ఘనంగా NHRC గ్రేటర్ వరంగల్ ముఖ్యుల సమావేశం

గుర్తింపు కార్డుల పంపిణీకి శ్రీకారం

హాజరైన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

హనుమకొండ (గ్రేటర్ వరంగల్): జాతీయ మానవ హక్కుల కమిటీ గ్రేటర్ వరంగల్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, కాజీపేట పట్టణాల ముఖ్య నాయకుల సమావేశం గ్రేటర్ వరంగల్ అధ్యక్షురాలు బాలినే లక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య, గౌరవ అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి గూడూరు మాంచాలక్క, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బేతు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య మాట్లాడుతూ జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర స్థాయిలో దినదిన అభివృద్ధి చెందుతూ జాతీయస్థాయిలో అనేక రాష్ట్ర కమిటీల నిర్మాణాలు జరుగుతున్న వేళ ఓరుగల్లు సభ్యుల సలహా, సహకారం మర్చిపోలేనిదని అన్నారు. ప్రతి సమయంలో తనకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే వ్యవస్థలో మన NHRC సభ్యులు ముందుండాలని పిలుపునిచ్చారు. అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం బాధ్యతగల భారత పౌరులుగా భారత రాజ్యాంగ చట్టాలపై అవగాహన పెంచుకొని నవభారత నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని అన్నారు. హక్కులు బాధ్యతలు తెలుసుకొని ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అది అన్యాయమని తెలిస్తే శివునితోనైనా పోరాడటానికి వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. చట్టాలకు లోబడి పని చేయాలని తెలిపారు. సంస్థ ద్వారా తీసుకునే గుర్తింపు కార్డులను మంచి పనికి మాత్రమే ఉపయోగించుకోవాలని కోరారు. ఐడి కార్డుల పేరుతో వ్యక్తిత్వాన్ని ఎక్కడ తాకట్టు పెట్టకుండా సమాజంలో గొప్ప పౌరులుగా పేరు తెచ్చుకోవాలని సభ్యులను కోరారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ సభ్యులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ ప్రధానకార్యదర్శి గోరపూడి భాస్కరరావు, హనుమకొండ జిల్లా అధ్యక్షులు పూజరి సత్యనారాయణ సార్, వరంగల్ జిల్లా అధ్యక్షులు నల్ల రవికిరణ్, గ్రేటర్ వరంగల్ ఉపాధ్యక్షులు న్యాయవాది మాదాసు మొగులయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ గుణదల మురళీమోహన్, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉచత శ్రీకాంత్, ఉపాధ్యక్షురాలు కీసరి ఇందిరా, అధికార ప్రతినిధి జగన్ మోహన్ రావు, సంయుక్త కార్యదర్శి విసంపల్లి నగేష్, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు బానోత్ నెహ్రూ నాయక్, కోమండ్ల శ్రీనివాస్, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల కృష్ణ యాదవ్, కాజీపేట మండల అధ్యక్షులు నాగరాజు, ఉపాధ్యక్షులు రాజేంద్రప్రసాద్ ప్రధాన కార్యదర్శి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *