మట్టి దొంగల చేతిలో ధ్వంసం అవుతున్న ప్రభుత్వ ఆస్తులు
గుడ్లప్పగిచ్చి చూస్తున్న అధికారులు
నాకు రాజకీయ పలుకుబడి ఉంది
ఆనాడు పెట్టుబడి పెట్టా.. ఇప్పుడు సంపాదించుకోవడం తప్పా?
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ గ్రామంలోని ఎల్లమ్మ చెరువులో మట్టి తరలింపునకు ఇరిగేషన్ శాఖ అధికారులు ఒక వెయ్యి క్యూబిక్ మీటర్లు తరలింపునకు కోమండ్లపల్లి గ్రామం సుల్తానాబాద్ మండలం పెద్దపల్లి జిల్లాకు చెందిన వ్యక్తికి నాలుగు లారీల ద్వారా పరిమిషన్ ఇచ్చియున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న సంబంధిత కాంట్రాక్టర్ పదుల సంఖ్యలో వాహనాల ద్వారా మట్టిని తరలించడమే కాకుండా విద్యుత్ శాఖకు సంబంధించిన ఒక ట్రాన్స్ఫార్మర్, మూడు విద్యుత్ పోలను విరగగొట్టి మట్టిని తరలించుచున్నారు.

ఈవిషయమై సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా గ్రామానికి చెందిన ముగ్గురు రైతులకు పర్మిషన్ ఇచ్చామని తెలిపారు. పరిమిషన్ రైతులకు ఇచ్చినట్లయితే సంబంధిత చెరువులో పదుల సంఖ్యలో ర్యాలీలు గ్రామపంచాయతీ ముందు నుండి ఎలాంటి పర్మిషన్ లేకుండా మట్టిని తరలిస్తుంటే సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శి కళ్ళున్న గుడ్డివాడి లాగా ప్రవర్తించడం మండలంలోని ప్రజలను విష్మయానికి గురిచేస్తుంది. విద్యుత్ పోల్లు మరియు ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం విషయమై సంబంధిత విద్యుత్ శాఖ ఏఈ కమలేష్ ను వివరణ కోరగా సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని పోలీస్ శాఖ వారు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపారు.

ఇరిగేషన్ శాఖ ఏఈ రఘురాంను వివరణ కోరగా సమాచారం అందించిన పిదప మేము వర్క్ ఇన్స్పెక్టర్ మల్లయ్యను మోఖాపై పంపి రెండు ఎక్సావేటర్ లను సంబంధిత టిప్పరులను నిలిపివేయడం జరిపామని సంబందిత ఫోటోలు పంపడం జరిగినది. ఒక అధికారి ఎంతవరకైతే మార్కింగ్ ఇచ్చారో అంతవరకు మాత్రమే మట్టి తరలింపునకు ఆస్కారం ఉంటుంది. అలాంటిది సంబంధంలేని వెహికల్ ద్వారా ఇష్టానుసారంగా పరిమితికి మించి మట్టిని తరలిస్తున్న సంబంధిత ఏఈ రఘురాం మోఖాపై వెళ్లి పరిశీలించకుండా నిమ్మకు నీరేత్తినట్లు ఉండడం చూస్తుంటే వారిచ్చిన అమ్యామ్యాలకు తలోగ్గి నిమ్మకు నీరెత్తి ఉన్నట్లు గ్రామ, మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని మార్కింగ్ ఇచ్చిన స్థలంపై కాకుండా ఇంకా ఎన్నాచోట్ల నుండి మట్టిని తోలగించారో పూర్తి విచారణ జరిపడంతో పాటు ఎన్ని వాహనాల ద్వారా మట్టి తరలింపు జరిగిందో ఎన్ని క్యూబిక్ మీటర్లు తరలించారో లెక్కగట్టి ఒక్క క్యూబిక్ మీటర్ ఎక్కువ తరలించిన సంబంధిత కాంట్రాక్టర్ పై శాఖపరమైన చర్యలు తీసుకొని పరిమిషన్ లేకుండా మట్టి తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయవలసిందిగా మండల ప్రజలు అధికారులను పత్రికా ముఖముగా కోరుకుంటున్నారు. ఈవిషయమై పలుమార్లు ఫోన్ ద్వారా వివరణ ఇవ్వాలని కోరగా మంగళవారం సంబంధిత ఏఈ రఘురాం మోకాపై వచ్చినప్పుడు మోకాపై నుండి వాహనాలను వెళ్ళగొట్టామని తెలియపరిచారు. ఏఈ మోఖాపై ఉన్నప్పుడు పదుల సంఖ్యలో వాహనాలు ఉన్న ఎందుకు సీజ్ చేయకపోవడం లేదో చూస్తుంటే కళ్ళున్న గుడ్డివాళ్ళ లాగా అధికారులు నటిస్తున్నారని మండలంలోని ప్రజలు బహుబాటంగానే చర్చించుకుంటున్నారు