రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
జనవరి 5,6,7 తేదీలలో హైదరాబాద్ లో జరిగే డిహెచ్పిఎస్ జాతీయ మహాసభల విజయవంతం కొరకు డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి దేవీ పోచన్న ఆధ్వర్యంలో విరాళాల సేకరణ నిర్వహించారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య సమక్షంలో విరాళాల సేకరణ ప్రారంభించడం జరిగిందని అన్నారు .దేశవ్యాప్తంగా దళితులకు ఆర్థిక ,రాజకీయ, సామాజిక హక్కుల పరిరక్షణ కొరకు కుల వివక్షత, కుల నిర్మూలన కొరకు, ఎస్సీ సప్లై దేశవ్యాప్తంగా అమలు చేయాలని, దళితుల అభివృద్ధికి కేటాయించిన నిధులు దారి మళ్ళించకుండా స్వయం ఉపాధి పథకాలు అమలు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు, భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు హైదరాబాదులో జరిగే రెండవ జాతీయ మహాసభలను విజయవంతం చేసేందుకు విరాళాలు సేకరిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి దేవి పోచన్న తెలిపారు. విరాళాలు సేకరిస్తున్న నేపథ్యంలో కార్మికులు ప్రజలు వ్యాపార వర్గాలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మారేపల్లి రవి, పిఎన్ఎమ్ రాష్ట్ర సమితి సభ్యులు మామిడి గోపి, ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు మొగిలి, లక్ష్మన్ లు పాల్గొన్నారు.