అకాల వర్షం రైతన్నలు ఆగం
మల్లక్కపేట గ్రామాల్లో ఇండ్లపైన కూలిన భారీ వృక్షాలు
పరకాల నేటిధాత
అకాల వర్షాల కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిళ్లింది.చేతికి వచ్చిన పంట అకాల వర్షాల కారణంగా నేల రాలడంతో తమకు తీవ్ర నష్టం వాటిళ్లిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హనుమకొండ జిల్లా పరకాల పట్టణ మరియు మండల పరిధిలో రాత్రికాల సమయంలో ఊహించని విధంగా తుఫాన్ ను తలపించేలాగా విపరీతమైన ఈదురుగాలులతో వర్షం బీభత్సం సృష్టించింది.దాదాపు ఒక గంటపాటు తీవ్రమైన ఉరుములు మెరుపులతో ఎడతెగని వడగండ్ల వాన కురిసింది

మండలంలోని మల్లక్కపేట గ్రామంలో ఈదురుగాలుల కారణంగా కొన్ని ఇండ్లపైన భారీ వృక్షాలు కూలి రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది కల్లాలలో ఉన్న మిర్చి,మొక్కజొన్న పంటలు తడిచి ముద్దైన పరిస్థితి ఏర్పడింది.ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కల్లాల్లో చూసుకుని ఇక తమ కష్టాలు తప్పుతాయని భావించిన కొద్దిసేపట్లోనే అకాల వర్షం రైతన్నల ఆశలను అడియాశలు చేసింది.ఏదైఏమైనా ఈ అకాలవర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించిందని చెప్పవచ్చు