Grand Lakshmi Narasimha Jatara Held
కన్నుల పండుగగా దుంపేట లక్ష్మి నరసింహ స్వామి వారి జాతర
నేటి ధాత్రి కథలాపూర్
జగిత్యాల జిల్లా కథలా పూర్ మండల దుంపేట గ్రామంలో ఈరోజు దుంపేట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి జాతర అత్యంత భక్తి శ్రద్ధలతో, ఘనంగా నిర్వహించబడింది. పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ జాతరకు పరిసర గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి వారి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఈ ఆలయం స్వయంభు క్షేత్రంగా ప్రసిద్ధి ఆలయ ప్రాంగణం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.
జాతరలో భాగంగా జరిగిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. రేపు తెల్లవారుజామున జరిగే రథోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలువ నుంది భక్తులు “జై లక్ష్మి నరసింహ స్వామి” నినాదాలతో రథాన్ని లాగుతూ భక్తి పరవశంలో మునిగిపోతారు అని గ్రామం ప్రజలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామం సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామం విడిసి సభ్యులు గ్రామ పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
