వేణుగోపాల్ రావుకు జర్నలిస్టుల శుభాకాంక్షలు
షాద్ నగర్ /నేటి ధాత్రి.
షాద్ నగర్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా ఇటీవలే ఎన్నికైన వేణుగోపాలరావును షాద్ నగర్ స్థానిక జర్నలిస్టులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక దేవి గ్రాండ్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో వేణుగోపాల్ రావును కలుసుకున్న జర్నలిస్టులు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు ఖాదర్ పాషా, కస్తూరి రంగనాథ్, రాఘవేందర్ గౌడ్, శేఖర్ రెడ్డి, నరేష్, నరసింహారెడ్డి, ఎ.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.