Headlines

యదేచ్చగా మట్టి తవ్వకాలు.. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత!

తరలిపోతున్న….. పట్టించుకోరా!

రైతుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలోని పెద్దకోడపాక గ్రామంలో పరిమితికి మించి మట్టి తవ్వకాలను జరుపు తున్నారు. ఈ మట్టి తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని డివైఎఫ్ఐ ఎబిఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది. అనంతరం మంద సురేష్, నాగుల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మైదాం కుంటలో ఇదివరకే ఒక కాంట్రాక్టర్ అధికంగా తవ్వకాలు జరిపారని మళ్ళీ అదే కుంటలో తవ్వకాలు జరుపుతున్నారని దానికి ఇరిగేషన్ అధికారులు పర్మిషన్ ఇచ్చారంటున్నారని. ఇలా కుంటల్లో తవ్వకాలు జరపడానికి కాంట్రాక్టర్ కి పర్మిషన్ ఇవ్వడం వెనుకాల అంతర్యామేమిటో తెలియట్లేదనిఅన్నారు.తవ్వాకాలకు పర్మిషన్ ఇచ్చిన 3 ఫీట్ ల వరకే ఇస్తారని కానీ 10 ఫీట్ ల మేరకు తవ్వుతున్నారని అన్నారు. అదే మైదాం కుంటా నుండి రైతులు రాకపోకలు సాగిస్తున్న దారి పక్కనే ఈ తవ్వకాలు జరపడం వల్ల పశువులు,రైతులు మృత్యు వాత పడే అవకాశం ఉందని అన్నారు. అలాగే రాత్రి వేళల్లో మొరoని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటు న్నారని అన్నారు ఇలాంటివి జరగకుండా డిప్యూటీ ఇంజినీర్ మైదాం కుంటను సందర్శించి ఎంత మేర మట్టి తవ్వకాలు జరుగుతున్నాయో చూడాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి త్వరగా తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాజు సురేష్ రమేష్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *