రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పార్లమెంటులో తన సహచర ఎంపీలతో కలిసి ఫోటో సెషన్ లో పాల్గొన్నారు.పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే.కాగా, సోమవారం పార్లమెంట్ పాత భవనంలో సమావేశాలు జరుగగా, మంగళవారం (ఈరోజు)నూతన నిర్మాణంలో ఉభయ సభలు సమావేశమవుతాయి.ఈ సందర్భంగా ఫోటో సెషన్ ఏర్పాటు చేయగా ఉభయ సభలకు చెందిన ఎంపీలు హాజరయ్యారు.