`ఇదే తెలంగాణ ప్రజలందరి మనోగతం.
`బీఆరఎస్ గెలవాలి..కేటీఆర్ సీఎం కావాలి.
`నాయకులు కన్ఫ్యూస్ కావొద్దు.
`ఎవరికిష్టమొచ్చినట్లు వాళ్ళు మాట్లాడొద్దు.
`కేసీఆర్ కూడా కోరుకునేది కేటీఆర్ సీఎం కావాలనే విషయం ఎవ్వరు మరవొద్దు.
`కార్యకర్తలను గందరగోళంలోకి నెట్టొద్దు.
`పార్టీ వేదికలన్నిటిలో ఇదే విషయం స్పష్టం చేయాలి.
`సీనియర్ నాయకులు కూడా వేదికల మీద ఇదే చెప్పాలి.
`కేసీఆర్ ను సీఎం చేయడమే మన లక్ష్యమని ప్రకటించాలి.
`ఇదే తెలంగాణ యువతరం కోరుకుంటున్న నిజం.
`కేటీఆర్ ఎక్కడికెళ్లినా వినిపిస్తున్న ఏకైక నినాదం.
`కేటీఆర్ తో సెల్ఫీ ల కోసం ఎగబడుతున్న జనం.
`చిన్న, పెద్ద అనే తేడా లేకుండా జై కొడుతున్న విధానం.
`అందరి మదిలో కేటీఆర్ ఏకైక కనిపిస్తున్న పదం కేటీఆర్ సీఎం.
`ఆఖరుకు పెళ్లి కూతురు కూడా కేటీఆర్ సీఎం అని చెప్పిన క్షణం.
`కెటిఆర్ ను చూసిన సంబరంలో వస్తున్న యువత పలుకుతున్న పదం కేటీఆర్ సీఎం
`అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్న విషయం కేటీఆర్ సీఎం.
`తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు వినిపిస్తున్న ఏకైక పదం.
`ఏ సభకు కేటీఆర్ హాజరైనా మారుమొగుతున్న నినాదం.
`యువత గుండె చప్పుడు కూడా అంటున్న ఏకైక లయ విన్యాసం కేటీఆర్ సీఎం.
`ఇంతకన్నా ఏముంటుంది ఒక నాయకుడికి ఆనందం.
`ఇంతగా జనం కోరుకుంటుంటే కేటీఆర్ సీఎం కోసం కాలమే సహకారం.
`అందుకే వినిపిస్తోంది ప్రతి నోట కేటీఆర్ సీఎం.
`ఈ సారి కేటీఆర్ సీఎం అవ్వడం ఖాయం..
`తెలంగాణ కొత్త రాజకీయ ప్రపంచం చూడడం తథ్యం.
`కేటీఆర్ నాయకత్వంలో ప్రజలు చూడాలనుకుంటున్న తెలంగాణ ప్రగతి ప్రయాణం.
`గతంలో కొన్ని దుష్ట శక్తులు అడ్డు పడే ప్రయత్నం చేశాయి.
`కేటీఆర్ ను అప్పుడే సీఎం కాకుండా రాజకీయం చేశాయి
`ఇప్పుడు ఏ అడ్డు లేదు.. దుష్ట శక్తులకు తావులేదు.
`కొత్తగా పార్టీ లో చేరిన నాయకులు కూడా కేటీఆర్ మన కాబోయే సీఎం అనాలి.
`ప్రజలకు ఈ సంకేతం బలంగా వెళ్ళాలి.
`కార్యకర్తలు, నాయకులు గట్టిగా వినిపించాలి.
హైదరాబాద్, నేటిధాత్రి:
ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి యువ నాయకుడు, బిఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటిఆర్ కావాల్సిందే అని ప్రజలంతా అనుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ యువత కేటిఆర్‌ను సిఎంగా చూడాలనుకుంటున్నారు. అలాదేశంలో ఇప్పటి వరకు యువత అనుకున్నట్లుగా ఎక్కడా అలాంటి వాతావరణం కనిపించలేదు. ఒక్క తెలంగాణలోనే కేటిఆర్ ఎక్కడికెళ్లినా, ఎక్కడ కనిపించినా యువతతోపాటు, పెద్దఎత్తున ప్రజలు కేటిఆర్‌కు జేజేలు పలుకుతున్నారు. సిఎం. సిఎం అంటూ గోల చేస్తున్నారు. యువతలో అంతగా కేటిఆర్ అనే మూడక్షరాలు నాటుకుపోయాయి. తెలంగాణలో కేసిఆర్ నాయకత్వంలో బిఆరఎస్ గెలవాలి. కేటిఆర్ సిఎం. కావాలని జనమంతా బలంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే పదేళ్ల కాలంలో ఆయన చూపిన పని తనం అలాంటిది. ఏ దేశంలోనూ ఎంత పెద్ద నాయకుడు చేయలని అనేక పనులను అలవోకగా చేశారు. తెలంగాణ బంగారు తెలంగాణ చేయడంలో కేటిఆర్ కషి అంత సామాన్యమైంది కాదు. తమిళనాడుకు చెందిన హీరో రజనీకాంత్ ఓ పదేళ్ల తర్వాత హైదరాబాద్ వచ్చి అసలు నెనెక్కడున్నాను. ఇది తెలంగాణనేనా? హైదరాబాదేనా? అంటూ అబ్బురపడి చెప్పిన మాటలు చాలదా? అన్నం ఉడికిందా? లేదా? అని తెలుసుకునేందుకు ఒక్క మెతుకు చాలు. అలాగే కేటిఆర్ నాయకత్వ పాలన గురించి ఈ ఒక్క మాట చాలు. తెలంగాణ ప్రదాత కేసిఆర్ ఆశయాలను ఆచరణలో చేసి చూపించిన నాయకులు ఇద్దరు. ఒకరు కేటిఆర్. మరొకరు హరీష్‌రావు. ఇద్దరూ పార్టీ, ప్రభుత్వలో జోడు గుర్రాల్లాగా పనిచేశారు. అభివద్ది విషయంలో హరీష్sవుకు అనుభవం వున్న గ్రామీణ ప్రాంతాల ప్రగతి కోణంలో వ్యవసాయం,నీటి పారుదల హరీష్‌రావు చూసుకున్నారు. ఉన్నత విద్యావంతుడై దేశవిదేశాలలో నగర ప్రాంతాలు, పట్టణీకరణ వంటి అనేక అంశాలపై అవగాహన వున్న నాయకుడు కేటిఆర్. పైగా ఆయన దేశ విదేశాలలో పారిశ్రామిక ప్రగతి ఎలా వుంది. ఐటి రంగం ఎలా పురోభివద్ది జరిగిందన్న దానిపై పూర్తి అవగాహన వున్న నాయకుడు కేటిఆర్. అందుకే తెలంగాణ వచ్చిన వెంటనే తెలంగాణ ప్రగతిలో నగరాభివద్ది, పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దారు. పైగా ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించడం కేసిఆర్ కల. ఆ కల నెరవేర్చిన నాయకుడ కేటిఆర్. అటు పాలన, ఇటు పార్టీని ఏక కాలంలో చూసుకున్న నాయకుడు కేటిఆర్. అలాంటి నాయకుడు కొన్ని శాఖలకు మంత్రిగా వుంటేనే ఇంత ప్రగతి తెలంగాణ సాధించింది. కేటిఆర్ సిఎం. అయితే తెలంగాణ ఐదేళ్ల కాలంలో ఎలా వుంటుందో ఊహిస్తేనే బంగారు తెలంగాణ కళ్లముందు కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన తెలంగాణను బంగారు తెలంగాణ ఆవిష్కారంలో కీలక భూమిక పోషించారు. కేసిఆర్ పాలన స్వర్ణయుగం అని చరిత్రలో నిలిచేందుకు అహర్నిషలు కషి చేశారు. హైదరాబాద్ నగరగంలో 60 ఏళ్ల ఉమ్మడి పాలనలో నిర్మానం జరిగిన ఫై ఓవర్లు కేవలం 13. కాని పదేళ్లలో కేసిఆర్ హయాంలో మంత్రి గా కేటిఆర్ దగ్గరుండి నిర్మాణం చేయించిన ప్లైఓవర్లు 47. ఇంకా కొన్ని పెండింగ్‌లో ఈ ప్రభుత్వంలో నత్త నడకన సాగుతున్నాయి. కొన్ని కేటిఆర్ పూర్తి చేసిన వాటిని ఈ ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఆ ఘనత మొత్తం కేటిఆర్‌కే దక్కుతుంది. అందువల్ల ఈసారి ఎన్నికల్లో బిఆరఎస్ గెలవాలి. అందుకు నాయకులు, కార్యకర్తలంతా వచ్చే రెండేళ్లు కషి చేయాలి. బిఆరఎస్‌ను బంపర్ మెజార్టీతో గెలిపించాలి. కేటిఆర్‌ను సిఎం. చేయాలి. ఇదే కార్యాచరణ కావాలి. ప్రతి నాయకులు ఇదే ఆచరించాలి. అంతే తప్ప ఏ నాయకుడు కన్ఫ్సూస్ కావొద్దు. నాయకులు,కార్యకర్తలను గందరగోళంలోకి నెట్టొదు. ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్లు మాట్లాడొద్దు. భహిరంగ సభలలో కేసిఆర్, కేటిఆర్‌లు ఏం మాట్లాడినా, పార్టీ సమావేశాలలో మాత్రం నాయకులంతా కేటిఆర్ సిఎంను చేయాలన్న ఆలోచనలతోనే మాట్లాడాలి. కేటిఆర్‌కు సిఎం. కావడానికి అవసరమైన పాజిటివ్ వాతావరణం సష్టించాలి. యువతకు వున్న సోయి నాయకులకు కూడా కావాలి. ఎందుకంటే కేటిఆర్‌కు ఏ పెళ్లికి వెళ్లినా, ఏ శుభ కార్యానికి వెళ్లినా అక్కడ పార్టీలతో సంబంధం లేకుండా నాయకులు, కార్యకర్తలు, యువత కేటిఆర్ సిఎం. సిఎం అంటున్నారు. అలాంటిది పార్టీ నాయకులు ఏమైంది? ఆ మాట ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. కొత్తగా పార్టీలో చేరిన నాయకులైనా, కార్యకర్తలైనా, ఉద్యమనాయకులైనా, ఉద్యమ కార్యకర్తలైనా సరే ఇక నుంచి అందరూ కేటిఆర్ సిఎం. అనే మాటనే పదే పదే ప్రస్తావించాలి. ఒక ఆహ్లాదరకమైన వాతావరణం సష్టించాలి. ఆ మాటలు జనానికిచేరాలి. యువతకు కూడా కేటిఆర్ వస్తున్నాడన్న ధైర్యం కలగాలి. అందుకే ఇప్పటి నుంచి పార్టీ వేధికల మీద అన్ని చోట్ల కేటిఆర్ సిఎం కావాలన్న ధోరణే నాయకులందరిలోనూ కనిపించాలి. వినిపించాలి. ప్రతి నాయకుడు, కార్యకర్త కేటిఆర్‌ను సిఎం చేయడమే మన లక్ష్యమని చెప్పే స్ధితి అడుగడుగనా కనిపించాలి. ఇది తెలంగాణ యువతరం ఆశ. ఆశయం కూడా. ఈసారి జరిగే ఎన్నికల్లో కేటిఆర్ నాయకత్వంలో పార్టీ ప్రభంజనం సష్టించడం ఖాయం. ఓ వైపు గత పదేళ్ల కేసిఆర్ పాలన కాలం మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కళ్లముందు 365 రోజుల కనిపించిన నీళ్లు కావాలంటున్నారు. ఏడాది మొత్తం ఎండిపోకుండా వుండే చెరువులకు మళ్లీ పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నారు. ప్రతి ఆరు నెలలకోసారి రైతులకు రైతు బంధు గతంలో టంగ్ టంగ్ మని పడ్డట్లు పడాలని కోరుకుంటున్నారు. పదేళ్ల కాలంలో వేసిన రోడ్లు మళ్లీ గుంతలు లేకుండా బాగు పడాలంటే కేటిఆర్ రావాలని కోరుకుంటున్నారు. ఐటి రంగం మరింత విసతమై, తెలంగాణ యువతకు ఉద్యోగ కల్పన పెరగాలంటే కేటిఆర్ రావాలనుకుంటున్నారు. దేశ విదేశ ప్రతినిధులను ఒప్పించి, మెప్పించి పరిశ్రమý ఏర్పాటు చేయించగల శక్తి వున్న ఏకైక నాయకుడు కేటిఆర్. తెలంగాణలో మళ్లీ పారిశ్రామిక విప్లవం రావాలంటే కేటిఆర్రావాలి. అందవల్ల చిన్నా పెద్దా కోరుకుంటున్న కేటిఆర్ సిఎం. కావాలి. ఈ మధ్య కేటిఆర్ ఓ పెళ్లికి వెళ్తే పెళ్లి కూతురు కూడా కేటిఆర్ సిఎం. అంటూ నినాదాలు చేసిందంటే యువతలో ఆయన స్ధానం ఎంత బలంగా వుందో ఆ ఒక్క సాక్ష్యం చాలు. అంతే కాదు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి కేటిఆర్ హజరైన సందర్భంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా కేటిఆర్ సిఎం. అంటూ నినాదాలు చేశారంటే కేటిఆర్ పాపులారిటీ తెలంగాణలో ఎంత పెరిగిందో అర్దం చేసుకోవచ్చు. అన్నం పెట్టే నాయకుడిని దూరం చేసుకున్నందుకు తెలంగాణ సమాజం మొత్తం బాధపడుతుంది. చేజేతులా కాంగ్రెస్ మాటలు నమ్మి, కన్న కొడుకులా చూసుకుంటున్న కేసిఆర్‌ను కాదనుకంటే పడరాని పాట్లు పడుతున్నామని పల్లె జనం అంటున్నారు. రైతులు మళ్లీ కరంటు కోతలు చూస్తున్నారు. ఆ గోసలు అనుభవిస్తున్నారు. అందుకే కేసిఆర్ గత ఎన్నికల్లో ప్రజలకు మోసపోతే గోస పడతామని చెప్పినా, కాంగ్రెస్ మాయ మాటలు పై చేయి సాదించాయి. నిజం గడపదాటేలోపే అబద్దాలు ఊరి చుట్టి వస్తాయన్నట్లు, కాంగ్రెస్ నాయకులు ఇంత పని చేస్తారని ఎవ్వరూ అనుకోలేదు. కేసిఆర్ చేసిన పనులు ఆపేస్తారని అనుకోలేదు. కాళేశ్వరం పండబెడతారని అనుకోలేదు. చెరువులు నింపకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తారని అనుకోలేదు. దాంతో కాంగ్రెస్ నమ్మారు. ఇక మళ్లీ కాంగ్రెస్‌ను మరో యాభై ఏళ్లయినా తెలంగాణ ప్రజలు నమ్మరు. కేసిఆర్‌ను వదులుకోరు. బిఆరఎస్‌ను దూరం చేసుకోరు. తెలంగాణ ఆత్మ వుండేది బిఆరఎస్ నాయకుల్లోనే. ముఖ్యంగా కేసిఆర్, కేటిఆర్లోనే అనేది అందరికీ తెలుసు. కేసిఆర్ తర్వాత అంతటి పాలనా సామార్ధ్యం వున్న నాయకుడు కేటిఆర్ మాత్రమే అని తెలుసు. అందుకు ఇకనుంచి అందరూ కేటిఆర్ సిఎం. అనే నినాదమే ఎత్తుకోవాలి. అందరూ కలిసి కేటిఆర్‌ను సిఎం. చేయాలి.
