: Grand Felicitation to Shravan
నూతన పట్టణ అధ్యక్షుడు శ్రావణ్ కు ఘన సన్మానం
శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్ అల్లే దశరథం
పరకాల,నేటిధాత్రి
పట్టణంలోని 22వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నూతన పట్టణ అధ్యక్షుడిగా నియమితులైన ఒంటేరు శ్రావణ్ కుమార్కు స్థానిక కౌన్సిలర్ అల్లే దశరథం,వార్డు అధ్యక్షుడు అజయ్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు,వార్డు ప్రజలు కలిసి ఘన సన్మానం నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ వార్డు అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు.ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం అందుబాటులో ఉంటానని చెప్పారు.అలాగే పరకాలలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మహేందర్, బోయిని తిరుపతి,సాదు రాజు,పెద్దరాజు,శోభన్, నాగవెల్లి,సరోతం,పెద్దరాజు, నాయకులు,కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.
