మహాబోధి ఆలయం అప్పగించాలంటూ బౌద్ధ సన్యాసుల ఆందోళన

ఆలయ వివాదంతో వార్తలకెక్కిన బుద్ధ గయ

మధ్య యుగాల్లో ముస్లిం చొరబాటుదార్ల చేతిలో పెద్దసంఖ్యలో మరణించిన బౌద్ధులు

దాడులో బతికిన బౌద్ధులు ఆలయాన్ని విడిచి పారిపోయారు

1590 నుంచి శైవ సన్యాసుల ఆధీనంతో ఆలయం

నిత్యం శైవ ఆరాధన, క్రతువుల నిర్వహణ

ఎప్పుడో పరిష్కారమైన సమస్యను కెలుగుతున్న రాజకీయ పార్టీలు

త్వరలో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలే కారణం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

బిహార్‌లోని బుద్ధ గయ అంటే తెలియనివారుండరు. ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధులకు ఇది పవిత్ర పుణ్యక్షేత్రం. అయితే ఇక్కడ గత ఫిబ్రవరి నుంచి ఆల్‌ ఇండియా బుద్ధిస్ట్‌ ఫోరం (ఐఏబీఎఫ్‌) ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇంతకూ వీరి డిమాండ్‌ ఏంటంటే బుద్దగయ టెంపుల్‌ యాక్ట్‌`1949 (బీటీఏ)ను తక్షణం రద్దుచేయాలని. నిజానికి బుద్ధ గయలోని మహాబోధి లేదా మహా విహార ఆలయ నిర్వహణ బాధ్యతలు పూర్తిగా తమకే అప్పగించాలని బౌద్ధులు ఎన్నో ఏళ్లుగాడిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. ఈ మహాబోధి మహావిహార దేవాలయ ప్రాంగణంలోని బోధి వృక్షం కిందనే గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయమైందన్నది బౌద్ధుల విశ్వాసం. 

ఈ మహాబోధి దేవాలయాన్ని బౌద్ధం స్వీకరించిన తర్వాత అశోకచక్రవర్తి క్రీ.పూ.260లో నిర్మిం చాడు. భక్తియార్‌ ఖిల్జీ బారత్‌పై దండయాత్ర చేసేవరకు అంటే క్రీ.శ.13వ శతాబ్దం వరకు ఈ ఆలయం బౌద్ధుల నిర్వహణలోనే కొనసాగింది. తర్వాతి కాలంలో అంటే క్రీ.శ. 13వ శతాబ్దం చివరికాలం నుంచి 18వ శతాబ్దం వరకు ఈ ఆలయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. బ్రిటిష్‌ పాలన ప్రారంభమైన తర్వాత ఈ ఆలయానికి మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం యునెస్కో ఈ ఆల యాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. 

ఆలయ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం క్రీ.శ.1590లో ఘమండి గిరి అనే ఒక హిందూ శైవ సన్యాసి ఈ ఆలయానికి వచ్చి, ఇక్కడే నివాసం ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఆయన వివిధ క్ర తువులు నిర్వహించడమే కాకుండా, బుద్ధ గయ మఠాన్ని నెలకొల్పారు. అప్పటినుంచి ఈ ఆల య వ్యవహారాలను గిరి వంశస్థులే నిర్వహిస్తున్నారు. ఇదిలావుండగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రెండేళ్లకు బిహార్‌ ప్రభుత్వం బుద్ధ గయ ఆలయ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఆలయ నిర్వహణ బాధ్యతలను అప్పటివరకు నిర్వహిస్తున్న బుద్ధ గయ మఠం అధినేత నుంచి తప్పించి, ఎనిమిదిమందితో కూడిన కమిటీకి అప్పగించింది. బుద్ధ గయ టెంపుల్‌ యాక్ట్‌`1949 పేరుతో రూపొందించిన ఈ చట్టం ప్రకారం 1953లో బుద్ధగయ టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (బీటీ ఎంసీ) ఏర్పాటైంది. ఈ కమిటీలో నలుగురు బౌద్ధులు, నలుగురు హిందువులు సభ్యులుగా వుండే ఏర్పాటు జరిగింది. ఈ కమిటీనే ఇప్పటివరకు బుద్ధగయ లోని మహాబోధి ఆలయ నిర్వహణ బాధ్యతలను నిర్వస్తోంది.

ఈ చట్టం ప్రకారం బుద్ధగయ జిల్లా మెజిస్ట్రేట్‌ ఈ కమిటీకి ఎక్స్‌ాఅఫిసియో ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. మొదట్లో పొందుపరచిన నిబంధనల ప్రకారం ఎక్స్‌ాఅఫిసియో ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించే డిస్ట్రిక్ట్‌ మెజిస్ట్రేట్‌ తప్పనిసరిగా హిందువై వుండాలి. అయితే 2013లో ఈ నిబంధనలో మార్పుచేసి, ఏ మతానికి చెందిన డిస్ట్రిక్ట్‌ మెజిస్ట్రేట్‌ అయినా ఎక్స్‌ అఫిసియో ఛైర్మన్‌గా వుండే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. అయితే ఈ చట్టాన్ని రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూగత ఫిబ్రవరి నుంచి వందమంది బౌద్ధ సన్యాసులు ఆలయ ప్రాంగణంలో నిరసనలు చేపట్టారు. ముఖ్యంగా ఫిబ్రవరి 12 నుంచి అన్ని బౌద్ధ గ్రూపులకు చెందిన సన్యాసులు ఆల్‌ ఇండియా బుద్ధిస్ట్‌ ఫోరం (ఎఐబిఎఫ్‌) అనే ఛత్రం కింద నిరాహారదీక్షలు కొనసాగిస్తున్నారు. ‘‘బౌద్ధులకు న్యా యం జరగాలి’’, ‘‘బీటీఎంసీలో అందరు సభ్యులు బౌద్ధులు మాత్రమే వుండాలి’’ అనేవి వీరు చే స్తున్న నినాదాలు.

మొదట్లో ఈ నిరసనలు మహాబోధి ఆలయంలోనే జరిగాయి. ఇక్కడ నిరాహారదీక్ష చేస్తున్న రెండుడజన్ల మంది బౌద్ధ సన్యాసులను ఫిబ్రవరి 27న బిహార్‌ పోలీసులు ఆలయ ప్రాంగణం నుంచి తొలగించడంతో, వారు ఆలయం వెలుపల తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వున్నఆలయ కమిటీని రద్దుచేసిన పూర్తిగా ఎనిమిదిమంది బౌద్ధులతోనే కొత్త కమిటీ ఏర్పాటు చేయా లని వీరు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నిరసనలు ఆల్‌ ఇండియా బుద్ధిస్ట్‌ ఫోరం (ఐఐబీఎఫ్‌) అధ్యక్షుడు జంబు లామా, కార్యదర్శి ఆకాష్‌ లామా నేతృత్వంలో జరుగుతున్నాయి. ఇదిలా వుండగా ఛత్తీస్‌గఢ్‌ నుంచి బుద్ధగయ చేరుకున్న అభిషేక్‌ బుద్ధ అనే సన్యాసి, ‘దేశంలోని అన్ని మతాలు తమ ప్రార్థనా స్థలాలను నిర్వహిస్తున్నాయి. అటువంటప్పుడు ఈ మహాబోధి ఆలయ నిర్వహణ బాధ్యతలు బౌద్ధులకే అప్పగించడం న్యాయం’ అని అన్నారు. బౌద్ధుల మతపరమైన ప్రదే శంలో ఇంతమంది హిందువులు వుండటం అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ బౌద్ధులు జరుపుతున్న నిరసనలకు మద్దతుగా ఢల్లీి, ముంబయి, మైసూరు, అమెరికాలోని బౌద్ధులు ఆందోళనలు నిర్వహించారు. రాజ్యాంగం ప్రసాదిస్తున్న మతస్వేచ్ఛ హక్కుకు బీటీఏ పూర్తి విరు ద్ధమని బౌద్ధ సన్యాసులు వాదిస్తున్నారు. ఆలయంలో హిందూ సన్యాసులు వైదిక క్రతువులు నిర్వహిస్తున్నారని, బౌద్ధ మత సిద్ధాంతాలకు ఇది పూర్తి విరుద్ధమని వారు వాదిస్తున్నారు. 

ఇదొక శైవమఠం

ఇదిలావుండగా ఈ బుద్ధగయ మఠం, గత కొన్ని శతాబ్దాలుగా శైవమఠంగా కొనసాగుతూ, ఇక్కడ శైవ సాంప్రదాయ క్రతువులను పాటిస్తూ వస్తోంది. ఈ ఆలయాన్ని కొన్ని శతాబ్దాలుగా కాపాడుతూ వస్తున్నది కూడా వీరే. ఈ నేపథ్యంలో మార్చి 25న ఆలయ కమిటీ బాధ్యులు విలేకర్లతో మాట్లాడుతూ, బౌద్ధ సన్యాసులు చేస్తున్న ఆందోళన కేవలం రాజకీయ ప్రేరేపితమైందని ఆరోపించారు. బౌద్ధ సన్యాసులు చేస్తున్న వాదనలను కమిటీ కొట్టిపారేసింది. మఠం అధినేత వివేకానందగిరి మాట్లాడుతూ కొందరు రాజకీయ నాయకుల ప్రమేయంతో ఈ ఆందోళన కొనసాగుతోందని. మఠంలో కొనసాగుతున్న ప్రశాంతతను భగ్నం చేయడానికే ‘మహాబోధి మందిర్‌ ముక్తి ఆందోళన్‌’ పేరుతో ఆందోళనలు కొనసాగిస్తున్నారని ఆరో పించారు. ఈరకంగా సామాజిక అశాంతిని సృష్టించడం ఈ వర్గాల ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. కేవలం బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న తరుణంలో రాజకీయ లబ్దికోస మే కొన్ని పార్టీలు ఈరకమైన వివాదాలను రెచ్చగొడుతున్నాయని ఆయన అన్నారు. ‘మా మఠ సంప్రదాయం ప్రకారం బుద్ధుడిని శ్రీమహావిష్ణువు పదవ అవతారంగా పరిగణిస్తాం. బౌద్ధులను మా సహోదరులుగా భావిస్తాం’ అని ఆ యన అన్నారు. ఎన్నో ఏళ్లుగా బౌద్ధ భక్తులు ప్రశాంతంగా ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటున్నారు. మేం ఎన్నడూ వారికి అడ్డు చెప్పలేదు. విదేశాలనుంచి కూడా బౌద్ధులు ఇక్కడకు వచ్చి తమ ప్రార్థనలు కొనసాగిస్తున్న సంగతిని ఆయన గుర్తు చేశారు. 

అసలు చరిత్ర

నిజానికి ఇక్కడి సమస్య కొన్ని దశాబ్దాల క్రితమే పరిష్కృతమైంది. 1192లో ముస్లింల దండయా త్రల సందర్భంగా ఇక్కడి ఎంతోమంది బౌద్ధ సన్యాసులను దారుణంగా హతమార్చారు. దీంతో మిగిలినవారు ఈ ఆలయాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. తర్వాత 1590 నుంచి ఈ ఆలయాన్ని శైవ సన్యాసులు తమ ఆధీనంలోకి తీసుకొని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. 1894లో అప్పటి బర్మారాజు ఈ ఆలయ భవనాన్ని బౌద్ధ ప్రార్థనా మందిరంగా నిర్మిస్తానని చేసిన ప్రతిపాదనకు శైవ సన్యాసులు అంగీకరించారు. అయితే అప్పట్లో వచ్చిన ఆంగ్లో`బర్మా యుద్ధం, వివిధ దేశాల శకుని పాత్ర కారణంగా ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. 1890`92 మధ్యకాలంలో ‘ది లైట్‌ ఆఫ్‌ ఆసియా’ పుస్తక రచయిత ఎడ్విన్‌ ఆర్నాల్డ్‌ ఈ ఆలయాన్ని బౌద్ధులకు అప్పగించాలని నాటి బ్రిటిష్‌`ఇండియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. అంతేకాదు జపాన్‌కు వెళ్లి తన డిమాండ్‌కు దౌత్యపరమైన మద్దతివ్వాలని కూడా అక్కడి ప్రభుత్వాన్ని కోరాడు. దీనిపై కోర్టులో కేసు దాఖలు కాగా, కోర్టు బౌద్ధులకు వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. తర్వాత 1901లో స్వామి వివేకానంద, 1935లో హిందూ మహాసభ నాయకుడు భాయి పరమానంద వంటి వారు ఈ ఆలయం విష యంలో ఎన్నో చర్చలు జరిపారు. ఎట్టకేలకు 1924లో బాబూ రాజేంద్రప్రసాద్‌ నేతృత్వంలో ఒక రాజీ ప్రతిపాదన ముందుకు తెచ్చారు. దీనికి అనేక అడ్డంకులు కల్పించినప్పటికీ, చివరకు ఈ ప్రతిపాదనే 1949లో చట్టంగా రూపొందింది. దీని ప్రకారం హిందువుల, బౌద్ధులకు ఇక్కడ ప్రార్థనలు జరుపుకునేందుకు సమాన హక్కులుంటాయి. మేనేజ్‌మెంట్‌ కమిటీలో కూడా రెండువర్గాలకు సమాన ప్రాతినిధ్యాన్ని ఈ చట్టం కల్పించింది. ఇదిలావుండగా ప్రస్తుత బౌద్ధుల ఆందోళనను హిందువులు మరోలా పరిగణిస్తున్నారు. ముస్లింల దాడులతో బౌద్ద సన్యాసులు పారిపో యిన తర్వాత ఆలయాన్ని పరిరక్షిస్తూ, దాని ఉనికిని కాపాడుతూ వచ్చిన తమకు కృతజ్ఞత చెప్పాల్సింది పోయి, బౌద్ధులు కృతఘ్నులుగా వ్యవహరిస్తున్నారని భావిస్తున్నారు. 

ఈ మహాబోధి ఆలయ విముక్తి ఉద్యమాన్ని ప్రారంభించింది జపాన్‌కు చెందిన భదంత్‌ ఆర్య నాగార్జున సురై ససాయ్‌. నిజం చెప్పాలంటే బౌద్ధం చైనా, టిబెట్‌, ఉత్తరకొరియా, వియత్నాంలలో కమ్యూనిస్టుల చేతులో దారుణంగా అణచివేతకు గురైంది. దక్షిణకొరియాలో బౌద్ధాన్ని, క్రైస్తవం పూర్తిగా కప్పేసింది. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌ కొండల్లోని చక్మా తెగ ప్రజలు బౌద్ధాన్ని పాటిసా ్తరు. ముస్లిం సెటిలర్లు వీరిని తరిమివేశారు. ఈ జపాన్‌ సన్యాసి ససాయ్‌ ఆయా దేశాల్లో ఇక్కడి మాదిరిగానే ఆందోళన చేపడితే ఆయన పరిస్థితి ఎలావుండేదో ఊహించుకోవచ్చు. మనది మితిమీరిన స్వేచ్ఛ కలిగిన ప్రజాస్వామ్యం కనుక ఎటువంటి ఆందోళనకైనా మద్దతు లభిస్తుంది. న్యాయాన్యాయాలతో పనిలేదు. నిజం చెప్పాలంటే మహాబోధి ఆలయాన్ని బాగా అభివృద్ధి చేసింది శైవుడైన ఒక బ్రాహ్మణమంత్రి. ఇది కమిటీ సభ్యులు కూడా కాదనలేని సత్యం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బౌద్ధ సన్యాసుల ఆందోళన వెనుక కొన్ని రాజకీయ శక్తుల పాత్రను కొట్టిపారేయడానికి వీల్లేదు. కులాలు మతాల మధ్య విభేదాలు సృష్టించి ఓట్లను దండుకునే వ్యూహంలోనే ఇది భాగం కావచ్చు. మరి ఈ ఆందోళనకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుందో కాలమే నిర్ణయించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!