతంగా బడిబాట ర్యాలీ…

విజయవంతంగా బడిబాట ర్యాలీ… ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని వరంగల్‌ అర్బన్‌ జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి తల్లిదండ్రులను కోరారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం లష్కర్‌ బజార్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ విద్యార్థి సంపూర్ణ వికాసానికి ప్రభుత్వ పాఠశాలలోని బోధన సహకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ మండల విద్యాశాఖ అధికారి…

Read More

ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో రాస్తారోకో

ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో రాస్తారోకో కాంగ్రెస్‌ను టిఆర్‌ఎస్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ ఎస్‌డిఎల్‌సిఇ జంక్షన్‌ వద్ద ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ అలువాల కార్తీక్‌ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీలపై గెలిచి టిఆర్‌ఎస్‌ పార్టీలకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో గెలిచి తమ సత్తా నిరూపించుకోవాలన్నారు. రాష్ట్రంలో తొలిసారి దళితుడు సీఎల్పీ నాయకుడు కావడాన్ని జీర్ణించుకోలేక…

Read More

పుస్తకాల బరువు మోసేదెలా

పుస్తకాల బరువు మోసేదెలా విద్యాసంవత్సరం మొదలైంది…పాఠశాల తిరిగి ప్రారంభం కానున్నాయి…విద్యార్థుల పుస్తకాలు కొనటానికి తల్లితండ్రులు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది…పాఠశాల యాజమాన్యాలు మాత్రం ప్రతి సంవత్సరం పుస్తక ఏజెన్సీలతో, వస్త్రాదుకాణాల యాజమాన్యాలతో కుమ్మక్కై దోచుకుంటున్నారని విద్యార్థుల తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉల్లాసమైన వాతావరణం…విశాలమైన ఆటస్థలాలు లేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పాఠశాలల ముందు కనీసం పార్కింగ్‌ స్థలం కూడా లేని పాఠశాలలు నగరంలో చాలా వరకు ఉన్నాయి. ప్రభుత్వ విద్యాశాఖ నిబంధనలకు విరుద్దంగా బహుళ…

Read More

ప్రజా రక్షణే…మా ధ్యేయం

ప్రజా రక్షణే…మా ధ్యేయం వరంగల్‌ పోలీస్‌ కమీషనరేట్‌ పరిధిలో పోలీసులు ప్రజలకు భరోసాను కల్పించడమే కాకుండా నిత్యం నగరంలో శాంతిభద్రతలకై కంటిమీదకునుకు లేకుండా ప్రశాంత వాతావరణం కోసం రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్నాము. నగరంలో నేరాలను నియంత్రించడం కోసం వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌ డి.వి రవీందర్‌ ఆదేశాల మేరకు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉంటూ మా కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాము. పోలీసులంటే బయపెట్టేవారు కాదు..పోలీసులంటే ప్రజాసేవకులమని నిరూపించుకుంటున్నామని, ఫ్రెండ్లీ పోలీసుతో ప్రజలకు మేము మరింత చేరువయ్యామని, ప్రజలకు పోలీసులపై అపారనమ్మకం ఏర్పడిందని…

Read More

‘షాని’కెళ్లద్దు…బిడ్డో….!

‘షాని’కెళ్లద్దు…బిడ్డో….! వద్దు బిడ్డా..లేనిదానికి కానిదానికి వెళ్లద్దు…ఉన్నంతలోనే వుండాలి. అందేకాడికే అందుకోవాలి, ఉన్నంతలోనే సర్దుకోవాలి. బయటికి కనిపించేదంతా అద్భుతం కాదు..మెరిసేదంతా బంగారం కాదు..ఇలాంటి మాటలు మన పెద్దోళ్లు చాలా మందికి చెబుతుంటారు. అయినా పెడచెవిన పెడుతూ కొందరు మెరిసేదంతా బంగారమే అన్నట్లు ఊహలలో తేలిపోతుంటారు. అసలు విషయం తెలుసుకునేలోపే జరగాల్సి నష్టం, సమయం అన్ని జరిగిపోతాయి. తీరా తలలు పట్టుకుంటే ఏం లాభం..? ఇది జగమెరిగిన సత్యం.నగరంలో పేద, మద్యతరగతి కుటుంబాల్లో తమ పిల్లలను ఓ ప్రైవేటు స్కూల్‌కు…

Read More

ఇంటింటికి బడిబాట

ఇంటింటికి బడిబాట మండలంలోని కొండాపురం గ్రామంలో అంగన్‌వాడీ కార్యక్రమంలో భాగంగా బడిబాట నిర్వహించారు. ఇంటింటికి అంగన్‌వాడీ కార్యక్రమంలో 5సంవత్సరాలలోపు పిల్లలందరిని అంగన్‌వాడీకి పంపాలని పిల్లల తల్లిదండ్రులకు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలు చిన్నపిల్లల మేథో వికాసాభివృద్దికి ఎంతోగానో తోడ్పడుతాయని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నపిల్లలను చేర్పిస్తే పోషకాహారంతోపాటు ఉచితవిద్య, ఆరోగ్యం, భాష అభివద్ధి గురించి పిల్లల తల్లిదండ్రులలో అవగాహన కలిగించారు. అనంతరం చిన్నపిల్లలకు ఆక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో గ్రామంలోని చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ…

Read More

కార్పొరేటర్‌ తండ్రి కావరం

కార్పొరేటర్‌ తండ్రి కావరం ఆయనో కార్పొరేటర్‌ తండ్రి. కొడుకు ఆవేశానికి గురైతే అలా కాదు…ఇలా అని సర్థిచెప్పాల్సినోడు రాజకీయం అంటే ఏంటో చెప్పి కొడుకు జనం తరుపు నాయకుడిగా ఎదిగేలా చేయాల్సినోడు కానీ కొడుకు కంటే ముందు తండ్రికే ఓపిక లేకుండాపోయింది. తనయుడి కార్పొరేటర్‌ పెత్తనాన్ని తనకు ఉన్న కావరాన్ని కలగలిపి డివిజన్‌ ప్రజలపై విరుచుకుపడ్డాడు. నా కొడుకునే నల్లా నీళ్లు కావాలని అడుగుతారా…డివిజన్‌లో నీటి కొరత ఉందని ఫిర్యాదు చేస్తారా…? కార్పొరేటర్‌ అయిన నా కొడుకు…

Read More

గుట్కాల పట్టివేత

గుట్కాల పట్టివేత వరంగల్‌ క్రైమ్‌, నేటిధాత్రి : మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శంభునిపేట ప్రాంతంలో అక్రమంగా నిల్వ చేసిన 27వేల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు బుధవారం స్వాదీనం చేసుకున్నామని మిల్స్‌కాలనీ పోలీసులు తెలిపారు. శంభునిపేటకు చెందిన ధర్మపురి రమేష్‌ ఇంట్లో తనిఖీ చేయగా గుట్కాలు లభించాయని, రమేష్‌పై కేసు నమోదు చేశామని మిల్స్‌కాలనీ పోలీసులు తెలిపారు.

Read More