రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి.
కల్వకుర్తి /నేటి దాత్రి :
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన జడ్చర్ల- కోదాడ రహదారిపై మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన కాసుల అరవింద్ చారీ (31)చీపుర కార్తీక్ చారీ (32)ద్విచక్ర వాహనంపై దేవరకొండ వెళ్లి స్వగ్రామానికి తిరిగి ప్రాణమయ్యారు. మార్గమధ్యంలో ఎర్రగుంటపల్లి గేట్ సమీపంలో జడ్చర్ల- కోదాడ ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడింది.

ఈ ప్రమాదంలో అరవింద్ చారి, కార్తీక్ చారి లకు తలకు బలమైన గాయం తగలడం వల్ల అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాజు తెలిపారు.