వ్యర్థాలతో నిండుతున్న పెద్దచెరువు
జంతు కళేబరాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు పాడవేసిన చెత్తతో దుగ్గొండి పెద్దచెరువు వ్యర్థాలతో నిండిపోతున్నదని బహుజన సమాజ్‌వాది పార్టీ నర్సంపేట నియోజకవర్గ అధ్యక్షుడు గజ్జి దయాకర్ ఆరోపించారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండల కేంద్ర పెద్దచెరువులో రోజురోజుకు వ్యర్థాలు పెరిగిపోయి చెత్త, జంతు కళేభరాలు, వివిధ రకాల వ్యర్థలతో నిండి వున్నాయని, రాబోయే వర్షాకాలంలో చెరువు నిండి ఆ వ్యర్ధాలతో తాగునీటి బావిలో కలిసి తాగునీరు కూడా కలుషితం అయ్యి ప్రజలు రోగాల బారినపడే ప్రమాదం ఉందని తెలిపారు. వర్షాకాలంలో అంటువ్యాదులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని, అలాగే గ్రామంలోని జంతువులు చెరువులో నీటిని ఎల్లప్పుడు తాగుతూ ఉంటాయని, అవి కూడా రోగాలకు గురయ్యే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ సమస్యల పట్ల సంబంధిత గ్రామపంచాయతీ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తగిన చర్యలు తీసుకుని వాతావరణ కాలుష్య నివారణను అరికట్టాలని దయాకర్ కోరారు.