బాలానగర్ : గల్లంతయిన రెండో వ్యక్తి.. మృతదేహం లభ్యం
బాలానగర్ : నేటి ధాత్రి
బాలానగర్ మండలంలోని గంగాధర్ పల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం చేపలు పట్టేందుకు వెళ్లి గ్రామానికి చెందిన రాములు, యాదయ్య గల్లంతైన సంఘటన తెలిసిందే. సోమవారం గాలింపు చేపట్టిన మృతదేహాలు లభించలేదు. మంగళవారం సాయంత్రం శివరాములు మృతదేహం లభ్యం అయింది. బుధవారం ఎస్ఐ లెనిన్ ఆధ్వర్యంలో మరోసారి గాలింపు చేపట్టగా.. యాదయ్య (25) మృతదేహం లభ్యమయ్యింది. పోస్టుమార్టం నిమిత్తం యాదయ్య మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే ఊరికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడంతో.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.