Headlines

అన్యాక్రాంతమైన భూముల లెక్కలు తీయండి!

https://epaper.netidhatri.com/view/227/netidhathri-e-paper-4th-april-2024%09/3

` సిఎస్‌. శాంతి కుమారి ఆదేశం.

`‘‘నేటిధాత్రి’’ చేతిలో అక్రమార్కుల చిట్టా!

`దేవాదాయ భూముల మాయంపై దృష్టి పెట్టారు.

`కరోనా కాలంలో జరిగిన రిజిస్ట్రేషన్ల బాగోతం వెలికితీయనున్నారు.

`భూదాన్‌ భూముల మాయంపై ఆరా తీస్తున్నారు.

`గత పదేళ్ళలో అన్యాక్రాంతమైన భూముల వివరాలు సేకరిస్తున్నారు.

`రైతుల నోట్లో మట్టికొట్టిన వారెవరు?

`దేవాలయాల భూములు మింగిన ఘనులెవరు?

`భూముల ఆక్రమణలలో పెద్ద తలకాలెవరు?

`నిజాలు, నిగ్గు తేల్చే సమయం వచ్చింది.

`కొత్త ప్రభుత్వం భూ ఆక్రమణలపై కొరడా రaులిపించనుంది.

`భూ ఆక్రమణ దారులకు చుక్కలే!

`‘రిజిస్ట్రేషన్లు’’ చేసిన అధికారులకు కటకటాలే!

`తీగ లాగితే డొంకంతా కదలాలే!

`మూడేళ్ళుగా నేటిధాత్రి అనేక కథనాలు ప్రచురించింది.

`ఇప్పుడు ప్రభుత్వం ఆ కథనాలపై స్పందించింది.

`సమగ్ర నివేదిక కోసం సిఎస్‌. శాంతి కుమారి ఆదేశం.

` రియల్‌ మాయాజాలంలో ‘‘రిజిస్ట్రార్ల’’ పాత్ర.

`రియల్‌ దోపిడీలలో వారికి పెద్ద మొత్తాలలో వాట!

`ఇప్పుడు మొదలుకానుంది అసలైన ఆట.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అదేదో సినిమాలో అన్నట్లు దోచుకోవడం ఇష్టం, లాక్కొవడం ఇష్టం..దాచుకోవడం ఇష్టమన్నట్లు భూములను కూడా లాక్కునేవారు వున్నారు. భూమలను దోచుకునేవారున్నారు. వీళ్లు ఎప్పుడూ వుంటారు. అలనాటి నుంచి రాజుల కాలంలో జరిగిన యుద్దాలన్నీ భూముల కోసమే.. అప్పుడు భూములతో వ్యాపారం లేదు. రాజ్యాలుండేవి. ఆ రోజుల్లో బతకడానికి అవసరమైన భూమిని కూడా కొనుగోలు చేసుకున్నది లేదు. రాజులు భూముల్లో ప్రజలు పనులు చేసుకున్న రోజులున్నాయి. ఆ తర్వాత నా భూమి అన్నది ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి భూముల వ్యాపారం మొదలైంది. ఇప్పుడు నిలువ నీడ కోసం భూముల వ్యాపారమే పెద్ద సంపాదనా మార్గమైంది. దానికి ముద్దుగా రియల్‌ వ్యాపారం అంటున్నారు. అన్నీ ఇల్లీగల్‌ పనులు చేస్తున్నారు. పేదలను నుంచి భూములు లాక్కుంటున్నారు. వారిని భయపెడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం చేస్తున్నారు. ప్రజల భూములను లాక్కోవడం కన్నా, ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడం సులువు అని తెలుసుకున్నారు. రియల్‌ వ్యాపారం పేరుతో అధికాలను చేతుల్లో పెట్టుకొని ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అలా ప్రభుత్వ భూములు కొన్ని లక్షల ఎకరాలు స్వాహా చేశారంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు దేవాదాయ శాఖకు ఆసాములు, భూస్వాములే భూములు ఇచ్చేవారు. ఇప్పుడు రియల్‌ వ్యాపారులు వాటిని ఆక్రమించుకుంటున్నారు. ఆనాడు రాజులిచ్చిన ఇనాం భూములు అనేకం వున్నాయి. కాని ఇప్పుడు ఆ ఇనాం భూములను ఆక్రమించేవారు చాలా మంది తయారయ్యారు. దేవుడంటే భయం లేదు. ప్రభుత్వమంటే భయం లేదు. చట్టమంటే అసలే భయం లేదు. దేవుడి దగ్గర నుంచి మొదలు, అందర్నీ మేనేజ్‌ చేయొచ్చన్న ధైర్యం చేస్తున్నారు. కాసులుంటే దేవుడు సైతం సైడైపోతాడనుకుంటున్నారు. దేవుని మాన్యం దోచుకోడం అంటే మాటలు కాదు. అసలు ప్రభుత్వ భూముల అన్యాక్రాంతమే పెద్ద నేరం. మరి అలాంటి నేరాలు చేసినవారికి శిక్షలుంటాయని తెలుసు. అయినా ఎక్కడైనా ఆగుతుందా? ఆగిందా? గత పదేళ్ల కాలంలో తెలంగాణలో కొన్ని వేల ఎకరాల దేవాదాయ శాఖ భూములు మాయమయ్యాయి. వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఆఖరుకు పేదల కోసం భూదానోద్యమంలో పేదలకు ఇచ్చిన భూములను కూడా రియల్‌ వ్యాపారులు వదలడం లేదు. అలా భూదాన్‌ భూములను తమ భూములుగా మార్చుకొని కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తున్న పెద్దమనుషులు అనేక మంది వున్నారు. అలాంటివారు రాజకీయ నాయకులకు ఆప్తులు. ప్రభుత్వ అధికారులకు బంధువులు. కొనుగోలు దారులకు నమ్మకస్తులు. రియల్‌ వ్యాపారానికి ప్రభుత్వ భూములు సొంతంచేసుకున్నవాళ్లే కల్పతరువులు. ఇదీ మన వ్యవస్ధ. దుర్మార్గానికి అంగీ లాగు తొడితే ఎలా వుంటుందో అంత అందంగా వుంటుంది. ఆ వ్యాపారం అంత చక్కగా సాగుతుంది. ప్రజలు కూడా భూములను నమ్ముకొని పెట్టుబడులు పెడితే పది కాలలకు పది రెట్లు పెరుగుతుందన్న ఆశతో భూములు కొంటున్నారు. వ్యాపారులు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడున్నాయో తెలుసుకొని, వాటిని రిజిస్ట్రార్లను గుప్పిట్లో పెట్టుకొని రాయించుకొని అమ్ముకుంటున్నారు.
తెలంగాణలో జరుగుతుంది? ఇదీ!! అని గత నాలుగైదేళ్లుగా నేటిధాత్రి అనేక కథనాలు రాసింది.
కాని ప్రభుత్వం కదల్లేదు. ఉన్నతాధికారులు దృష్టిపెట్టలేదు. భూములు ధరలు పెరగడం తెలంగాణకు గొప్పకు నిదర్శనమనుకున్నారు. అయితే నిజంగానే తెలంగాణలో భూముల ధరలు పెరుగుతున్నాయా? అక్రమార్కులు ఆక్రమించుకున్న భూములను సొమ్ము చేసుకునేందుకు, చేతులు దులిపేసుకునేందుకు చేస్తున్నారా? అన్నది పట్టించుకోలేదు. నేటిధాత్రి ఎన్ని వార్తలు రాసినా స్పందించిన పాపాన పోలేదు. కొత్త ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గతంలో ఆయన కూడా భూముల అన్యాక్రాంతం గురించి పదే పదే మాట్లాడేవారు. ఆయనే ముఖ్యమంత్రి కావడంతో తీగలు కదిలిస్తున్నారు…భూముల డొంక కదిలిస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలంగాణలోని దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల వివరాలు, ప్రస్తుతం వున్న భూములు, అన్యాక్రాంతమైన భూముల పూర్తి వివరాలు సేకరించాలని, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలనీ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. గత ప్రభుత్వం లాగానే కళ్లు మూసుకొని రేవంత్‌ ప్రభుత్వం కూడా వుంటుందని అనుకున్నారు. కాని ముఖ్యమంత్రి కొరడా రaులిపించేందుకే సిద్దమయ్యారని స్పష్టంగా అర్ధమౌతోంది. వ్యవస్ధలను నిర్వీర్యం చేసిన వారెవరినీ ఆయన వదలకుండా ఒక్కొక్క శాఖ ప్రక్షాళన కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు భూముల లెక్కల వంతు వచ్చింది. వాటి లెక్కలు తేల్చే పనిలో పడ్డారు.
ఎంత దుర్మార్గమంటే ప్రపంచమంతా కరోనా కాలంలో విలవిలలాడుతూ భయం గుప్పిట్లో ప్రజలు బతికారు. అసలు ఎవరు బతుకుతారు?
ఎవరు పోతారన్నది తెలియనంత గడ్డు కాలాన్ని అనుభవించాం. అయితే ఒక దశ దాటిన తర్వాత ప్రభుత్వానికి ఆదాయం సమకూరడం తక్కువైంది. దాంతో నిత్యం కనీసం రిజిస్ట్రేషన్ల ఆదాయాం పెరగాలని అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు రియల్‌ వ్యాపారులకు, రిజిస్ట్రేషన్‌ అధికారులకు బాగా కలిసొచ్చింది. దాంతో జనమంతా ఇళ్లలో వుంటే, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములున్నాయన్న లెక్కలు తేల్చుకుంటూ, వాటిని ఆక్రమించుకుంటూ భూముల చెరబట్టిన దుశ్శాసనులు కొన్ని వందల మంది వున్నారు. వారికి రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులతోపాటు, రిజిస్ట్రేషన్‌ అధికారులు సహకరించారు. అలా భూముల వివరాలు అందించి, వాటిని రిజిస్ట్రేషన్లు చేశారు. రియల్‌ వ్యాపారులకు సహకరించారు. ఇదిలా వుంటే కరోనా భయంలో ప్రజలు బైటకు రాకుండా వారి బాధలు వారు పడుతుంటే, విలువైన ఎంతో మంది పేదల భూములను రాత్రికి రాత్రి ఎవరికీ తెలియకుండా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అలా దళితుల అసైండ్‌ భూములను ఎంతో మంది నాయకులు కూడా గత ప్రభుత్వ హయాంలో ఆక్రమించుకున్నారు. రిజిస్రేషన్లు చేయించుకున్నారు. మా భూములని వచ్చిన దళితుల మీద దాడులు చేశారు. పైగా పోలీసుల సహకారంతో బాదితులపైనే కేసులు నమోదు చేశారు. వారిని శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేశారు. ఎంతో మంది భయంతో తమకు జరిగిన అన్యాయాల గురించి బైటకు చెప్పుకోలేక , మనోవేధనతో మరిణించినవారు కూడా వున్నారు. అయినా కనికరంలేని భూ కబ్జాదారులు వారి ఆక్రమణలు ఎక్కడా ఆపలేదు. హైదరాబాద్‌ లాంటి మహానగరంలో దళితుల అసైండ్‌ భూములు లాక్కొని అప్పార్టుమెంట్లు కట్టినవాళ్లున్నారు. అలాంటి విషయాలు అనేకం నేటిధాత్రి వెలుగులోకి తెచ్చింది. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. అయినా ఆనాడు ఎవరూ కదల్లేదు. పైగా భూముల ఆమ్రణదారులకు సహకరిస్తూ హైదరాబాద్‌ నుంచి మొదలు ఆదిలాబాద్‌ అటవీ భూముల దాక, మహబూబ్‌నగర్‌ నుంచి ఖమ్మందాకా ఎక్కడ ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు. చిన్న చిన్న లంచాలు తీసుకొని అబాసు పాలు కావడం, ఏబిసి వారికి పట్టుబడం కన్నా, రియల్‌ వ్యాపారులకు సహకరించి, ప్రభుత్వ భూముల వివరాలు అందించి, వారిచ్చే పెద్దమొత్తం వెనకేసుకుంటే జీవితానికి సరిపడ ఆస్ధులు సంపాదించుకోవచ్చ ఆశలతో అధికారులు సహరించారు. దాంతో ప్రభుత్వ భూములు, ఇనాం భూములు, దేవాదాయ భూములు, భూదాన్‌ భూములు, అటవీ భూముల, ఆఖరుకు దళితులకు ప్రభుత్వం ఇచ్చిన అసైండ్‌భూములను కూడా వదల్లేదు. ఇందులో కీలకపాత్ర రిజిస్ట్రార్లదే..రాత్రికి రాత్రి, అర్ధరాత్రుల దాకా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో తిష్ట వేసి, వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను దారాదత్తం చేశారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుతున్నామన్న కలరింగ్‌లో తమ ఆస్ధులు వందల రెట్లు పెంచుకున్నారు. వాళ్లు కూడా వందల కోట్ల కోట్ల రూపాయలు సంపాదించారు. అలా సంపాదించిన వారిలో ఇటీవల కూడా కొందరు పట్టుబడ్డారు. ఇంకా లోతైన తవ్వకాలు జరిగితే, ఎంతో మంది రిజిస్ట్రార్ల బాగోతాలు బైట పడతాయి. రెవిన్యూ అధికారుల అసలు రూపాలు వెలుగులోకి వస్తాయి. భూములు ఆక్రమించుకున్నవారి నుంచి దోచుకొని, ఆక్రమించుకున్న వాటిని కక్కించే అవకాశం వుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *