Farmers Advised to Reduce Urea Use
తక్కువ యూరియా వాడండి
సాగు ఖర్చు తగ్గించండి
నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడండి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేటమండలం పెద్దకొడేపాక గ్రామంలో రైతు ముగ్గిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ఘనంగా నిర్వ హించారు వరంగల్ వ్యవసా య కళాశాల శాస్త్రవేత్తలు, విద్యార్థులు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు. రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం జరిగింది.
ముఖ్య అతిథిగా డా. విద్యాధర్, ప్రొఫెసర్ డా. సిద్ధార్థ నాయక్ , టీచింగ్ అసోసియేట్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ యూరియాను అవసరానికి మించి వినియోగించడం వల్ల నేలలో నత్రజని అసమతు ల్యత ఏర్పడి భూసార శక్తి క్రమంగా తగ్గిపోతుంది. అధిక యూరియా వినియోగం వల్ల సూక్ష్మధాతు పోషకాల లోపం, నేల ఆమ్లత్వం పెరగడం, పం టల పెరుగుదలలో అసమాన తలు ,దిగుబడి నాణ్యత తగ్గుదల వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపారు.శాస్త్రీయ నిర్వహ ణలో భాగంగా నానో యూ రియా వినియోగం ద్వారా నత్రజని సమర్థవంతంగా మొక్కలకు అందుతుందని, నీమ్ కోటెడ్ యూరియా వల్ల నత్రజని నష్టాలు తగ్గి దీర్ఘకా లం మొక్కలకు అందుబా టులో ఉంటుందని వివరిం చారు. వర్మీ కంపోస్ట్ వాడకం ద్వారా నేలలో సేంద్రియ కార్బ న్ పెరిగి, సూక్ష్మజీవుల క్రియా శీలత మెరుగుపడి భూసార శక్తి పెరుగుతుంది అలాగే లీఫ్ కలర్ చార్ట్ ఆధారంగా పంట ఆకుల రంగును పరిశీలించి అవసరమైనప్పుడు మాత్రమే యూరియా వినియోగించడం వల్ల ఎరువుల వృథా తగ్గి, సాగు ఖర్చు తగ్గి, పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యమవు తుందని రైతులకు సూచిం చారు.వ్యవసాయ విస్తరణ అధికారి అన్వేష్ ఏ ఈ ఓ రైతులకు ప్రభుత్వ పథకాలు, నేల పరీక్షల ప్రాముఖ్యత సమ తుల్య ఎరువుల వినియో గంపై అవగాహన కల్పించారు. ఎన్జీఓ ప్రజ్వల్ ఫీల్డ్ ఆఫీసర్ మహ్మద్ హనీఫా సహజ వ్యవసాయం, సేంద్రియ పద్ధతుల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్ర మంలో వరంగల్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు తేజస్విని, తయబ్బా తదితరులు పాల్గొని రైతులకు అవగాహన కల్పించడంలో చురుకైన పాత్ర పోషించారు. గ్రామ రైతులు ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా విని, శాస్త్రవేత్తలు అందించిన సూచనలను ఆచరణలో పెట్టేందుకు ముందుకు వచ్చారు.రైతు సంక్షేమం, నేల ఆరోగ్యం మరియు స్థిరమైన వ్యవసాయాభివృద్ధి కోసం ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని నిర్వాహకులు తెలిపారు.
