ఏఐఎస్ఎఫ్, ఏ బి ఎస్ ఎఫ్ఆధ్వర్యంలో వరంగల్ (డి ఐ ఓ) కి వినతి పత్రం
వరంగల్, నేటిధాత్రి:
వరంగల్ జిల్లాలోని రంగశపేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో షిఫ్టింగ్ విధానం వలన ఆ కాలేజీలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇబ్బంది పడుతూ విద్యను ఆపేసే పరిస్థితి నెలకొందని అన్నారు వివిధ దూర ప్రాంతంలో నుంచి కళాశాలకు వచ్చి విద్య అభ్యసిస్తున్న తరుణంలో షిఫ్టింగ్ విధానం వలన గ్రామీణ పట్టణ ప్రాంతంలోని విద్యార్థులు విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు కావున ఉన్నంత అధికారులు తక్షణమే స్పందించి సిట్టింగ్ విధానాన్ని రద్దుచేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాశాల కొనసాగించే విధంగా చూడగలరని అన్నారు లేని పక్షాన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు శివ రోజా స్రవంతి రాకేష్ ఏ బి ఎస్ ఎఫ్ నాయకులు ప్రశాంత్ వినయ్ శ్రీకాంత్ ప్రమోద్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు