Free Eye Medical Camp
మార్కండేయ కాలనీలో ఉచిత నేత్ర వైద్య శిబిరం
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని మార్కండేయ కాలనీలో శరత్ మాక్స్ విజన్ ఆధ్వర్యంలో ఆప్తమాలజిస్ట్ మమత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 50 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆప్తమాలజిస్ట్ మమత మాట్లాడుతూ చాలావరకు వయసు పైబడిన వారు కంటికి సంబంధించిన క్యాట్రాక్ట్, టెరీజియం,చూపు మందగించుట,రెటీనా వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. పేదవారికి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్ ఎర్ర పల్లవి, మార్కండేయ కాలనీ అధ్యక్షులు పెండెం శివానంద్, సలహాదారులు జడల శ్రీనివాస్,
పెండెం రాజేశ్వరి తో పాటు పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.
