కొడుకు ఎంట్రీపై విష్ణు ఎమోషనల్ పోస్ట్.

కొడుకు ఎంట్రీపై విష్ణు ఎమోషనల్ పోస్ట్

 

 

 

 

మోహన్ బాబు, విష్ణు, అతని పిల్లలు కలిసి నటించిన సినిమా ‘కన్నప్ప’.

 

ఆ రకంగా మంచు కుటుంబానికి చెందిన మూడు తరాల నటీనటులను డైరెక్ట్ చేసే ఛాన్స్ ముఖేష్ కుమార్ సింగ్ కు లభించింది.

మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) జూన్ 27న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో రాబోతోంది.

 

అందులో మోహన్ బాబు (Mohan babu) తో పాటు మోహన్ లాల్ (Mohan Lal), శరత్ కుమార్, అక్షయ్ కుమార్, ప్రభాస్ కీలక పాత్రలను పోషించారు.

 

ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటించిన

 

ఈ సినిమాలో మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానాతో పాటు కొడుకు అవ్రామ్ సైతం చిన్నప్పటి తిన్నడుగా తెర మీద మెరిశాడు.

‘కన్నప్ప’ సినిమాలో విష్ణు తిన్నడు పాత్రను పోషించాడు. గూడెంలోని మూఢాచారాల కారణంగా దేవుడంటే ఇష్టం లేని తిన్నడు…

 

చివరకు శివయ్యకు ఎలా దాసోహమయ్యాడు…

తన ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి ఎలా సిద్థమయ్యాడు అనేదే ‘కన్నప్ప’ చిత్రం.

ఇందులో చిన్నప్పటి తిన్నడుగా అవ్రామ్ నటించాడు.

అతని మీద కూడా కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు ముఖేశ్‌ కుమార్ సింగ్ చిత్రీకరించాడు.

మోహన్ బాబు, విష్ణు, అతని కుమార్తెలు, కుమారుడు ఇందులో యాక్ట్ చేయడంతో మొత్తం మూడు తరాలను కవర్ చేసినట్టు అయ్యింది.

ఇదో రేర్ ఫీట్.

ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంటూనే విష్ణు…

తాజాగా అవ్రామ్ షూటింగ్ సమయంలో చేసిన చిలిపి పనులను, అతని పై చిత్రీకరించిన సన్నివేశాలకు సంబంధించిన సీన్స్ ను ఓ మేకింగ్ వీడియోగా చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

‘కన్నప్ప’తో నా తనయుడు అవ్రామ్ తెరంగేట్రం చేస్తున్నారు.

అవ్రామ్ సెట్‌లోకి అడుగు పెట్టడం, కెమెరా ఎదుట నిల్చోవడం, డైలాగ్స్ చెప్పడం…

ఇలా ప్రతీదీ నా జీవితంలో భావోద్వేగపూరితమైన క్షణాలు.

ఓ తండ్రిగా, ఒకప్పుడు నేను కలలుగన్న అదే ప్రపంచంలోకి నా తనయుడు అడుగు పెట్టడం చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది.

ఈ క్షణంలో నేను అనుభవిస్తున్న ఆనందానికి ఏదీ సాటి రాదు.

ఇది అవ్రామ్ తెరంగేట్రం మాత్రమే కాదు..

నా జీవితాంతం గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకం.

నాపై చూపించిన ప్రేమాభిమానాలే నా కుమారుడిపైనా చూపిస్తారని భావిస్తున్నాను.

 

అవ్రామ్ ప్రయాణం ‘కన్నప్ప’తో మొదలైంది’ అని విష్ణు ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు.

విరాటపాలెం.. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ట్రైల‌ర్.

విరాటపాలెం.. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ట్రైల‌ర్

 

 

 

 

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేంద‌కు ఓ స్ట్రెయిట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ సిద్ద‌మ‌వుతోంది.

చాలా రోజుల త‌ర్వాత స్ట్రెయిట్ తెలుగులో ఓ వెబ్ సిరీస్ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ (Viraatapalem) స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది. అదీ కూడా అరుదుగా వ‌చ్చే సూపర్ నేచురల్ థ్రిల్లర్ జాన‌ర్‌లో వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో రెక్కీ (Recce) అనే క్రైమ్ థ్రిల్ల‌ర్ సిరీస్‌ను అందించిన మేక‌ర్స్ ఈ సిరీస్‌ను రూపొందించ‌గా తాజాగా దీని ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

గ‌తంలో డిస్నీలో వ‌చ్చిన మిస్ ఫ‌ర్‌ఫెక్ట్ సిరీస్ ఫేమ్‌ అభిజ్ఞ వూతలూరు (Abhignya Vuthaluru), చరణ్ లక్కరాజు (Charan Lakkaraju) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌గా కృష్ణ పోలూరు (Poluru Krishna) దర్శకత్వం వ‌హించారు. జూన్ 27 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవ‌నుంది.

పాపా నిర్మాతల స్ట్రయిట్ తెలుగు సినిమా.

పాపా నిర్మాతల స్ట్రయిట్ తెలుగు సినిమా

 

 

 

తమిళ అనువాద చిత్రం ‘పాపా’ గత శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని నిర్మాత నీరజ కోట తెలిపారు.

 

తమిళంలో చక్కని విజయాన్ని సాధించిన ‘దా దా’ (Dada) చిత్రాన్ని తెలుగులో ‘పా పా’ (Paapa) పేరుతో డబ్ చేసి గత శుక్రవారం విడుదల చేశారు నిర్మాత నీరజ కోట (Neeraja Kota). జె. కె. ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ‘పా పా’ మూవీని రెండు తెలుగు రాష్ట్రాలలో 236 థియేటర్లలో విడుదల చేశారు. విడుదలైన అన్ని కేంద్రాల నుండి మూవీకి పాజిటివ్ టాక్ వస్తోందని నిర్మాత నీరజ కోట తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ తో మూవీ ప్రదర్శితమౌతున్న సంధ్య థియేటర్లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.

‘పా… పా’ గురించి నీరజ కోన మాట్లాడుతూ, ‘మేం చిత్ర సీమలోకి ఈ సినిమాతోనే అడుగుపెట్టాం. కవిన్ (Kavin), అపర్ణాదాస్ (Aparna Das) జంటగా నటించిన ఈ సినిమాలో భాగ్యరాజా, వీటీవీ గణేశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ ఫీల్ గుడ్ మూవీ తమిళంలో పెద్ద విజయాన్ని సాధించింది. తెలుగు వారూ ఈ సినిమాను ఆదరిస్తారనే నమ్మకంతో డబ్ చేశాం. మా నమ్మకం వమ్ము కాలేదు. ఈ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. గణేశ్‌ కె బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో చూసిన వారు స్ట్రయిట్ మూవీ చూసిన అనుభూతి కలుగుతోందని చెప్పడం మాకు సంతోషాన్ని కలిగిస్తోంది.

కెవిన్, అపర్ణా దాస్ పాత్రల మధ్య కెమిస్ట్రీ, కాన్ ఫ్లిక్ట్ బాగా వర్కౌట్ అయ్యిందని ప్రేక్షకులు చెబుతున్నారు’ అని అన్నారు. ‘పా… పా…’ మూవీ విజయం అందించిన స్ఫూర్తితో త్వరలో ఓ స్ట్రయిట్ తెలుగు సినిమా నిర్మించాలనుకుంటున్నామని ఆమె అన్నారు. జెన్ మార్టిన్ సంగీతానికి, ఎలిల్ అరసు సినిమాటోగ్రఫీకి కూడా మంచి పేరు వచ్చిందని ఆమె చెప్పారు. ఈ సక్సెస్ మీట్ లో ఎన్నారై శశికాంత్, ఈ చిత్రాన్ని ఎం.జి.ఎం. మూవీస్ ద్వారా విడుదల చేసిన ఎమ్. అచ్చిరెడ్డి, బిజినెస్ కో-ఆర్డినేటర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

 ఓటీటీలో మాధవన్ మూవీ ఎప్పటి నుండంటే…

 ఓటీటీలో మాధవన్ మూవీ ఎప్పటి నుండంటే…

 

 

 


వైవిధ్యమైన పాత్రలు చేస్తూ నటుడిగా గుర్తింపు తెచ్చకున్న మాధవన్ చాలా కాలం తర్వాత మరోసారి రొమాంటిక్ మూవీ చేస్తున్నాడు.

 

ఫాతిమా సనా షేక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

 

ప్రముఖ నటుడు మాధవన్ (Madhava) కు గతంలో రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉండేది.

కానీ కొంతకాలంగా అందుకు భిన్నమైన పాత్రలను చేస్తున్నాడు.

కొన్ని హిందీ సినిమాలలో ప్రతినాయకుడి పాత్రలు చేయడానికి కూడా మాధవన్ వెనుకాడలేదు.

 

తెలుగులో ఆ మధ్య వచ్చిన అనుష్క ‘నిశ్శబ్దం’ (Nishabdham) లో అలాంటి భిన్నమైన పాత్రనే మాధవన్ చేశాడు.

సైంటిస్ట్ నంబి నారాయణన్ బయోపిక్ ‘రాకెట్రీ’ (Rocketry) తో మాధవన్ దర్శకుడిగానూ మారిపోయాడు.

ఆ బయోపిక్ అతనికి నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

అలానే గత యేడాది మాధవన్ నటించిన ‘సైతాన్’ (Saitaan) కూడా కమర్షియల్ హిట్ అయ్యి, మాధవన్ లోని నటుడిని వెలికి తీసింది.

ఈ యేడాది ఇప్పటికే మాధవన్ నటించిన ‘హిసాబ్ బరాబర్,’ ‘టెస్ట్’ చిత్రాలు వచ్చాయి.

అయితే ఈ రెండు కూడా ఓటీటీలోనే విడుదల కావడం విశేషం.

ఇక అక్షయ్ కుమార్ తో కలిసి మాధవన్ నటించిన కోర్ట్ డ్రామా ‘కేసరి చాప్టర్ 2’ థియేటర్లలో సందడి చేసింది.

తాజాగా మాధవన్ నటించి మరో చిత్రం ‘ఆప్ జైసా కోయి’ మూవీ సైతం ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.

ఈ సినిమాలో మాధవన్ సరసన ఫాతిమా సనా షేక్ నటిస్తోంది.

మాధవన్ ఈ రొమాంటిక్ లవ్ డ్రామాలో సంస్కృతం లెక్చరర్ గా నటిస్తుంటే, సనా ఫ్రెంచ్ టీచర్ పాత్రను పోషిస్తోంది.

రెండు భిన్న ధృవాలకు చెందిన వీరిద్దరూ కలిసి జీవితం సాగించాల్సి వచ్చినప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నదే ‘ఆప్ జైసా కోయీ’ సినిమా.

 

ధర్మా ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాను వివేక్ సోని డైరెక్ట్ చేశారు.

 

ఇది జూలై 11 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యే చిత్రమిది.

ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యే చిత్రమిది

 

 

 

 

అనంతిక సునీల్‌కుమార్‌ లీడ్‌రోల్‌ పోషించిన చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించారు. ఈనెల 20న విడుదలవుతున్న…

 

అనంతిక సునీల్‌కుమార్‌ లీడ్‌రోల్‌ పోషించిన చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించారు. ఈనెల 20న విడుదలవుతున్న సందర్భంగా చిత్రబృందం ఇటీవలే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను నిర్వహించింది. ఈ సందర్భంగా రవిశంకర్‌ మాట్లాడుతూ ‘సినిమా విజువల్‌గా చాలా బాగుంది. ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యే చిత్రమిది. ఒక అమ్మాయి జీవిత ప్రయాణమే ‘8 వసంతాలు’ సినిమాగా మీ ముందుకొస్తోంది. తప్పకుండా మీకు నచ్చుతుంది’ అన్నారు. ‘ఇది చాలా డిఫరెంట్‌ మూవీ. కథ బాగా నచ్చి మేము చేసిన ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని నవీన్‌ యెర్నేని అన్నారు. ఫణీంద్ర నర్సెట్టి మాట్లాడుతూ ‘మా నిర్మాతలు ఒక మంచి కథతో వస్తే సినిమా తీస్తారు అనే దానికి మా ‘8 వసంతాలు’ చిత్రం ఓ నిదర్శనం. ఈ సినిమాతో ఒక మంచి చిత్రాన్ని నిర్మించారనే పేరు వారికి వస్తుంది. అనంతిక నటన ఈ చిత్రానికి ప్రత్యేకాకర్షణ’ అని అన్నారు. అనంతిక మాట్లాడుతూ ‘మైత్రీ లాంటి పెద్ద నిర్మాణ సంస్థలో సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది. ఫణీంద్ర గారి వల్ల ఈ సినిమాలో ఒక బలమైన పాత్రను చేశాను. ఇది నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం’ అన్నారు.

మహేశ్‌ సినిమా… ఎంతైనా తగ్గేదేలే..

మహేశ్‌ సినిమా… ఎంతైనా తగ్గేదేలే..

 

 

 

 

గుణశేఖర్‌ తర్వాత అలా భారీతనంతో సెట్స్‌ వేయడంలో రాజమౌళి (SS Rajamouli) ఘనాపాటి. అయితే ఆయనకు ఆర్థిక వనరుల దృష్య్టా ఎలాంటి సమస్య లేదు. బెస్ట్‌ అవుట్‌పుట్‌ కోసం ఆయన ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడరు

 

బాలీవుడ్‌లో భారీ కాన్వాస్‌ కథలు, సెట్లు, కళాత్మక పంథాలో చిత్రాలను తెరకెక్కించడం అంటే గుర్తొచ్చే పేరు సంజయ్‌ లీలా భన్సాలీ(Sanjay Leela Bhansali).

దేవదాస్‌ సినిమా కోసం ఏకంగా 50 కోట్ల బడ్జెట్‌తో భారీ సెట్‌ నిర్మించారని అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు.

అది తెరపై కనిపించింది.

ఆయన తీసే సినిమా బడ్జెట్‌లో 15 నుంచి 35 కోట్లు సెట్స్‌ కోసం ఖర్చవుతుంది.

బాజీరావు మస్తానీ, ప్రేమ్‌ రతన్‌ ధన్‌ సాయో, రామ్‌ లీలా, హీరామండి ఇవన్నీ ఆ కోవకు చెందినవే.

అలాగే టాలీవుడ్‌ అలా భారీ సెట్స్‌ వేసే అలవాటు దర్శకుడు గుణశేఖర్‌కు (Guna sekhar) ఉంది.

ఎందుకంటే ఆయన ఎంచుకునే కథల స్పాన్‌ అలా ఉంటుంది.

ఒక్కడు, వరుడు సహా చాలా సినిమాలకు గుణశేఖర్‌ భారీతనంతో నిండిన సెట్స్‌కు కోట్లు ఖర్చు చేశారు.

రుద్రమదేవి లాంటి సినిమా కోసం పూర్తి స్థాయి బడ్జెట్‌ లభించకపోవడంతో ఆ సినిమా అవుట్‌పుట్‌ కాస్త డల్‌గా వచ్చింది.

ఆయన తర్వాత అలా భారీతనంతో సెట్స్‌ వేయడంలో రాజమౌళి (SS Rajamouli) ఘనాపాటి.

అయితే ఆయనకు ఆర్థిక వనరుల దృష్య్టా ఎలాంటి సమస్య లేదు.

బెస్ట్‌ అవుట్‌పుట్‌ కోసం ఆయన ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడరు.

ఇప్పుడు మహేశ్‌ సినిమా కోసం భారీ సెట్స్‌ నిర్మిస్తున్నారని తెలిసింది.

ప్రస్తుతం ఆయన మహేష్‌ కథానాయకుడిగా ఎస్‌ఎస్‌ఎంబీ 29 (SSMB 29) తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే! ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వారణాసిలో కీలక షెడ్యూల్‌ చేయాలట.

నిజానికి గంగానది ఒడ్డున రియల్‌ లొకేషన్లలో ఇలాంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించాలంటే సవాల్‌తో కూడిన విషయమే!  

పోలీసుల నుంచి అనుమతులు పొందడం అంత సులువు కాదు.

దాంతోపాటు ప్రజలు,  ప్రజల నుంచి చాలా ఇబ్బందులు తలెత్తుతాయి.

అది కష్టంతో కూడిన పని కావడంతో రాజమౌళి వారణాసిని తలపించే భారీ సెట్‌ని నిర్మించాలని ప్లాన్‌ చేసినట్టు తెలిసింది.

వారణాసిలో దేవాలయాలు, ఘాట్‌లతో ఆధ్యాత్మికత నిండిన ప్రాంతంగా ఉంటుంది.

అలాంటి నగరాన్ని నిర్మించాలనే ఆలోచన సవాళ్లతో కూడుకున్నదే! తెరపై ఒరిజినాలిటీ చూపించాలి.

దాని కోసం రాజమౌళి టీమ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌తో కసరత్తులు చేస్తున్నారని తెలిసింది.

  పర్వతాలలో సంజీవని వనమూలికలు వెతకడానికి వెళ్ళిన హనుమంతుడు స్ఫూర్తితో ఈ కథను రూపొందించారని తెలుస్తోంది.

దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో నిర్మాత కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రియాంక చోప్రా కథానాయిక.

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. 

చిరంజీవి పాటకు భీమ్స్ ట్యూన్.

చిరంజీవి పాటకు భీమ్స్ ట్యూన్

 

 

 

 

 

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా గురించి వార్తలు విశేషంగా వినిపిస్తున్నాయి- కానీ, ఆ మూవీ రిలీజ్ డేట్ మాత్రం తెలియడం లేదు.. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కు భీమ్స్ ట్యూన్స్ అందిస్తూ ఉండడం ఇప్పుడు విశేషంగా మారింది.

 

మొదటి నుంచీ ప్రతిభ ఎక్కడ ఉన్నా ప్రోత్సహిస్తూ సాగుతున్నారు చిరంజీవి…

ఆయన రీ ఎంట్రీ తరువాత ‘ఖైదీ నంబర్ 150’, ‘వాల్తేరు వీరయ్య’ మినహాయిస్తే మిగిలిన నాలుగు సినిమాలు అంతగా అలరించలేకపోయాయి…

‘భోళాశంకర్’ పరాజయం చిరంజీవి ఫ్యాన్స్ కు నిరాశ కలిగించింది…

దాంతో ‘విశ్వంభర’ ద్వారా అభిమానులకు ఆనందం పంచే దిశగా సాగుతున్నారు చిరంజీవి.

యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేసే చిరంజీవి ఈ సినిమాలో డైరెక్టర్ మల్లిడి వశిష్ఠకు ఛాన్స్ ఇచ్చారు…

అతను కూడా శక్తివంచన లేకుండా ‘విశ్వంభర’ను రూపొందించారు…

ఓ పాట మినహా ‘విశ్వంభర’ పూర్తయింది…

ఈ సాంగ్ ఐటమ్ నంబర్ గా రూపొందనుంది… .

ఇందులో చిరంజీవితో చిందేసే ముద్దుగుమ్మ కోసం అన్వేషణ సాగుతోంది…

ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు…

ఆయన ‘హరిహర వీరమల్లు’ సినిమా రీ-రికార్డింగ్ లో బిజీగా ఉన్నారు…

అందువల్ల ఈ ఐటమ్ నంబర్ కు మాత్రం భీమ్స్ సిసిరోలియో ట్యూన్స్ ఎంచుకున్నారట…

ఈ యేడాది బంపర్ హిట్ గా నిలచిన ‘సంక్రాంతికి వస్తున్నాం’కు భీమ్స్ సిసిరోలియో ట్యూన్స్ భలేగా పనిచేశాయి…

ఈ చిత్రంలోని పాటలు మాస్, క్లాస్ అన్న తేడాలేకుండా అందరినీ ఆకట్టుకుంటున్నాయి…

చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రానికి కూడా భీమ్స్ స్వరకల్పన చేస్తున్నారు…

ఈ నేపథ్యంలోనే ‘విశ్వంభర’ చిత్రంలోని ఐటమ్ నంబర్ కు భీమ్స్ బాణీలు ఉపయోగించుకోవాలని చిరంజీవి, దర్శకుడు వశిష్ఠ నిర్ణయించారు…

చిరంజీవి సినిమాలో ఐటమ్ నంబర్ అంటే ఇరగదీసేలా ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు…

మరి వారి అంచనాలకు తగ్గట్టుగానే భీమ్స్ బాణీలు ఉంటాయని టాక్!

అప్పుడలా… ఇప్పుడిలా…

దాదాపు 21 సంవత్సరాల క్రితం చిరంజీవి ‘అంజి’ సినిమా అప్పట్లో జనాల్లో విశేషమైన క్రేజ్ క్రియేట్ చేసింది…

ఆ సినిమాకు ముందు శ్రీ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నారు…

ఓ పాటను కూడా చిత్రీకరించారు…

తరువాత పలు మార్పులు జరిగి, మణిశర్మ బాణీలతోనే ‘అంజి’ రిలీజయింది…

అప్పట్లో గ్రాఫిక్స్ తో ‘అంజి’ అలరించే ప్రయత్నం చేసింది…

ఇప్పుడు ‘విశ్వంభర’లోనూ జీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంది…

అంతేకాదు, ‘విశ్వంభర’ విడుదలలోనూ జాప్యం జరుగుతోంది…

అయితే అప్పుడు శ్రీ స్థానంలో మణిశర్మ వచ్చి ఒక పాట మినహా అన్నీ పూర్తి చేశారు…

ఇప్పుడు కీరవాణి బిజీ వల్ల భీమ్స్ వచ్చి ఓ పాటకు ట్యూన్స్ కడుతున్నారు…

ఏది ఏమైనా చివరగా మిగిలిన పాట పూర్తయితే ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారు.

మరి కీరవాణికి బదులుగా ఓ పాటకు బాణీలు కడుతున్న భీమ్స్ ఈ ఐటమ్ నంబర్ ను ఎలా రూపొందిస్తారో చూడాలి.

మాట తీసుకున్నాడు.. మరోసారి చేయబోతున్నాడట..

మాట తీసుకున్నాడు.. మరోసారి చేయబోతున్నాడట..

 

 

 

 

పవన్‌ కళ్యాణ్ కొత్త కథలు వింటున్నట్లు టాక్‌ నడుస్తోంది. ఆయనతో హిట్ సినిమా తీసిన  దర్శకుడితో మరోసారి సినిమా చేయబోతున్నాడని  తెల్సింది  

 

పవన్‌ కల్యాణ్‌ ‘హరి హర వీరమల్ల్లు’ సినిమా చిత్రీకరణ పూర్తి చేశారు. ‘ఓజీ’కీ కూడా  కాల్షీటు ఇచ్చారు. త్వరలోనే ఆ చిత్రం కూడా పూర్తికానుందని మేకర్స్‌ వెల్లడించారు. ఇంకో వైపు హరీశ్‌ శంకర్‌ కూడా ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ షూటింగ్‌ షురూ చేశారు. ఈసినిమా సెట్‌లోనూ పవన్‌ పాల్గొంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్‌ కొత్త కథలు వింటున్నట్లు టాక్‌ నడుస్తోంది. ఆయనతో ‘బ్రో’ చిత్రం తీసిన తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని పవన్‌తో మరో సినిమా చేయాలనుందని ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయితే ఇటీవల సముద్రఖని పవన్‌కు ఓ కథ చెప్పారట.

ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ‘బ్రో’ సినిమా వచ్చింది. పవన్‌ ఫ్యాన్స్‌ను మెప్పించిన సినిమా అది. అప్పట్లోనే పవన్‌ సముద్రఖనితో ఓ సినిమా చేస్తానని మాటిచ్చారట. ఇప్పుడు అది పట్టాలెక్కబోతోందని తెలిసింది. పవన్‌కు ఇప్పటికే కొంతమంది నిర్మాతలు అడ్వాన్స్‌ ఇచ్చారు. ఆయన పార్టీ పనులతో బిజీ కావడం, సినిమాలకు కొంత గ్యాప్‌ ఇవ్వంతో కొందరికి అడ్వాన్స్‌లు తిరిగి ఇచ్చేశారు. అందులో కొంత మందికి ఇవ్వాల్సి ఉంది. వారిలో ఓ నిర్మాత కోసం ఇప్పుడీ సినిమా చేయబోతున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. తక్కువ సమయంలో, లిమిటెడ్‌ బడ్జెట్‌ లో ఈ సినిమా ప్లాన్‌ చేశారట. ఇటీవల సముద్రఖని పవన్‌ని కలిసి కథ చెప్పేసినట్టు ఇన్‌ సైడ్‌ వర్గాల టాక్‌. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ పూర్తయిన తర్వాత ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం.

 

Kajol: రామోజీ ఫిల్మ్ సిటీ.. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన చోటు

Dhanush: ‘కుబేర’.. టచ్ చేసే పాట

 

Vishwambhara: చిరంజీవి పాటకు భీమ్స్ ట్యూన్

సేవాకార్యక్రమాలకే వినియోగం…

సేవాకార్యక్రమాలకే వినియోగం…

 

 

 

 

 

shine junior college

 

 

 

 

 

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. రఘుపతి వెంకయ్య అవార్డు సందర్భంగా తనకు లభించిన నగదు పారితోషికంలోని అధిక భాగాన్ని వివిధ సేవా సంస్థలకు విరాళంగా అందించారు.

 

 

 

 

 

 

గద్దర్ అవార్డులు (Gaddar Awards) పొందిన వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో నగదు బహుమతులనూ ఇచ్చింది. ఓ పక్క ఖజానా ఖాళీగా ఉందని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) దాదాపు 17 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి తెలంగాణ గద్దర్ అవార్డులను నిర్వహించాల్సిన అవసరం ఏమిటని కొందరు ప్రశ్నించారు కూడా! అలానే అవార్డులు అందుకున్న వారి అర్హతల మీద కొన్ని విమర్శలు వచ్చాయి.

 

 

 

 

 

 

ప్రముఖ నటుడు స్వర్గీయ కాంతారావు స్మారక అవార్డును విజయ్ దేవరకొండకు ఇవ్వడం పట్ల కొందరు విమర్శనాస్త్రాలు సంధించారు. నటీనటులకు ఆ అవార్డు ఇవ్వాలని అనుకున్న రాష్ట్ర ప్రభుత్వం సీనియర్స్ కు ఆ అవార్డును ఇస్తే బాగుండేదని, ఇప్పటికిప్పుడు విజయ్ దేవరకొండకు ఆ స్థాయి అవార్డు ఇవ్వాల్సిన అవసరం ఏముందని అన్నారు. అదే సమయంలో ఈ వేడుకకు కాంతారావు కుటుంబ సభ్యులను సరైన రీతిలో ఆహ్వానించలేదనే విమర్శలూ వచ్చాయి. కాంతారావు పేరుతో అవార్డు ఇస్తూ వారి కుటుంబ సభ్యులను గౌరవించకపోవడం సరైన పద్దతి కాదని కొందరు అన్నారు. అయితే అధికారులు కాంతారావు కుమారుడు రాజాను ఈ వేడుకకు పిలిచామని ఆయన కార్యక్రమానికి హాజరు కావడం కోసం వెయ్యి రూపాయలు టాక్సీ ఖర్చుగా ఇచ్చామని వివరణ ఇచ్చారట. ఆ చర్యను సైతం కొందరు తప్పుపట్టారు. టి.ఎల్. కాంతారావు కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కారు పంపి, వారిని గౌరవంగా వేదికకు తీసుకు రావాల్సింది పోయి రానూ పోనూ ఖర్చులకు డబ్బులు ఇచ్చామని చెప్పడం ఏమిటని కొందరు వాపోయారు.

 

 

 

 

 

 

 

ఇదిలా ఉంటే టి.ఎల్. కాంతారావు పేరుతో విజయ్ దేవరకొండకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల రూపాయలను అందించింది. ఆయన దానిని ఎలా, ఎందుకోసం ఖర్చు పెడతారనేది పక్కన పెడితే… ఇదే వేడుకలో రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్న ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ మాత్రం తన పెద్ద మనసును చాటుకున్నారు. రచయితగా ఆయన తనకు వస్తున్న రాయల్టీలో చాలా భాగాన్ని కొన్నేళ్ళుగా వివిధ సామాజిక, సేవా సంస్థలకు విరాళాల రూపంలో అందిస్తున్నారు. అలానే ఇప్పుడు కూడా రఘుపతి వెంకయ్య అవార్డును అందుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ‘ఇందులో అధిక మొత్తాన్ని వివిధ సేవా కార్యక్రమాలకు విరాళంగా అందిస్తాన’ని యండమూరి చెప్పారట.

 

 

 

 

 

 

ఆ మాటను నిలబెట్టుకుంటూ ఆయన కడపలోని ఆర్తి ఫౌండేషన్ కు మూడు లక్షల రూపాయలు, శ్రీకాకుళం పక్కనే ఉన్న అభయం ఫౌండేషన్ కు లక్ష రూపాయల చెక్కునూ పంపారు. నటుడు కాంతారావు కుమారుడు రాజా ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, ఇంటి అద్దె కట్టడానికి కూడా కష్టంగా ఉందనే విషయం యండమూరి దృష్టికి రావడంతో అతన్ని ఇంటికి పిలిచి లక్ష రూపాయలను యండమూరి అందించడం విశేషం.

 

 

 

 

 

ఇక్కడో చిన్న ఆసక్తికరమైన అంశం ఏమిటంటే… యండమూరి వీరేంద్రనాధ్‌ రాసిన ‘వెన్నెల్లో ఆడపిల్ల’ నవల అప్పట్లో యువతను ఓ ఊపు ఊపేసింది. అందులోని కథానాయకుడి పేరు… ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి పేరు ఒక్కటే… రేవంత్‌!!

యంగ్ హీరోస్ పరిస్థితేంటీ…

యంగ్ హీరోస్ పరిస్థితేంటీ…

 

 

 

 

 

 

 

 

 

shine junior college

 

 

 

 

 

 

 

 

 

 

మొన్నటి దాకా సందడి చేసిన టాలీవుడ్ యంగ్ హీరోస్ సడెన్ గా సైలెంట్ అయిపోయారు. హంగామా వద్దు – కష్టించడమే ముద్దు అనుకుంటున్నారు. మరి వీరిలో కష్టానికి ప్రతిఫలం దక్కించుకునే హీరోలెవరో చూద్దాం.

 

 

 

 

 

 

వెలుగు – చీకటి, కష్టం – సుఖం, మంచి – చెడు – ఎంత వ్యతిరేకమైనా పక్కపక్కనే ఉంటాయి. అదే తీరున నిశ్శబ్దం వెనకాలే శబ్దం కూడా చోటు చేసుకొని ఉంటుంది. ప్రస్తుతం ఓ గ్రాండ్ సక్సెస్ కోసం తపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోస్ (Tollywood Young Heros) అందరూ సైలెంట్ గానే కనిపిస్తున్నారు. తమ చిత్రాలతోనే సౌండ్ చేయాలని వీరు నిర్ణయించినట్టు అనిపిస్తోంది. అలాంటి వారిలో విశ్వక్ సేన్ (Vishwaksen), సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), వరుణ్ తేజ్ (Varun Tej), సుధీర్ బాబు (Sudheer Babu), ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) ఉన్నారు.

 

 

 

 

 

 

 

వీరందరూ ‘హంగామా వద్దు – కష్టపడడమే ముద్దు’ అనే సూత్రాన్ని నమ్మి సాగుతున్నట్లు అనిపిస్తోంది. ఆ మధ్య వరుస సినిమాలతో హంగామా చేసిన విశ్వక్ సేన్ తన తాజా చిత్రం ‘ఫంకీ’ని పూర్తి చేసే పనుల్లో ఉన్నారు. ఓ సారి సినిమా పూర్తయ్యాకే ‘ఫంకీ’ ప్రమోషన్స్ లో కనిపించాలని విశ్వక్ సేన్, ఆ సినిమా డైరెక్టర్ అనుదీప్ భావిస్తున్నారట. మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ సైతం కామ్ గానే సాగుతున్నారు. ఆయన నటిస్తోన్న మూవీ ‘ఇండో కొరియన్ హారర్ కామెడీ’తో తెరకెక్కుతోంది. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాకు మేర్లపాక గాంధీ డైరెక్టర్. రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాకే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని వరుణ్, గాంధీ భావిస్తున్నారు. ‘జటాధర’ సినిమాలో నటిస్తోన్న సుధీర్ బాబు సైతం ప్రస్తుతం సైలెన్స్ నే ఆశ్రయించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రచార పర్వం ప్రారంభమయ్యాకే సుధీర్ నోరు విప్పే ఛాన్స్ కనిపిస్తోంది.

 

 

 

 

 

 

ఇక మరో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం విషయానికి వస్తే ‘క’తో కనికట్టు చేసిన ఈయన ‘దిల్ రూబా’ పరాజయంతో కామ్ అయిపోయారు. ఇటీవల ‘కే ర్యాంప్’ సినిమా పూర్తి చేసిన కిరణ్ ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాల పైనే అబ్బవరం ఫుల్ హోప్ పెట్టుకున్నాడు. ఆనంద్ దేవరకొండ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కుతోంది. ఎలాంటి అప్డేట్స్ లేకుండా చిత్రీకరణ సాగుతోంది. ఇక అల్లరికి కేరాఫ్ అడ్రస్ గా నిలచిన సిద్ధూ జొన్నలగడ్డ ‘జాక్’ పరాజయంతో కుదేలయ్యారు. ప్రస్తుతం ‘తెలుసు కదా’లో నటిస్తున్న సిద్ధూ ఈ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. మొన్నటి వరకూ భలేగా సందడి చేసిన ఈ యంగ్ హీరోస్ అందరూ ఒకేసారి హంగామా వద్దు అనుకోవడం విశేషమే. మరి ఈ యువ కథానాయకుల్లో ఎవరెవరు ఏ సినిమాతో హిట్ కొడతారో చూద్దాం.

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో హవీష్‌ .

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో హవీష్‌

 

shine junior college

 

 

 

 

 

హవీష్ హీరోగా త్రినాథరావు నక్కిన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

 

 

యంగ్ టాలెంటెడ్ హీరో హవీష్ (Havish), సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు (Trinadha Rao Nakkina) కాంబోలో క్రేజీ మూవీ ఒకటి రూపుదిద్దుకుంటోంది.

 

 

‘నువ్విలా (Nuvvila), జీనియస్, రామ్ లీలా, సెవెన్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హవీష్‌. అలానే ‘సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా (Dhamaka), మజాక (Mazaka)’ వంటి చిత్రాల దర్శకుడిగా టాలీవుడ్ లో త్రినాథరావు నక్కిన కూ మంచి పేరుంది. వీరిద్దరి కలయికలో నిఖిల్ కోనేరు సినిమాను నిర్మిస్తోంది.

 

 

హవీష్‌ మూవీ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటోందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటీవల పూర్తయ్యింది. మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను ఈ నెల 19న రిలీజ్ చేయబోతున్నామని నిర్మాత నిఖిల కోనేరు తెలిపారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తుండగా.. నిజార్ షఫీ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.

కోలీవుడ్ హీరో ఆర్య ఇంట్లో ఐటీ దాడులు..

కోలీవుడ్ హీరో ఆర్య ఇంట్లో ఐటీ దాడులు.. 

shine junior college

 

 

 

 

 

కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య(Arya) నివాసంలో ఐటీ దాడులు నిర్వహించారు.

 

 

కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య(Arya) నివాసంలో ఐటీ దాడులు నిర్వహించారు. ఎప్పటికప్పుడు ఆర్య ఇలాంటి వివాదాల్లోనే ఇరుక్కుంటూ  ఉంటాడు. గతంలో ఒక  మహిళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఒక వ్యాపారవేత్తతో కలిసి రెస్టారెంట్ బిజినెస్ చేస్తూ  పన్ను ఎగ్గొట్టినట్లు గుర్తించిన అధికారులు నేడు ఆయనకు సంబంధించిన  వ్యాపార సంస్థలతో పాటు నివాసంలో కూడా ఐటీ దాడులను నిర్వహించారు. చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సీ షెల్ రెస్టారెంట్స్ లో కూడా ఈ దాడులను నిర్వహిస్తున్నారు. 

 

 

 

చెన్నైలోని అన్నా నగర్, కొట్టివాకం వేలచెరి, కిల్పాక్ ప్రాంతాల్లో ఉన్న సీ షెల్ రెస్టారెంట్స్ లో కూడా ఈ దాడులు జరుగుతున్నాయి.  ఈ రెస్టారెంట్ చైన్ కు ఆర్యకు సంబంధం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే గతంలో ఈ రెస్టారెంట్స్ అన్నింటిని.. వ్యాపారవేత్త అయినా కున్హి మూసాకు విక్రయించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.  ఇక కున్హి మూసా పై ఐటీ అధికారులు నిఘా పెట్టడంతో అది ఆర్య వరకు తీసుకొచ్చిందని సమాచారం. అందుకే ఆయన ఆఫీస్, ఇంట్లో కూడా అధికారులు  దాడులను నిర్వహించారు. ఇంకోపక్క ఆర్య తన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడని, అంతేకాకుండా పన్ను కట్టకుండా  తిరుగుతున్నాడని కూడా అధికారులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ దాడుల గురించి ఆర్య మాట్లాడుతూ.. ” ఆ రెస్టారెంట్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ రెస్టారెంట్ యజమాని నేను కాదు.. అతను వేరే వ్యక్తి.” అంటూ చెప్పుకొచ్చాడు. 

 

ఇక ఆర్య గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. రాజారాణి సినిమాతో ఆర్య తెలుగువారికి బాగా దగ్గరయ్యాడు. తెలుగులో అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు. ఇక ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్బింగ్  అవుతూ వస్తుంది.  ఇక ఆర్య ఒకపక్క హీరోగా.. ఇంకోపక్క నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. తెలుగులో ఆయన చివరగా నిర్మించిన సినిమా ఎనిమీ. విశాల్, ఆర్య నటించిన ఈ సినిమా తమిళ్ లో విజయాన్ని అందుకుంది కానీ తెలుగులో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

 

ఇక ఆర్య.. హీరోయిన్ సయేషా సైగల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సయేషా తెలుగులో అక్కినేని అఖిల్ డెబ్యూ చిత్రంగా వచ్చిన అఖిల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇక అఖిల్ తరువాత సయేషా తెలుగులో కనిపించలేదు.  ఈ జంటకు ఒక పాప కూడా ఉంది. ప్రస్తుతం సయేషా రీఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తోంది. 

పరాజయాల్లో డబుల్ హ్యాట్రిక్

పరాజయాల్లో డబుల్ హ్యాట్రిక్

 

shine junior college

 

 

 

 

 

నాలుగు పదుల వయసులోనూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది త్రిష. అయితే విజయాలు మాత్రం ఆమెను చూసి ముఖం చాటేస్తున్నాయి. ఆమె వరుసగా ఆరు పరాజయాలను తన ఖాతాలో వేసుకుంది.

 

 

 

 

 

త్రిష కృష్ణన్ (Trisha Krishnan) కెరీర్ కు ఫుల్ స్టాప్ పడిందని అందరూ అనుకుంటున్న సమయంలో ఫినిక్స్ పక్షిలా ఉవ్వెత్తున పైకి లేస్తూ వస్తోంది. నాలుగు పదుల వయసులోనూ క్రేజీ ప్రాజెక్ట్స్ ను అందిపుచ్చుకుంటూ తన అభిమానులను అలరిస్తోంది. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ’96’ సినిమాలో కొత్త త్రిషను చూశారు సినీ జనం. ఆమె అభిమానులు సైతం త్రిషలోని ఆ క్యూట్ యాంగిల్ ను చూసి అవాక్కయ్యారు. మళ్ళీ మరోసారి ఆమెను ఆరాధ్యదేవతగా కొలవడం మొదలు పెట్టారు. అలా త్రిష తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చేసింది. ఈ మధ్య కాలంలో ఇంత లాంగ్ రన్ కెరీర్ ను ఎంజాయ్ చేసిన హీరోయిన్లు పెద్దంతగా కనబడటం లేదు.

 

 

 

 

 

 

 

 

ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Maniratnam) తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ రెండు భాగాలలోనూ త్రిష కీలక పాత్రలను పోషించింది. ఐశ్వర్యారాయ్, ఐశ్వర్య లక్ష్మీ, శోభిత దూళిపాళ్ల తదితరులు ఇందులో నటించినా… వీరందరి కంటే త్రిష పాత్రకే అత్యధిక ప్రాధాన్యం ఆ రెండు భాగాల్లోనూ ఉంది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఘన విజయం సాధించకపోయినా… ఫర్వాలేదనిపించింది. అయితే… ఆ తర్వాత వరుసగా త్రిష పరాజయాలనే చవిచూస్తూ వచ్చింది. ‘పొన్నియన్ సెల్వన్ -2’ తర్వాత వచ్చిన థ్రిల్లర్ మూవీ ‘ది రోడ్’ పరాజయం పాలైంది. ఉమెన్ సెంట్రిక్ గా తెరకెక్కిన ఈ సినిమా త్రిషకు ఎలాంటి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ఆ తర్వాత వచ్చిన దళపతి విజయ్ ‘లియో’ సైతం త్రిషను నిరాశ పర్చింది. విజయ్ కు ఉన్న ఫ్యాన్ బేస్ కారణంగా మూవీకి ఓపెనింగ్స్ వచ్చినా… అది కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు.

 

 

 

 

 

 

 

 

విజయ్ మరో సినిమా ‘గోట్’లో త్రిష అతిథిపాత్రలో మెరిసింది. ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో ఫర్వాలేదనిపించింది కానీ ఆ విజయాన్ని త్రిష ఖాతాలో వేయలేదు. ఇక ఆ తర్వాత మలయాళ చిత్రం ‘ఐడెంటిటీ’లో త్రిష కీలక పాత్రను పోషించింది. ఇది కూడా ఎబౌ ఏవరేజ్ మూవీగానే ఉండిపోయింది. దీని తర్వాత అజిత్ హీరోగా నటించిన రెండు సినిమాల్లో త్రిష నటించింది. అందులో మొదటిది ‘విడుముయార్చి’ కాగా రెండోది ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. బ్యాక్ టు బ్యాక్ వచ్చిన ఈ రెండు సినిమాలు అభిమానులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. దాంతో ఈ యేడాది వచ్చిన మూడు సినిమాలూ త్రిషకు బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ నే ఇచ్చాయని చెప్పాలి.

 

 

 

 

 

 

 

 

 

 

ఈ యేడాది త్రిష నటించిన నాలుగో చిత్రంగా ఇటీవలే ‘థగ్ లైఫ్’ వచ్చింది. కమల్ హాసన్ తోనూ, శింబుతోనూ గతంలో త్రిష సినిమాలు చేసింది. అలానే మణిరత్నం తోనూ ‘పొన్నియన్ సెల్వన్’ చేసింది. అయితే ఈ అందరూ మళ్లీ కలిసి చేసిన ‘థగ్ లైఫ్’ కూడా ఘోర పరాజయం పాలైంది. దాంతో త్రిష ఫ్లాప్స్ లో హ్యాట్రిక్ పూర్తి చేసినట్టు అయ్యింది. ఈ యేడాది ఆమెకు ఇది వరుసగా నాలుగో పరాజయం.

 

 

 

 

 

 

 

 

 

 

 

ప్రస్తుతం త్రిష… మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ మూవీలో చేస్తోంది. గతంలో ‘స్టాలిన్’లో కలిసి నటించిన త్రిష చాలా కాలం తర్వాత ఈ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది కానీ ఆలస్యమైపోయింది. ఎప్పుడు విడుదల అయ్యేది ఇంకా మేకర్స్ రివీల్ చేయలేదు. మరి ‘విశ్వంభర’ తో త్రిష తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందో లేదో చూడాలి.

చైతన్య జ్ఞాపకాలతో కన్ఫ్యూజ్ చేస్తున్న సమంత

చైతన్య జ్ఞాపకాలతో అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తున్న సమంత 

 

shine junior college
సమంత వెనుక మెడ కింద ఏ మాయ చేసావే కి గుర్తుగా YMC అనే అక్షరాలను టాటూ వేయించుకుంది.
స్టార్ హీరోయిన్ సమంత(Samantha) అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తుందా.. ? అంటే నిజమే అనే మాట వినిపిస్తుంది. అంతలా ఆమె ఏ విషయంలో కన్ఫ్యూజ్ చేసింది అని అంటే.. తాన్ మాజీ భర్త నాగ చైతన్య(Naga Chaithanya) గుర్తులను చెరిపేసిందా.. ? లేదా అనే విషయంలో అన్నమాట. ఏ మాయ చేసావే(Ye Mayaa Chesave) సినిమాతో సామ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమా తరువాత స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక ఏ మాయ చేసావే సినిమాలో తనతో రొమాన్స్ చేసిన నాగ చైతన్యనే సామ్ ప్రేమించి పెళ్లి చేసుకుంది.

పెళ్లి తరువాత అక్కినేని ఇంటి పెద్ద కోడలిగా ఆమె మంచి హోదానే అందుకుంది. ఆ సమయంలోనే తన ప్రేమకు గుర్తుగా ఒంటిపై మూడు టాటూలు వేయించుకుంది.  ఇక కలకాలం కలిసి ఉంటారన్న ఈ జనతా నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి చై ను సామ్ మర్చిపోలేక బాగా సతమతమవుతోందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే వస్తున్నాయి. ఇక ఇప్పటికే చై గుర్తులను ఒక్కొక్కటిగా చెరిపేస్తూ వస్తుందని.. ఆమె నడుము పై భాగంలో ఉన్న చై అనే టాటూను రిమూవ్ చేయించిందని వార్తలు వచ్చాయి.

ఇక  ఈ మధ్యనే ఆమె ఇంకో టాటూను కూడా చెరిపివేసిందని వార్తలు వచ్చాయి. ఆమె వెనుక మెడ కింద ఏ మాయ చేసావే కి గుర్తుగా YMC అనే అక్షరాలను టాటూ వేయించుకుంది. ఆ సినిమా వలనే  చై తో పరిచయం ఏర్పడిందనే గుర్తుగా  ఆ టాటూను వేయించుకుంది. ఇక మొన్నటికి మొన్న ఒక వీడియోలో ఆ టాటూ కనిపించకపోవడంతో.. చై గుర్తుగా ఉన్న చివరి టాటూను కూడా సామ్ చెరిపేసి కొత్త జీవితాన్ని మొదలుపెడుతుందని వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా బాంద్రాలో సామ్ జిమ్ అవుట్ ఫిట్ లో ఆమె కారు ఎక్కుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోలో YMC  టాటూ క్లియర్ గా కనిపించింది. అంటే మొన్న వీడియోలో సామ్ ఆ టాటూను మేకప్ తో కవర్ చేసిందని తెలుస్తోంది.  నిజంగా ఆమె ఈ టాటూస్ ను చెరిపివేయలేదని.. కావాలనే అప్పుడప్పుడు సామ్  ఇలా మేకప్ వేసి  ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తుందని తెలుస్తోంది. దీంతో నెటిజన్స్  ఆమె తీరుపై మండిపడుతున్నారు. ఎప్పుడు ఒకేలా ఉండాలని.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలనుకున్నప్పుడల్లా టాటూ గేమ్  ఆడుతున్నావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే సామ్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక వెబ్ సిరీస్ చేస్తోంది. 

రశ్మికతో కలిసి మళ్లీ దొరికిపోయాడు…

రశ్మికతో కలిసి మళ్లీ దొరికిపోయాడు…

 

shine junior college

హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రశ్మిక మందణ్ణ మధ్య సాగుతున్న ప్రేమాయాణం ఇవాళ మొదలైందేమీ కాదు. అయితే వీరిద్దరూ ఆ విషయాన్ని ఇంతవరకూ అధికారికంగా మాత్రం చెప్పలేదు. దాంతో ఎక్కడైనా వీరిద్దరు కలిసి కనిపిస్తే పాపరాజీలకు అది పండగలా ఉంది.

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), నేషనల్ క్రష్‌ (National crush) రశ్మిక మందణ్ణ (Rashmika Mandanna) మధ్య సాగుతున్న ప్రేమాయణం గురించి ఇవాళ కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. కొన్నేళ్ళుగా సాగుతున్నదే. అయితే తమ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమానుబంధం గురించి రశ్మిక బయటపడినట్టుగా విజయ్ దేవరకొండ మాత్రం బయట పడటం లేదు. వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నాడు.

రశ్మిక మాత్రం అవకాశం కుదిరినప్పుడల్లా విజయ్ ఫ్యామిలీతో తనకున్న బాండింగ్ ను విడమర్చి, విపులంగా చెబుతోంది. ఎవరు ఆ రిలేషన్ షిప్ గురించి ప్రశ్నించినా… సంకోచం లేకుండా దాచుకోకుండా డైరెక్ట్ గా చెప్పడం లేదు కానీ ఇన్ డైరెక్ట్ గా అందరికీ తెలిసిందేగా అనేస్తోంది. రశ్మిక ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా… ఆమె చుట్టు పక్కల విజయ్ దేవరకొండ లేదా అతని ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా? అని పరికించి చూడడం అందరికీ అలవాటైపోయింది. అలానే విజయ్ దేవరకొండ ఫారిన్ ట్రిప్ వేసినా… అదే ప్లేస్ కు రశ్మిక కూడా వెళ్ళే ఉంటుందనే సందేహంతో ఆమె సోషల్ మీడియాను సెర్చ్ చేయడం కామన్ అయిపోయింది. ఏ మాత్రం హింట్ దొరికినా… ఇద్దరు ప్రేమికులు కలిసే వెళ్ళారోచ్ అంటూ ఆధారాలతో ఆ ఫోటోలను పెట్టడం పరిపాటిగా మారింది.

తాజాగా అలాంటి సంఘటనే ఒకటి ముంబైలో చోటు చేసుకుంది. విజయ్ దేవరకొండ, రశ్మిక మందణ్ణ ఇద్దరూ ముంబై ఎయిర్ పోర్ట్ నుండి వస్తున్న ఫోటో ఒకటి నిన్న రాత్రి నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైట్ కలర్ డ్రస్ లో రశ్మిక ఉండగా, బ్లూ కలర్ డ్రస్ లో విజయ్ దేవరకొండ ఉన్నాడు. ఇద్దరూ ముఖాలకు మాస్క్ పెట్టుకున్నారు. ఎయిర్ పోర్ట్ బయట కారు ఎక్కుతుండగా కొందరు దీనిని సెల్ లో బంధించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విజయ్ దేవరకొండ ఇప్పుడు ‘కింగ్ డమ్’ (Kingdom) మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా జూలై నెలాఖరులో లేదా ఆగస్ట్ లో విడుదల కాబోతోంది. అలానే రశ్మిక నటించిన ‘కుబేర’ (Kubera) సినిమా 20వ తేదీ జనం ముందుకు వస్తోంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులను మరింత వెయిట్ చేయించకుండా ఈ జంట ఎప్పుడు తమ ప్రేమకు సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తుందో చూడాలి.

భయపడి అడుగు ఆపకే

భయపడి అడుగు ఆపకే

 

shine junior college

నితిన్‌ హీరోగా శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తమ్ముడు’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు…

నితిన్‌ హీరోగా శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తమ్ముడు’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. సప్తమి గౌడ కథానాయిక. జులై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. మంగళవారం చిత్రబృందం ‘ఆగకే అమ్మాడీ… భయపడి అడుగు ఆపకే’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేసింది ఈ సందర్భంగా చిత్రబృందం స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. లయ వర్ష బొల్లమ్మ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌, సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్‌

కూలీ సంచ‌ల‌నం.. రైట్స్‌తో రికార్డుల మోత‌

కూలీ సంచ‌ల‌నం.. రైట్స్‌తో రికార్డుల మోత‌

shine junior college

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కూలీ చిత్రం విడుద‌ల‌కు ముందే సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది.

 

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ (Rajinikanth) 171 చిత్రంగా డైరెక్ట‌ర్ లోకేశ్ క‌న‌గ‌రాజ్ (Lokesh Kanagaraj) క‌ల‌యిక‌లో బంగారం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న రూపొందుతున్న‌ చిత్రం కూలీ (Coolie). భారీ బ‌డ్జెట్‌తో ఎన్నో అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రంలో నాగార్జున (Nagarjuna Akkineni), ఉపేంద్ర (Upendra), షౌబిన్ (Soubin Shahir), స‌త్య‌రాజ్(Sathya Raj), శృతిహాసన్ (Shruti Haasan) వంటి సౌత్ ఇండియా సూప‌ర్‌ స్టార్లు కీల‌క పాత్ర‌లు పోషించ‌గా అనిరుధ్ ర‌విచంద‌ర్ (Anirudh Ravichander) సంగీతం అందించాడు. స‌న్ పిక్చ‌ర్స్ (Sun Pictures) నిర్మించింది.

 

 

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న‌ ఈ చిత్రం అగ‌ష్టులో 14న థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమానుంచి ఇటీవ‌ల విడుద‌ల చేసిన‌ గ్లిమ్స్ సినిమాపై అమాంతం అంచ‌నాలు పెంచ‌గా.. ఆ వీడియోలో ర‌జ‌నీ మిన‌హా ఏ హీరో ముఖం డైరెక్టుగా క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం విశేషం.ఇదిలాఉంటే ఈ సినిమా విదేశీ రైట్స్ విష‌యంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుస్తున్నాయి. ప్ర‌స్తుతం మార్కెట్‌లో ఈ వార్త హాట్ టాపిక్ అయింది.

 

 

బాక్సాపీస్ వ‌ద్ద‌ ‘కూలీ’ చిత్రం విదేశీ రైట్స్‌ ధర సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. ప్రస్తుతం విదేశీ పంపిణీ హక్కుల బిజినెస్‌ ప్రారంభమైన క్ర‌మంలో ఈ మూవీ రైట్స్‌ సొంతం చేసుకునేందుకు ప్రముఖ సంస్థ ఏకంగా రూ.70 నుంచి రూ.80 కోట్ల మేర చెల్లించేందుకు ముందుకొచ్చింద‌ని వినికిడి. అయినప్పటికీ చిత్ర నిర్మాత కళానిధి మారన్‌ మరింత అధిక మొత్తాన్ని డిమాండ్‌ చేస్తున్నారని దాంతో ఈ ఫారిన్‌ రైట్స్‌ బిజినెస్ చ‌ర్చ‌లు ఇంకా న‌డుస్తూనే ఉన్నాయ‌ని ఈ నెలాఖ‌రున అన్నీ ఫైన‌ల్ అవుతాయ‌ని స‌మ‌చారం. ఈ సినిమా హక్కులను రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్లకు విక్రయిస్తే మాత్రం.. తమిళ చిత్ర పరిశ్రమలో ఈ రైట్స్ సరికొత్త మైలురాయిగా నిలుస్తుందని కోలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

నాకు నటించడమే రాదన్నారు

నాకు నటించడమే రాదన్నారు

shine junior college

‘శతమానం భవతి’, కార్తికేయ 2’ లాంటి పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో కథానాయికగా తెలుగు ప్రేక్షకులను అలరించారు అనుపమ పరమేశ్వరన్‌. ఆమె నటించిన ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ అనే…

 

‘శతమానం భవతి’, కార్తికేయ 2’ లాంటి పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో కథానాయికగా తెలుగు ప్రేక్షకులను అలరించారు అనుపమ పరమేశ్వరన్‌. ఆమె నటించిన ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ అనే మలయాళ చిత్రం ఈనెల 27న విడుదలవుతోంది. ఇందులో లాయర్‌గా సురేశ్‌ గోపీ నటించారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అనుపమ మాట్లాడుతూ ‘నాకు నటన రాదంటూ చాలా మంది ట్రోల్‌ చేశారు. అయినా దర్శకుడు ప్రవీణ్‌ నాకు అవకాశం ఇచ్చారు. ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ వంటి గొప్ప చిత్రంలో ఎంపిక చేశారు. నాపై నమ్మకంతో ఇలాంటి పాత్రను ఇవ్వడమే నాకు దక్కిన విజయంగా భావిస్తున్నాను. ఇక నుంచి ప్రేక్షకులకు నచ్చే సినిమాలు మాత్రమే అంగీకరించాలని నిర్ణయించుకున్నా. కొవిడ్‌ సమయంలో నా కెరీర్‌ పరంగా, జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను’ అని చెప్పారు. కాగా, అనుపమ వ్యాఖ్యలపై సురేశ్‌ గోపీ స్పందించారు. ఒక నటిపై వివక్షను ప్రదర్శించడం మలయాళ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఇదే తొలిసారి కాదని అన్నారు. ‘అనుపమ మాట్లాడిన మాటలు ఆమె హృదయాంతరాళం నుంచి వచ్చాయి. గతంలో నటి సిమ్రాన్‌ విషయంలోనూ ఇదే విధంగా జరిగింది. మలయాళ చిత్రపరిశ్రమ ఆమెను చిన్నచూపు చూసి ఇండస్ట్రీ వదిలిపోయేలా చేసింది’ అని అన్నారు.

మెగాస్టార్‌తో డ్యూయెట్‌

మెగాస్టార్‌తో డ్యూయెట్‌

shine junior college
చిరంజీవి కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం (మెగా 157-వర్కింగ్‌ టైటిల్‌) షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా…
చిరంజీవి కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం (మెగా 157-వర్కింగ్‌ టైటిల్‌) షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఉత్తరాఖండ్‌లోని మసూరీలో రెండో షెడ్యూల్‌ మొదలైంది. ఇందులో చిరంజీవి సహా ప్రధాన తారాగణం అంతా పాల్గొంటోంది. మంగళవారం నయనతార సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, నయనతారపై కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించనున్నారు. దర్శకుడిగా వరుస విజయాలను అందుకుంటున్న అనిల్‌ రావిపూడి ప్రేమ, కుటుంబ విలువలతో హృద్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో చిరంజీవి పాత్ర చిత్రణ నవ్యపంథాలో ఉంటుంది, ప్రేక్షకులు ఆశించే అంశాలతో ఆసక్తికరంగా సాగుతుంది అని యూనిట్‌ తెలిపింది. షైన్‌స్ర్కీన్స్‌, గోల్డ్‌బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి

ఓటీటీకి.. తెలుగు సీట్ ఎడ్జ్ సూపర్ నేచురల్ థ్రిల్లర్

ఓటీటీకి.. తెలుగు సీట్ ఎడ్జ్ సూపర్ నేచురల్ థ్రిల్లర్

shine junior college

 

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేంద‌కు చాలా రోజుల త‌ర్వాత‌ ఓ స్ట్రెయిట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ సిద్ద‌మ‌వుతోంది.

 

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేంద‌కు చాలా రోజుల త‌ర్వాత‌ ఓ స్ట్రెయిట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ (Viraatapalem) సిద్ద‌మ‌వుతోంది. మిస్ ఫ‌ర్‌ఫెక్ట్ సిరీస్ ఫేమ్‌ అభిజ్ఞ వూతలూరు (Abhignya Vuthaluru) లీడ్ రోల్‌లో, చరణ్ లక్కరాజు (Charan Lakkaraju) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌గా కృష్ణ పోలూరు (Poluru Krishna) దర్శకత్వం వ‌హించారు. గ‌తంలో శ్రీ రామ్‌, శివ‌బాలాజీల‌తో రెక్కీ (Recce) అనే క్రైమ్ థ్రిల్ల‌ర్ సిరీస్‌ను రూపొందించి మంచి విజ‌యం ద‌క్కించుకున్న‌ సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై శ్రీరామ్ మ‌లి ప్ర‌య‌త్నంగా ఈ సిరీస్‌ను నిర్మించారు.

 

1980లలో ఓ మారుమూల గ్రామం విరాటపాలెం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరికి ఉన్న శాపం వ‌ళ్ల అక్క‌డ‌ ప్రతి వధువు తమ‌ పెళ్లి రోజునే మరణిస్తుంటారు. దీంతో దశాబ్దంగా ఆ ఐర్లో పెళ్లిళ్లు అనేవి లేకుండా పోయి ప్ర‌తి ఒక్క‌రూ తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌తో జీవిస్తుంటారు. ఈక్ర‌మంలో ఒక పోలీస్‌ కానిస్టేబుల్ ఆ గ్రామానికి రావడం, అక్కడి శాపం గురించి తెలుసుకోవడం, ఆ రహస్యాన్ని ఛేదించడం అనే ఉత్కంఠభరితమైన కథనంతో అందరినీ ఆకట్టుకునేలా ఈ సిరీస్ ఉండబోతోంది.

మూఢనమ్మకాలతో కొట్టుమిట్టాడే ప్రాంతంలో భయం అనేది సమాజాన్ని ఎలా నియంత్రించగలదో, ధైర్యం అనేది దశాబ్దాల నిశ్శబ్దాన్ని ఎలా భంగపరచగలదో ఓ శక్తివంతమైన సందేశంతో ఈ సిరీస్‌ను మ‌లిచారు. ఈ నేప‌థ్యంలోగ్రామంలో ఉండే రహస్యాలు, దాన్ని ఛేదించేలా ఇంట్రెస్టింగ్‌గా సాగే ఇన్వెస్టిగేషన్ క‌థ‌కు అదిరిపోయే సూపర్‌నేచురల్ థ్రిల్లర్ అంశాల‌ను మేళ‌వించి చూసే ప్రేక్ష‌కుల‌కు సీట్ ఎడ్జ్ థ్రిల్‌ ఇవ్వ‌నున్నారు. ఇప్పుడీ సిరీస్ జూన్ 27 నుండి ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండ‌గా త్వ‌ర‌లో ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా దర్శకుడు కృష్ణ పోలూరు, నిర్మాత శ్రీరామ్‌, న‌టి అభిజ్ఞలు మాట్లాడుతూ.. ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ సిరీస్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. ప్రతి వధువు తన పెళ్లి రోజున మరణిస్తుంది. దాంలో అది ఆ విలేజ్‌లో భయంగా, భయం నిశ్శబ్దంగా మారిపోతుంది. అలాంటి గ్రామంలోని ఆ నిశ్శబ్దాన్ని ఛేదించడమే ఈ సిరీస్ కథ అని అన్నారు. రియల్ లొకేషన్స్, గ్రామీణ వ్యక్తులతో చిత్రీక‌రించామ‌ని, ప్రేక్షకులు ఈ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ (Viraatapalem) సిరీస్‌ను ఎప్పుడెప్పుడు వీక్షిస్తారా? అని ఆత్రుతతో ఎదురుచూస్తున్నామ‌ని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version