Public Asked to Cooperate for Census
జన గణనకు ప్రజలంతా సహకరించాలి…
మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
భారత జనగణన లో భాగంగా ఈనెల 11వ తేదీ నుండి వచ్చే నెల 9 తేదీ వరకు మొదటి దశ కింద ఇండ్ల జాబితా, ఇండ్ల ఘనన సమాచార సేకరణ కార్యక్రమం నిర్వహించబడుతుందని, ప్రజలంతా సహకరించాలని క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ మారుతి ప్రసాద్ కోరారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలంతా వారి ఇండ్లకు వచ్చే ఎన్యుమరేటర్లకు సహకరించాలని 44 ప్రశ్నలకు సరైన సమాచారం అందించి జనగణనకు సహకరించాలని కమిషనర్ కోరారు. ప్రభుత్వ గుర్తింపు కార్డులతో ఎన్యుమరేటర్లు వస్తారని వారికి ప్రజలంతా సహకరించాలని జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ఇండ్ల ఘనన స్వీయ గణన కొరకు ఆన్లైన్లో స్వీయ గణన పూర్తి చేసుకున్న వారు వారి ఐడి నెంబర్ ను ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్లకు చూపించాలని తెలిపారు.
