సీకేఎం డిగ్రీ కళాశాల ఎఫ్ఎసి ప్రిన్సిపాల్ గా డాక్టర్ ఏ.ధర్మారెడ్డి.
వరంగల్, నేటిధాత్రి
దేశాయిపేటలోని సికేఎం ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల ఎఫ్ఎసి (ఫుల్ అడిషనల్ ఛార్జీ) ప్రిన్సిపాల్ గా డాక్టర్ ఏ. ధర్మారెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మార్చ్ 31వ తేదీన సికేఎం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ జి .శశిధర్ రావు పదవి విరమణ పొందడంతో ఆ స్థానంలో కళాశాలలో కెమిస్ట్రీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఏ ధర్మారెడ్డికి ఇంచార్జ్ ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. అనంతరం కళాశాల విద్య కమిషనర్ ఉత్తర్వుల ఆదేశానుసారం తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు సీకేఎం డిగ్రీ కళాశాలకు ఫుల్ అడిషనల్ చార్జ్ ప్రిన్సిపాల్ గా వ్యవహరించాలని కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేవసేన ఐఏఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం డాక్టర్ ఏ .ధర్మారెడ్డి ఎఫ్ ఎ సి ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది డాక్టర్ ధర్మారెడ్డికి పుష్పగుచ్చాలు అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తనను ఎఫ్ఎసి ప్రిన్సిపాల్ గా నియమించినందుకు సిసిఈ ఉన్నతాధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిసిఈ సూపరిండెంట్ కృష్ణారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ భరత్ చారి, కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ జీ. శశిధర్ రావు, అధ్యాపకులు డాక్టర్ కే ఎల్ వి. వరప్రసాదరావు, కెప్టెన్ డాక్టర్ పి. సతీష్ కుమార్, లైబ్రరియన్ ఎస్ .అనిల్ కుమార్, సూపరిండెంట్ జి .శ్రీనివాస్, గెస్ట్ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.